
ఆజాంఖాన్ దోషి, మూడేళ్ల జైలు.. యోగిపై వ్యాఖ్యల ఫలితం
విద్వేష వ్యాఖ్యల కేసులో సమాజ్ వాదీ పార్టీ సీనియర్ నేత ఆజాం ఖాన్ దోషిగా తేలారు. ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్‌పై చేసిన కామెంట్లపై రాంపూర్ కోర్టు తీర్పునిచ్చింది. అతనికి రాంపూర్ కోర్టు మూడేళ్ల జైలు శిక్షను ఖరారు చేసింది.
నమోదైన అభియోగాల మేరకు మూడు ఏళ్ల జైలు శిక్ష పడింది. రెండేళ్లు అంతకన్నా ఎక్కువగా జైలు శిక్ష పడితేనే.. రాష్ట్ర అసెంబ్లీ నుంచి సభ్యత్వం కోల్పోవాల్సి ఉంటుంది. సో.. అతని పదవీ ఊడింది. ఇదొక్క కేసే కాదు దాదాపు 90 కేసుల వరకు ఉన్నాయి. అందులో అవినీతి, దోపిడి లాంటి కేసులు కడా ఉన్నాయి.

చీటింగ్ కేసులో దోషిగా ఉన్న ఆజాం ఖాన్ ఈ ఏడాది బయటకు వచ్చారు. సుప్రీంకోర్టు ఆయనకు మధ్యంతర బెయిల్ ఇవ్వడంతో విడుదల అయ్యారు. ఇప్పుడు మరో కేసు కూడా ఉంది. గత సార్వత్రిక ఎన్నికల సమయంలో ఆజాం ఖాన్ హాట్ కామెంట్స్ చేశారు. ముఖ్యంగా జయప్రద లక్ష్యంగా విమర్శలు చేశారు. అవీ అప్పట్లో పెద్ద దుమారమే రేగింది. ఎన్నికల సంఘం కూడా అతని ప్రచారంపై నిషేధం విధించింది.