ఈ గ్రామాలకు వెళ్తే వేరే గ్రహానికి వెళ్లినట్టే..! పర్యటకులు క్యూ..
భారత్ లో అనేక కట్టడాలు, చారిత్రక ప్రదేశాలు, ఆకాశ హర్మ్యాలు ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో మనకు అనేక టూరిస్టు ప్రాంతాలు కనువిందు చేస్తాయి. అయితే దేశ సంస్కృతి , సంప్రదాయాలతోపాటు పచ్చని ప్రకృతి, ఆకట్టుకునే పల్లె అందాలు, కొండలు, కోనలు, సెలయేర్ల అందాలు చూడాలంటే గ్రామాల్లో పర్యటించాల్సిందే. దేశంలోని ఈ గ్రామాలకు వెళ్తే వేరే గ్రహంలోకి వెళ్లామా..? అన్న అనుభూతి కలుగుతుంది. ఆ విశేషాలు చూస్తే..
హిమాచల్ ప్రదేశ్ లోని మలానా గ్రామం పర్యటకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. కులు మనాలీ లోయలో దాగి ఉన్న ఈ గ్రామాన్ని లిటిల్ గ్రీస్ అని కూడా పిలుస్తుంటారు స్థానికులు. ఈ గ్రామంలో ఆచారాలు, సంప్రదాయాలు ఇతర ప్రదేశాలతో పోల్చితే భిన్నంగా ఉంటాయి. ఇక్కడి ప్రకృతి, వాతావరణం స్వర్గధామంగా ఉంటుంది. ఇక అరుణాచల్ ప్రదేశ్ లోని జిరో ప్రాంతం పర్యటకులకు ప్రత్యేక అనుభూతిని కలిగిస్తుంది. ఇక్కడి పైన్ చెట్లు, పచ్చని పంట పొలాలు ఆహ్లాదాన్ని కలిగిస్తాయి. ఈ గ్రామంలో అపతాని అనే ప్రత్యేకమైన తెగ ఉంటుంది. ఈ ప్రాంతంలోని ప్రశాంతమైన వాతావరణం, పచ్చదనం మరో ప్రపంచంలో ఉన్నామనే అనుభూతిని కలిగించడంలో సందేహం లేదు.
ఇక మేఘాలయ రాష్ట్రంలోని మావ్లినాంగ్ గ్రామానికి ఎంతో ప్రత్యేకత ఉంది. ఈ గ్రామాన్ని ఆసియా ఖండంలోనే స్వచ్చమైన గ్రామం అని పిలుస్తుంటారు. ఇక్కడి పల్లె సంస్కృతి, వాతావరణం అద్భుతంగా ఉంటుంది. అలాగే పూల తోటలు, జీవించి ఉన్న వేర్ల వంతెనలు ప్రత్యేక ఆకర్షణగా ఉంటాయి. అలాగే నాగాలాండ్ రాష్ట్రంలోని రోషోలి, ఖోనోమా గ్రామాలు కూడా పర్యటకులను విశేషంగా ఆకర్షిస్తున్నాయి. ఆసియా ఖండంలోనే మొదటి గ్రీన్ విలేజ్ గా ఈ గ్రామాలు పేరుగాంచాయి. ఇక్కడి మెట్ల పొలాలు కనులవిందుగా ఉంటాయి.
అలాగే హిమాచల్ ప్రదేశ్ లోని కల్పా గ్రామం ఆపిల్ తోటలకు ప్రసిద్ధి. అలాగే ఈ గ్రామం నుంచి హిమాలయ పర్వతాల దృశ్యం అద్భుతంగా ఉంటుంది. కిన్నౌర్ కైలాష్ పర్వత శ్రేణుల మధ్య ఉండే ప్రాంతం టూరిస్టులకు స్వర్గ ధామంగా ఉంటుంది. సిక్కింలోని లాచుంగ్ గ్రామం విశేషాలు చూస్తే.. మంచుతో కప్పబడిన పర్వతాలు, జలపాతాల మధ్య ఉండే ఈ గ్రామం స్విట్జర్లాండ్ ను తలపిస్తుంది. ఇక్కడి బౌద్ధ మఠాలు మనసుకు ప్రశాంతతను కలిగిస్తాయి.

అలాగే జమ్మూ కాశ్మీర్ లోని గంధేర్బల్ గ్రామం.. సింధ్ నది ఒడ్డున ఉంది. ఈ ప్రాంతం కాశ్మీర్ అందాలకు అసలైన నిదర్శనం. ఇక్కడి ప్రకృతి సౌందర్యం చూస్తే భూతల స్వర్గం అంటే ఇదేనా అన్న అనుమానం కలుగక మానదు. హిమాచల్ ప్రదేశ్ లోని చిట్కుల్ గ్రామం ఇండో-టిబెట్ సరిహద్దులో ఉంది. ఇది భారత దేశంలోనే చివరి గ్రామం కావడం విశేషం. ఇక్కడి స్వచ్ఛమైన గాలి, నీలి రంగు ఆకాశం కింద ఈ గ్రామం అద్భుతంగా దర్శనమిస్తుంది.
-
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
ఏపీ, తెలంగాణలో రెండు కొత్త ఎయిర్‌పోర్ట్‌లకు గ్రీన్ సిగ్నల్ - ఈ ప్రాంతాల్లోనే..!! -
PDS Kerosene: మళ్లీ రేషన్ షాపుల్లో కిరోసిన్-కేంద్రం అత్యవసర ఆదేశాలు..! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్ -
విజయ్ పార్టీకి త్రిష శాపం? రెండు చోట్ల ఓటమి ఖాయం! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
కొత్త పెన్షన్ల పై ప్రభుత్వం కీలక నిర్ణయం: పంపిణీ ముహూర్తం, మార్గదర్శకాలు..!! -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
రూట్ మార్చిన ఫరియా.. ఊర మాస్ పాత్రలో హిట్ కొట్టేనా ?? -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- నేడు ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు












Click it and Unblock the Notifications