తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు
నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల తేదీలను కేంద్ర ఎన్నికల కమిషన్ ప్రకటించింది. ఏప్రిల్ 9వ తేదీన కేరళ, అదే నెల 23వ తేదీన తమిళనాడు అసెంబ్లీకి ఎన్నికలు జరుగనున్నాయి. ఒకేదశలో ఇవి ముగుస్తాయి. మే 4వ తేదీన ఓట్లను లెక్కిస్తారు. ఈ వివరాలను కేంద్ర ఎన్నికల కమిషన్ ప్రకటించింది. ఎన్నికలు ఎదుర్కొంటోన్న నాలుగు రాష్ట్రాల్లో పశ్చిమ బెంగాల్ కూడా ఉంది. ఈ రాష్ట్రంతో పాటు తమిళనాడు, కేరళ, అస్సాం, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరీ ఉన్నాయి.
విజయ్ ఎంట్రీ ఇస్తోండటంతో ..
ఈ పరిణామాల మధ్య అసెంబ్లీ తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలపై సర్వేలు వెలుగులోకి వస్తోన్నాయి. వివిధ ప్రీపోల్ సంస్థలు తమ అంచనా వెల్లడిస్తోన్నాయి. ప్రత్యేకించి ఈ ఎన్నికల్లో మాస్ హీరో విజయ్ ఎంట్రీ ఇస్తోండటంతో అంచనాలు మారిపోతున్నాయి. తలకిందులు అవుతున్నాయి. స్టాలిన్ ప్రభుత్వం తిరిగి అధికారంలోకి వస్తుందంటూ ఇదివరకే ఒకట్రెండు సర్వేలు సూచించిన నేపథ్యంలో ఆయా నివేదికలన్నీ కూడా ప్రాధాన్యతను సంతరించుకుంటోన్నాయి.

డీఎంకే వరుసగా రెండోసారి..
తాజాగా సివిక్ పోల్ అనాలసిస్ కమిటీ (సీప్యాక్) తాజాగా తమిళనాడు అసెంబ్లీపై తన అంచనాలను విడుదల చేసింది. ఈ సర్వే ప్రకారం చూస్తే మొత్తం 234 మంది సభ్యులు ఉన్న తమిళనాడు శాసనసభ ఎన్నికల్లో డీఎంకే ప్రభంజన కనిపిస్తుంది. ముఖ్యమంత్రి స్టాలిన్ సారథ్యంలోని డీఎంకే వరుసగా రెండోసారి అధికారంలోకి రావడం ఖాయమైంది. తన ప్రభుత్వాన్ని నిలబెట్టుకుంటుంది. 2021లో జరిగిన ఎన్నికల మాదిరిగానే పట్టును నిలుపుకొంటుంది.
డీఎంకే కూటమికి మొత్తంగా 128..
నాటి ఎన్నికల్లో డీఎంకే- కాంగ్రెస్ కూటమి స్వీపింగ్ విక్టరీ సాధించిన విషయం తెలిసిందే. డీఎంకే సొంతంగా 133 సీట్లు సాధించింది. మొత్తంగా కూటమి 159 సీట్లు గెలుచుకుని స్టాలిన్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు అప్పట్లో. ఇప్పుడు కూడా అదే స్థాయిలో సీట్లను డీఎంకే కూటమి దక్కించుకుంటుందని సీప్యాక్ అంచనావేసింది. డీఎంకే కూటమికి మొత్తంగా 128 సీట్లు లభిస్తాయని పేర్కొంది.
ఎన్నికల అవసరాల కోసం పొత్తు..
మాజీ ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి నాయకత్వంలో ఏఐఏడీఎంకే ఈ ఎన్నికలతో ఉనికిని కోల్పోయే అవకాశాలు లేకపోలేదు. సీప్యాక్ అంచనాల ప్రకారం అన్నాడీఎంకే- బీజేపీ కూటమి కనీసం డబుల్ డిజిట్లు కూడా దక్కవు. ఎనిమిది సీట్లకే పరిమితం కాబోతోంది. 2021 ఎన్నికల్లో కలిసి పోటీ చేసి, ఆ తర్వాత విడిపోయిన పార్టీలివి. మళ్లీ ఎన్నికల అవసరాల కోసం పొత్తు పెట్టుకోవడాన్ని తమిళనాడు ఓటర్లు స్వాగతించట్లేదు. పైగా భాషాపరమైన వివాదాల కారణంగా తమిళనాడులో బీజేపీకి ఇప్పటికే వ్యతిరేకతను మూటగట్టుకుంది. దాని ప్రభావం అన్నాడీఎంకే పైనా పడొచ్చు.
ఏఐఏడీఎంకే ఓటు బ్యాంక్..
ఏఐఏడీఎంకే ఓట్లన్నింటినీ కూడా విజయ్ తన్నుకుపోయే అవకాశాలు ఉన్నట్లు సీప్యాక్ అభిప్రాయపడింది. ఏకంగా టీవీకే 98 సీట్లను గెలుచుకునే అవకాశం ఉందని తెలిపింది. ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చడంతో పాటు ఏఐఏడీఎంకే ఓటు బ్యాంక్ ను కూడా టీవీకే తీవ్రంగా ప్రభావితం చేయడం ఖాయంగా కనిపిస్తోంది. వ్యతిరేక ఓటు అన్నాడీఎంకేకు బదులుగా టీవీకే వైపు మొగ్గు చూపడం ఈ సర్వేలో హైలైట్ గా చెప్పుకోవచ్చు.
డీఎంకే అద్భుతమైన మెజారిటీ..
రీజియన్లవారీగా చూస్తే.. మెజారిటీ ప్రాంతాల్లో టీవీకే హవా వీస్తుంది. చెన్నై, కోయంబత్తూరు రీజియన్లల్లో టీవీకే బలంగా ఉంది. తమిళనాడు కోస్తా, మధ్య- ఉత్తర ప్రాంతంలో డీఎంకే బలీయమైన శక్తిగా అవతరించింది. మధురై రీజియన్ తో పాటు కోస్టల్ బెల్ట్ మొత్తంలో డీఎంకే అనుకూలంగా ఓటు పడే అవకాశం ఉందని, ఆయా చోట్ల డీఎంకే అద్భుతమైన మెజారిటీతో దూసుకుపోతుందని సీప్యాక్ స్పష్టం చేసింది. వీటిల్లో వాస్తవం ఏమిటనేది మే 4వ తేదీన తేలుతుంది.
-
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం- లేటెస్ట్ లెక్కలు -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
Tamil Nadu Election Survey: పవన్ ఫీట్ రిపీట్ చేస్తున్న విజయ్ ? తేల్చేసిన తాజా సర్వే..! -
విజయ్ పై కక్షసాధింపు? -
'పెద్ది' స్థానంలో విజయ్ 'జన నాయగన్'.. ఇదేం ట్విస్ట్ సామీ..! -
భారీగా ఆస్తులు కూడబెట్టిన త్రిష.. తమిళనాడు ఎన్నికల నేపథ్యంలో వీటిపై తీవ్ర చర్చ -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
మళ్లీ మొదలెట్టావా పాప.. ప్రెగ్నెన్సీ నిజమేనా? -
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
విజయ్ దేవరకొండపై ఆ స్టార్ హీరో భార్య సీక్రెట్ లవ్.. పెళ్లయినా ఆగని..! -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..!












Click it and Unblock the Notifications