అసెంబ్లీలో దినకరన్ ఉడుంపట్టు: మైక్ కట్, వాకౌట్, పన్నీర్ ను నెత్తిన పెట్టుకున్నారు!

Posted By:
Subscribe to Oneindia Telugu

చెన్నై: తమిళనాడు ప్రభుత్వం కావాలనే కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని, త్వరలోనే వీరికి ప్రజలు గుణపాఠం చెబుతారని అన్నాడీఎంకే పార్టీ రెబల్ నాయకుడు, ఆర్ కే నగర్ ఎమ్మెల్యే టీటీవీ దినకరన్ ఆరోపించారు. అసెంబ్లీలో మాట్లాడటానికి అవకాశం ఇవ్వకపోవడం, మైక్ కట్ చెయ్యడంతో టీటీవీ దినకరన్ శాసన సభ సమావేశాన్ని బహిష్కరించి వాకౌట్ చేశారు.

18 మంది ఎమ్మెల్యేలు

18 మంది ఎమ్మెల్యేలు

అన్నాడీఎంకే పార్టీ మీద, ఎడప్పాడి పళనిస్వామి ప్రభుత్వం మీద తిరుగుబాటు చేసిన 18 మంది శాసన సభ్యుల మీద స్పీకర్ ధనపాల్ అనర్హత వేటు వేసిన విషయం తెలిసిందే. అనర్హతకు గురైన 18 మంది ఎమ్మెల్యేలు శాసన సభ సమావేశాల్లో పాల్గొనడానికి అవకాశం లేకుండాపోయింది.

టీటీవీ దినకరన్ ప్లాన్

టీటీవీ దినకరన్ ప్లాన్


మంగళవారం రెండో రోజు అసెంబ్లీలో అడుగుపెట్టిన టీటీవీ దినకరన్ తన వర్గంలోని 18 మంది ఎమ్మెల్యేల మీద ఎందుకు అనర్హతవేటు వేశారని తమిళనాడు ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి సిద్దం అయ్యారు. అసెంబ్లీలో తాను మాట్లాడటానికి అవకాశం ఇవ్వాలని టీటీవీ దినకరన్ స్పీకర్ ధనపాల్ కు మనవి చేశారు.

ఏం మాట్లాడుతారు ?

ఏం మాట్లాడుతారు ?

మొదటి సారి అసెంబ్లీలో అడుగుపెట్టిన టీటీవీ దినకరన్ ఆర్ కే నగర్ ప్రజలు, వారి సమస్యల గురించి మాట్లాడుతారని అందరూ అనుకున్నారు. అయితే తన వర్గంలోని 18 మంది ఎమ్మెల్యేలును ఎందుకు అనర్హులను చేశారో మొదట చెప్పాలని టీటీవీ దినకరన్ డిమాండ్ చేశారు.

పన్నీర్ సెల్వం వర్గం

పన్నీర్ సెల్వం వర్గం


ఎడప్పాడి పళనిస్వామి ప్రభుత్వం బలపరీక్షకు దిగిన సమయంలో పన్నీర్ సెల్వంతో సహ ఆయన అనుచర ఎమ్మెల్యేలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేసినా ఎందుకు చర్యలు తీసుకోలేదని, పైగా ఆయనకు ఉప ముఖ్యమంత్రి పదవి, ఆయన వర్గానికి మంత్రి పదవులు ఇచ్చారని టీటీవీ దినకరన్ విమర్శించారు.

 కోర్టు వ్యవహారంతో మైక్ కట్

కోర్టు వ్యవహారంతో మైక్ కట్

కోర్టులో విచారణలో ఉన్న వ్యవహారాల గురించి అసెంబ్లీలో చర్చించరాదని ఎడప్పాడి పళనిస్వామి, పన్నీర్ సెల్వం వర్గీయులు అభ్యంతరం చెప్పడంతో స్పీకర్ ధనపాల్ టీటీవీ దినకరన్ సీటు దగ్గర ఉన్న మైక్ కట్ చేశారు.

  Tamil Nadu Politics : పళని, పన్నీర్ వర్గంలోకి రెబల్ ఎమ్మెల్యేలు
  టీటీవీ వాకౌట్

  టీటీవీ వాకౌట్


  తమిళనాడు ప్రభుత్వం ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు గౌరవం ఇవ్వడం లేదని ఆరోపిస్తూ టీటీవీ దినకరన్ శాసన సభ సమావేశాలను బహిష్కరించారు. అనంతరం సచివాలయం బయట మీడియాతో మాట్లాడిన టీటీవీ దినకరన్ తమిళనాడు ప్రభుత్వ తీరుపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.

  ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  TTV Dinakaran walks out from assembly as he was not given chance to raise about 18 MLAs disqualification case.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి