లాలూ ప్రసాద్ యాదవ్ ప్రధాన అనుచుడి కాల్చివేత, షార్ఫ్ షూటర్లు, సీఎం మీద ?

Posted By:
Subscribe to Oneindia Telugu

పాట్నా: బీహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్ జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ కు అత్యంత సన్నిహితుడు, ఆ పార్టీ సీనియర్ నాయకుడు కేదార్ రాయ్ ను గురువారం ఉదయం గుర్తు తెలియని వ్యక్తులు రివాల్వర్లతో కాల్చి హత్య చేశారు. కేదార్ రాయ్ హత్యతో బీహార్ లో ఆందోళనలు మొదలైనాయి.

లాలూ ప్రసాద్ యాదవ్, ఆయన కుటుంబ సభ్యులకు కేదార్ రాయ్ చాల సన్నిహితుడు. ఆర్ జేడీ పార్టీలో సీనియర్ నాయకుడు. గురువారం ఉదయం పాట్నా సమీపంలోని దానాపూర్ లో వాకింగ్ వెలుతున్న సమయంలో కేదార్ రాయ్ ని గుర్తు తెలియని వ్యక్తులు రివాల్వర్లతో కాల్చారు.

Rashtriya Janata Dal (RJD) leader shot dead in Bihar

మూడు బుల్లెట్లు దూసుకుపోవడంతో కేదార్ రాయ్ కుప్పకూలిపోయాడు. వెంటనే ఆయన్ను పాట్నాలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే కేదార్ రాయ్ మరణించాడని వైద్యులు చెప్పారు. విషయం తెలుసుకున్న కేదార్ రాయ్ అనుచరులు ఆయన ఇంటి దగ్గర గుమికూడారు.

బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ అండతోనే కేదార్ రాయ్ ని హత్య చేశారని ఆరోపిస్తు ధర్నా చేశారు. బీహార్ లో జేడీ-యూ. బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఆర్ జేడీ నాయకులు హత్యకు గురౌతున్నారని లాలూ ప్రసాద్ యాదవ్ మద్దతుదారులు ఆరోపించారు.

Bihar crisis: Lalu Yadav says, Nitish Kumar main accused in murder case | Oneindia News

కేదార్ రాయ్ ని షార్ప్ షూటర్లు హత్య చేశారని, బుల్లెట్లు మిస్ కాకుండా చాకచక్యంగా కాల్చి చంపారని పోలీసులు చెప్పారు. జులై 29వ తేదీన శివాన్ ఎంపీ మొహమ్మద్ షహాబుద్దీన్ ప్రధాన అనుచరుడు, ఆర్ జేడీ పార్టీ యూత్ విభాగం సీనియర్ నాయకుడు మినహజ్ ఖాన్ ను శివాన్ జిల్లాలో రివాల్వర్లతో కాల్చి హత్య చేశారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Bihar RJD leader in Bihar was shot dead near here on Thursday by unidentified assailants, police said. Kedar Rai was out on his morning walk in Danapur when the attack took place, the Bihar police said.
Please Wait while comments are loading...