ఇలా తప్పించుకో: డేరా బాబాకు సహకరించిన ముగ్గురు పోలీసుల అరెస్ట్

Posted By:
Subscribe to Oneindia Telugu

చంఢీఘడ్: ఇద్దరు సాధ్వీలపై అత్యాచారం చేసిన ఘటనలో 20 ఏళ్ళ పాటు శిక్ష అనుభవిస్తున్న డేరా బాబా రామ్ రహీమ్ సింగ్ తప్పించుకొనేందుకు కుట్ర పన్నారని పోలీసులు తేల్చారు. అయితే రామ్ రహీమ్ సింగ్‌కు ముగ్గురు హర్యానా పోలీసులు సహకరించారని తేల్చారు. ఈ ముగ్గురిని అరెస్ట్ చేసి విచారణ జరుపుతున్నారు.

డేరా బాబా: భక్తుల కోసం డ్రింక్, కానీ...47 నియమాలు తప్పనిసరి

ఇద్దరు సాధ్వీలపై అత్యాచారం చేసిన ఘటనలో ప్రస్తుతం జైల్లో శిక్షను అనుభవిస్తున్న డేరా సచ్చా సౌధా చీఫ్ గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ పారిపోయేందుకు కొందరు పోలీసులు ప్లాన్ చెప్పారు.. ఈ విషయాన్ని తెలుసుకున్న హర్యానా పోలీసు శాఖ ముగ్గురు పోలీసులను గురువారం సాయంత్రం అరెస్ట్ చేసింది.

Three Haryana Cops Arrested For Conspiring To Free Gurmeet Ram Rahim From Rohtak Prison


ఇద్దరు హెడ్ కానిస్టేబుళ్లు, మరో కానిస్టేబుల్ కలసి గుర్మీత్ ఎలా పారిపోవచ్చన్న విషయమై ప్రణాళిక రచించారు. ఈ విషయాన్ని రామ్‌రహీమ్ సింగ్‌కు చెప్పారు.ఈ వి
షయం తెలుసుకొన్న పోలీసు ఉన్నతాధికారులు వారిని విచారిస్తున్నారు.

ఏ రూట్‌లో రామ్‌రహీమ్‌ను తీసుకెళ్ళనున్నారు. ఎంతమంది పోలీసులతో భద్రతను కల్పించారు. ఎవరి వద్ద ఆయుధాలున్నాయి, ఏ రూట్‌ నుండి ఎటువైపుకు వెళ్ళే అవకాశాలున్నాయనే వివరాలై డేరాబాబాతో ఈ ముగ్గురు పోలీసులు ప్లాన్‌ను వివరించారు.

డేరాబాబా: వారసుడిగా జస్మీత్ సింగ్, కాదు రామ్ రహీమ్ సింగ్, ఏం జరుగుతుంది?

డేరా బాబాను తప్పించేందుకు కుట్ర పన్నిన ముగ్గురు కానిస్టేబుళ్ళను అరెస్ట్ చేశారు. అయితే కోర్టు అనుమతితో ఈ ముగ్గురు కానిస్టేబుళ్ళను విచారించనున్నట్టు పోలీసు ఉన్నతాధికారులు ప్రకటించారు.

. వీరిని స్థానిక కోర్టులో ప్రవేశపెట్టి, ఆపై కస్టడీకి తీసుకుని మూడు రోజుల పాటు విచారించనున్నామని అన్నారు. కాగా, ప్రస్తుతం గుర్మీత్ రామ్ రహీమ్, రోహ్ తక్ లోని జైల్లో శిక్షను అనుభవిస్తున్నాడు. ఆయన ఒళ్లంతా కామాన్ని తలకెక్కించుకున్న వ్యక్తని, శారీరక కలయిక కోసం తపిస్తున్నాడని, జైల్లో పిచ్చిపిచ్చిగా ప్రవర్తిస్తున్నాడని వైద్యులు వెల్లడించిన సంగతి తెలిసిందే.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
The Haryana police on Thursday confirmed that they arrested three of their officers who allegedly tried to help Dera Sacha Sauda chief Gurmeet Ram Rahim Singh to escape from prison. The self-styled godman is serving 20-years lifetime imprisonment after he was convicted in two separate rape cases last month.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి