ఉత్తరాఖండ్ సీఎం రేసులో.. త్రివేంద్ర సింగ్ రావత్!?

Posted By:
Subscribe to Oneindia Telugu

డెహ్రాడూన్: ఆరెస్సెస్ ప్రచారక్ స్థాయి నుంచి ప్రారంభించి.. ఇప్పుడు ముఖ్యమంత్రి పదవికి సిద్ధంగా ఉన్న ఈ వ్యక్తి పేరు.. త్రివేంద్ర సింగ్ రావత్. ఉత్తరాఖండ్ రాష్ట్రానికి కొత్త ముఖ్యమంత్రి రేసులో అందరికంటే ముందున్నారు.

బీజేపీ జాతీయాధ్యక్షుడైన అమిత్ షా కు సన్నిహితుడైన ఈయన సీఎంగా ఎంపికయ్యే అవకాశాలు బలంగా ఉన్నట్లు పేర్కొంటున్నారు. ఉత్తరాఖండ్ లో స్పష్టమైన మెజారిటీ సాధించిన బీజేపీ.. శాసనసభా పక్ష నాయకుడిని ఎన్నుకోవడానికి శుక్రవారం సమావేశం అవుతోంది.

కొత్త ముఖ్యమంత్రిని ఎంపిక చేసే అధికారాన్ని బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాకు కట్టబెట్టారు. శుక్రవారం సాయంత్రంలోగా ఎంపిక ప్రక్రియ పూర్తయితే శనివారం నాడు రాష్ట్ర రాజధాని డెహ్రాడూన్ లో కొత్త ముఖ్యమంత్రి, మంత్రులు ప్రమాణ స్వీకారం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్రమోడీ, పార్టీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా కూడా హాజరవుతున్నారు.

Trivendra Singh Rawat, ex-RSS pracharak, to be CM of Uttarakhand

పొరుగు రాష్ట్రం ఉత్తరప్రదేశ్ మాదిరిగానే ఉత్తరాఖండ్ లో కూడా బీజేపీకి బ్రహ్మాండమైన మెజారిటీ సాధించింది. మొత్తం 70 స్థానాలున్న అసెంబ్లీలో 57 స్థానాలు బీజేపీకే దక్కాయి. ఇంత మెజారిటీ వచ్చినా ఈ రెండు రాష్ట్రాలకు సీఎంలు ఎవరన్నది ఇంకా నిర్ణయించుకోలేకపోతున్నారు.

మరోవైపు అసలు మెజారిటీయే దక్కని గోవా, మణిపూర్ లలో ఇప్పటికే ముఖ్యమంత్రుల ప్రమాణ స్వీకారాలు కూడా జరిగిపోయాయి. ఇక ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి ఎవరన్న విషయాన్ని శనివారం ప్రకటించే అవకాశం కనిపిస్తోంది.

ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పదవికి సత్పాల్ మహరాజ్ తదితర పేర్లు వినిపించినా, చివరికి త్రివేంద్ర సింగ్ రావత్ ను ఖరారు చేసే అవకాశం కనిపిస్తోంది. 2014లో ఈయన కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి వచ్చారు.

రావత్ కు ఆరెస్సెస్ మద్దతు ఉండటమే కాక, అమిత్ షా ఆశీస్సులు సైతం మెండుగా ఉన్నాయి. 2014 సార్వత్రిక ఎన్నికల్లో అమిత్ షా యూపీ ఇన్ ఛార్జిగా ఉన్నప్పుడు ఇద్దరూ కలిపి పని చేశారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
THE BJP is learnt to have picked Trivendra Singh Rawat, a former RSS pracharak, as the new Chief Minister of Uttarakhand. Sources said that while Rawat was informed last night, he will be formally elected by the party’s MLAs on Friday. The newly-elected BJP MLAs are scheduled to meet tomorrow. Besides the two central observers, Union Minister Narendra Singh Tomar and BJP general secretary Saroj Pandey, the state’s election in-charge Union Minister Dharmendra Pradhan and BJP’s state in-charge Shyam Jaju will also attend the meeting.
Please Wait while comments are loading...