అమర్‌నాథ్ యాత్రికులపై దాడి చేసిన ఉగ్రవాది అబు ఇస్మాయిల్ హతం
లష్కరే తొయిబాకు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. అమర్‌నాథ్ యాత్రికులపై దాడి చేసిన ఉగ్రవాది అబు ఇస్మాయిల్‌ను భద్రతా దళాలు హతమార్చాయి. జూలైలో అమర్‌నాథ్ యాత్రికులపై ఉగ్రవాది అబు ఇస్మాయిల్ దాడి చేశారు.
Recommended Video

శ్రీనగర్: లష్కరే తొయిబాకు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. అమర్‌నాథ్ యాత్రికులపై దాడి చేసిన ఉగ్రవాది అబు ఇస్మాయిల్‌ను భద్రతా దళాలు హతమార్చాయి. జూలైలో అమర్‌నాథ్ యాత్రికులపై ఉగ్రవాది అబు ఇస్మాయిల్ దాడి చేశారు.
ఎన్‌కౌంటర్‌లో అబు ఇస్మాయిల్ మరణించాడని జమ్మూ-కశ్మీరు డీజీపీ వైద్ ధృవీకరించారు. అరిబాగ్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదులు మరణించారని, వీరి నుంచి ఆయుధాలను స్వాధీనం చేసుకున్నామని చెప్పారు.

లష్కరే తొయిబా టాప్ కమాండర్ అబు ఇస్మాయిల్ నేతృత్వంలో జూలై 10న అమర్‌నాథ్ భక్తులు ప్రయాణిస్తున్న బస్సుపై ఉగ్రవాద దాడి జరిగింది. ఈ దాడిలో గుజరాత్‌కు చెందిన ఎనిమిది మంది మరణించారు, 18 మంది గాయపడ్డారు. మృతుల్లో ఆరుగురు మహిళలు ఉన్నారు. ఈ ఘటన ఆ సమయంలో తీవ్రంగా సంచలనం రేకేత్తిచింది.
ఈ దాడికి ప్రధాన సూత్రధారిగా ఉన్న అబు ఇస్మాయిల్‌ను హతమార్చి ఉగ్రవాదులపై పై చేయి సాధించామనే అభిప్రాయాన్ని పోలీసు ఉన్నతాధికారులు వ్యక్తం చేస్తున్నారు.












Click it and Unblock the Notifications