ఓటమి వేళ.. అయ్యను, అన్నను కాదనుకుని వెళ్లిన కూతురు
బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని చవి చూసింది.. రాష్ట్రీయ జనతాదళ్. అధికారంలోకి వస్తామనే ఆశలపై ఎన్నికల ఫలితాలు నీళ్లు చల్లాయి. జనతాదళ్ (యునైటెడ్)- భారతీయ జనతా పార్టీ సారథ్యంలోని ఎన్డీఏ కూటమి 202 సీట్లతో విజయదుందుభి మోగించింది. ఆర్జేడీ- కాంగ్రెస్ కూటమి 35 స్థానాలకే పరిమితమైంది. ఎన్నో అంచనాలు పెట్టుకున్నప్పటికీ.. అధికారంలోకి రాకపోవడం ఆర్జేడీని తీవ్ర నిరాశకు గురి చేసింది.
ఈ పరిస్థితుల్లో మరో షాక్ తగిలిందా పార్టీకి. లాలూ ప్రసాద్ యాదవ్ కుమార్తె, పార్టీ నాయకురాలు రోహిణి ఆచార్య రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. కుటుంబంతో కూడా సంబంధాలను తెంచుకుంటున్నట్లు ప్రకటించారు. తన అధికారిక ఎక్స్ అకౌంట్ లో దీనికి సంబంధించిన సమాచారాన్ని పోస్ట్ చేశారు. బీహార్ ఎన్నికల ఫలితాలు వెలువడిన 24 గంటల లోపే ఆమె ఈ సంచలన నిర్ణయం తీసుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

ఈ ఓటమి తర్వాత పార్టీ మనుగడ కష్టమనుకుంటోన్న దశలో కుటుంబంలో కూడా విభేదాలు తలెత్తడం మరింత ఆందోళన కలిగిస్తోంది. సంజయ్ యాదవ్, రమీజ్ తనను ఈ నిర్ణయం తీసుకోవాలని కోరినట్లు రోహిణి ఆచార్య తెలిపారు. మొదట రాజకీయాల నుంచి మాత్రమే తప్పుకుంటున్నట్లు ప్రకటించిన ఆమె ఆ తరువాత ఆ పోస్ట్‌ను ఎడిట్ చేశారు. ఈ ఇద్దరి పేర్లను చేర్చారు. అన్ని ఆరోపణలను తనపై వేసుకుంటానని పేర్కొన్నారు.
సంజయ్ యాదవ్‌తో రోహిణికి చాలా కాలంగా విభేదాలు ఉన్నాయని, ఇది బీహార్ ఎన్నికల ప్రచారంలో స్పష్టంగా కనిపించిందని ఆర్జేడీ సీనియర్ నాయకులు చెబుతున్నారు. రోహిణి ఆచార్య చేపట్టిన బస్సు యాత్ర సమయంలో సంజయ్ యాదవ్ ముందు సీట్లో కూర్చోవడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఓ ఎక్స్ యూజర్ పోస్ట్ చేయగా, రోహిణి దాన్ని షేర్ చేయడం అప్పట్లో దుమారం రేపింది. ఇది వారి మధ్య దూరాన్ని మరింత పెంచింది.
ఈ పరిణామాలు ఎన్నికల ఓటమి కారణంగానే కాకుండా.. అంతర్గత కుటుంబ కలహాల వల్లే చోటు చేసుకున్నాయనే ఊహాగానాలు బీహార్ రాజకీయాల్లో వ్యక్తమౌతోన్నాయి. గతంలోనూ రోహిణి ఇలాంటి సంకేతాలను ఇచ్చారు. సెప్టెంబరులో ఆమె ఓ పోస్ట్ పెట్టారు. "ఓ కూతురిగా, సోదరిగా నా కర్తవ్యాన్ని, ధర్మాన్ని నెరవేర్చాను. భవిష్యత్తులో కూడా నెరవేరుస్తాను. నాకు ఏ పదవీకాంక్ష లేదు, రాజకీయ ఆశయాలు కూడా లేవు. నా ఆత్మగౌరవమే నాకు ముఖ్యం" అని అప్పట్లో రాశారు.
-
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్












Click it and Unblock the Notifications