వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మా ప్రభుత్వ నిర్ణయం కరెక్ట్: ఇండియా డాటర్స్ బ్యాన్‌పై మోడీ

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: బ్రిటిష్ బ్రాడ్ కాస్టింగ్ కార్పొరేషన్ (బీబీసీ) రూపొందించిన వివాదాస్పద డాక్యుమెంటరీని తమ ప్రభుత్వం నిషేధించడం సబబే అని భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సమర్థించుకున్నారు. మహిళలకు రక్షణ కల్పించడం తమ బాధ్యత అన్నారు.

ఢిల్లీలో పారామెడికల్ విద్యార్థినిపై లైంగిక దాడి చేసి దారుణంగా హత్య చేసిన విషయం తెలిసిందే. ఈ సంఘటన నేపథ్యంలో బ్రిటిష్ బ్రాడ్ కాస్టింగ్ కార్పొరేషన్ వివాదాస్పద డాక్యుమెంటరీని తయారు చేసింది. ఆ డాక్యుమెంటరికి ఇండియా డాటర్స్ అనే పేరు పెట్టి వివాదం రేపింది.

 the Nirbhaya documentary 'India's daughter

ఇండియా డాటర్స్ డాక్యుమెంటరీ పై నిషేధిస్తూ తమ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సరైనదే అని నరేంద్ర మోదీ అంటున్నారు. లేదంటే ఆ బాధిత మహిళను పదేపదే చూపించడం, ఆమెను గుర్తు పట్టే అవకాశం ఉన్నందువలన డాక్యమెంటరిని నిషేదించాలని నిర్ణయం తీసుకున్నామని అన్నారు.

భారతదేశంలో మహిళలను కాపాడటం తమ ధర్మం, కర్తవ్యమని,మహిళలకు రక్షణ కల్పిస్తామని, వారి మనోభావాలను గౌరవిస్తామని మోడీ అన్నారు. బీజేపీ ప్రభుత్వానికి దేశంలోని అన్ని మతాలు సమానమే అని ప్రధాని నరేంద్ర మోడీ వివరించారు.

English summary
Prime Minister Narendra Modi defended his government's decision to ban the documentary of rapists of Nirbhaya
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X