వైరల్ వీడియో: వీళ్లేం పోలీసులు..? గర్భిణిని స్కూటీతో గుద్దుకుంటూ..!
పోలీసులు అంటే చట్టాన్ని కాపాడాలి.. కానీ ఇలా చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడం ఆందోళన కలిగిస్తోంది. మహిళలకు అండగా ఉండాల్సిన వాళ్లే.. వారి పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు. తాజాగా ఓ షాకింగ్ ఘటన సభ్య సమాజం తలదించుకునేలా ఉంది. ఓ ట్రాఫిక్ పోలీసు.. కొంచెం కూడా కనికరం లేకుండా ఓ గర్భిణిని స్కూటీతో గుద్దుకుంటూ వెళ్లాడు. ఆమె వారిస్తున్నా అలాగే పబ్లిక్ లో ఇష్టం వచ్చినట్లు వ్యవహరించాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు పోలీసు వ్యవస్థకే సిగ్గుచేటు అంటూ కామెంట్స్ పెడుతున్నారు.
గర్భిణిపై కర్కశత్వాన్ని ప్రదర్శించాడు ఓ పోలీసు. నిండు పబ్లిక్ లో ఆమెతో అసభ్యంగా ప్రవర్తించాడు. స్కూటీతో ఆమెను గుద్దుకుంటూ వెళ్లాడు. ఈ షాకింగ్ ఘటన బిహార్ లోని పాట్నాలోని మెరైన్ డ్రైవ్ ప్రాంతంలో జరిగింది. రాంగ్ రూట్ లో వచ్చిన ఓ జంటను ట్రాఫిక్ పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఇరు వర్గాల మధ్య కొద్దిసేపు వాగ్వాదం జరిగింది.

స్కూటీపై రూ. 12వేలు చలానా ఉన్నట్లు గుర్తించిన పోలీసులు.. స్కూటీని సీజ్ చేయాలని నిర్ణయానికి వచ్చారు. దాంతో ట్రాఫిక్ పోలీసులను గర్భిణి, ఆమె భర్త అడ్డుకున్నారు. తాను గర్భిణి అని చాలానా బిల్లు కడతానని వెళ్లనివ్వాలని మహిళ కోరింది. అయితే ట్రాఫిక్ పోలీసులు అందుకు అంగీకరించలేదు. బండిని సీజ్ చేస్తుండగా ఆమె అడ్డుపడింది. దీంతో స్కూటీపై ఉన్న ఓ ట్రాఫిక్ పోలీసు ఆమెను అలాగే గుద్దుకుంటూ ముందుకు వెళ్లాడు. ఈ ఘటనను పక్కనే ఉన్న ప్రజలు వీడియో తీశారు.
इस पुलिस वाले की हिम्मत देखिए, यह किस तरह से एक गर्भवती महिला को अपने स्कूटी से रौंदनें की कोशिश कर रहा है।
— Priya singh (@priyarajputlive) November 19, 2025
यह वीडियो पटना के मरीन ड्राइव का है pic.twitter.com/QapP9avC2J
చాలానా ఫీజు కట్టేస్తామని ఆ దంపతులు ట్రాఫిక్ పోలీసులను వేడుకున్నారు. దాంతో వారిని స్కూటీ ఇచ్చి అక్కడి నుంచి పంపించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ట్రాఫిక్ పోలీసుపై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. సదరు ట్రాఫిక్ పోలీసుపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. వీళ్లేం పోలీసులు అంటూ కామెంట్స్ పెడుతున్నారు.
-
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్












Click it and Unblock the Notifications