సరిహద్దులో ఏదో పెద్ద ఘటనే జరిగింది...త్వరలో బయటపెడతా: రాజ్‌నాథ్ సింగ్
Recommended Video

బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ కానిస్టేబుల్ నరేంద్ర సింగ్‌ను పాక్ బలగాలు హత్యచేసిన విధానంపై ప్రస్తావించిన కేంద్రహోంశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ .. గత మూడు రోజుల్లో సరిహద్దుల్లో ఏదో జరుగుతోందని అనుమానం వ్యక్తం చేశారు. భగత్ సింగ్ 111వ జయంతిని పురస్కరించుకుని ఉత్తర్‌ప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌లో ఆయన భగత్ సింగ్ విగ్రహాన్ని ఆవిష్కరించి సభలో ప్రసంగించారు. భారత్‌లో శాంతి ఉండకుండా చేసేందుకు పాక్ ప్రయత్నిస్తోందని రాజ్‌నాథ్ సింగ్ మండిపడ్డారు. మన సెక్యూరిటీ బలగాలను పాకిస్తాన్ అంత హీనంగా ఎలా చూస్తుందని ప్రజలు మండిపడుతున్నారని చెప్పారు.
సరిహద్దుల్లో ఏదో జరుగుతోంది. అది ఇప్పుడు తాను చెప్పలేనని చెప్పారు రాజ్‌నాథ్ సింగ్. సరిహద్దులో చాలా పెద్ద ఘటనే జరిగిందని చెప్పిన రాజ్‌నాథ్ త్వరలో బయటపెడతానని చెప్పారు. అంతేకాదు భవిష్యత్తులో ఈ ఘటనకు ప్రతీకారంగా ఏమి జరుగుతుందో మీరే చూస్తారు అని సభలో చెప్పారు రాజ్‌నాథ్ సింగ్. పాకిస్తాన్ బలగాలు పాల్పడిన ఈ ఘోరానికి రియాక్షన్ త్వరలోనే ఉంటుందని హెచ్చరించిన రాజ్‌నాథ్ సింగ్ పాకిస్తాన్‌లోని అధికారులకు కూడా ఫిర్యాదు చేశామని అయినా వారు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఫైర్ అయ్యారు.

భారత సైన్యం ప్రతీకారచర్య చేపట్టాలని రాజ్‌నాథ్ సింగ్ ఈ సందర్భంగా అన్నారు. పాకిస్తాన్ తోకజాడిస్తే తోకను కట్ చేయాల్సిందిగా రాజ్‌నాథ్ సింగ్ ఆదేశాలు జారీ చేశారు. మన పొరుగు దేశం కాబట్టి గౌరవిద్దామని భారత సైన్యంకు చెప్పినట్లు రాజ్‌నాథ్ వెల్లడించారు. అదే అలుసుగా తీసుకుని పాక్ ఒక్క బుల్లెట్ కాల్చినా... మన బుల్లెట్ల సంఖ్యను లెక్కబెట్టకుండా వారిపై కాల్పులు జరపాల్సిందిగా సైన్యానికి చెప్పినట్లు రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు .
సర్జికల్ స్ట్రైక్స్ జరిగి రెండు సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా నాటి ఘటనను గుర్తు చేశారు రాజ్‌నాథ్ సింగ్. ప్రధాని నాడు ఎంతో ధైర్యంతో నిర్ణయం తీసుకున్నారని అందుకే మన సైనికులు సరిహద్దులు దాటి పాక్ జవాన్లను మట్టుబెట్టి వచ్చారని రాజ్‌నాథ్ చెప్పారు. పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోకి మన సెన్యం 2016 సెప్టెంబర్ 29న చొచ్చుకెళ్లి పాక్ ఆర్మీని మట్టుబెట్టిందని గుర్తు చేశారు.
-
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్












Click it and Unblock the Notifications