ఇంటికి వెళ్లిపోతాం అంటున్న రెబల్ ఎమ్మెల్యేలు: బుజ్జగించడానికి రిసార్ట్ కు దినకరన్ !

Posted By:
Subscribe to Oneindia Telugu

బెంగళూరు: అన్నాడీఎంకే పార్టీ మీద తిరుగుబాటు చేసి కర్ణాటకలోని కొడుగు (కూర్గ్)లోని రిసార్ట్ లో జల్సాలు చేస్తున్న రెబల్ ఎమ్మెల్యేలు తాము ఇంటికి వెళ్లిపోతాం అని గొడవ చేస్తున్నారని తెలిసింది. మమ్మల్ని కలుసుకోవడానికి శనివారం టీటీవీ దినకరన్ రిసార్ట్ దగ్గరకు వస్తున్నారని ఆయన వర్గంలోని ఎమ్మెల్యే తంగ తమిళ సెల్వన్ దృవీకరించాడు.

లోక్ సభ డిప్యూటీ స్పీకర్ తంబిదురై అన్నాడీఎంకే పార్టీ నుంచి ఔట్: దినకరన్ కే దిక్కులేదు!

శుక్రవారం కొడుగు సమీపంలోని రిసార్ట్ దగ్గర మీడియాతో మాట్లాడిన ఎమ్మెల్యే తంగ తమిళ సెల్వన్ శనివారం మా నాయకుడు టీటీవీ దినకరన్ రిసార్ట్ దగ్గరకు వస్తున్నారని అన్నాడు. తమిళనాడులోని ఎడప్పాడి పళనిసామి ప్రభుత్వాన్ని త్వరలోనే ఇంటికి పంపిస్తామని తంగ తమిళ సెల్వన్ ధీమా వ్యక్తం చేశాడు.

TTV Dinakaran going to meet Support MLAs in coorg resort

ఎడప్పాడి పళనిసామి ప్రభుత్వాన్ని ఎలా కూల్చాలి అని చర్చించడానికే టీటీవీ దినకరన్ ఇక్కడికి వస్తున్నారని తంగ తమిళ సెల్వన్ చెప్పారు. ఎడప్పాడి పళనిసామిని సీఎం కుర్చి నుంచి కిందకుదించిన తరువాత కొత్త సీఎంను ఎన్నుకుంటామని ఆ విషయం చర్చించడానికి టీటీవీ దినకరన్ ఇక్కడికి వస్తున్నారని తంగ తమిళ సెల్వన్ అన్నారు.

జయలలిత మేనకోడలు, దినకరన్ వర్గీయులు ఢిష్యూం ఢిష్యూం: ధైరంగా వెళ్లిన దీపా !

రెబల్ ఎమ్మెల్యేలు మేము ఇంటికి వెళ్లిపోతాం అంటూ ఒత్తిడి చెయ్యడంతో వారిని బుజ్జగించడానికి టీటీవీ దినకరన్ రిసార్ట్ చేరుకుంటున్నారని తెలిసింది. మొత్తం మీద ముగ్గురు రెబల్ ఎమ్మెల్యేలు చిన్నగా కొడుగు రిసార్ట్ నుంచి జారుకుని తమిళనాడు చేరుకుంటే ఎడప్పాడి పళనిసామి, పన్నీర్ సెల్వం ఊపిరిపీల్చుకునే అవకాశం ఉంది.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
TTV Dinakaran going to meet Support MLAs in coorg resort tomorrow. MLA Thanga tamilselvan said this to press in coorg. TTV Dinakaran may discuss about to dissolve the govt.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి