యూజీసీ ఈక్విటీ రూల్స్ కుంపటి: వరుస వికెట్ల కలకలం
బరేలీ సిటీ మేజిస్ట్రేట్‌గా విధులు నిర్వర్తించిన అలంకార్ అగ్నిహోత్రి రాజీనామా, ఆ తర్వాత సస్పెన్షన్ వ్యవహారాలు ఉత్తరప్రదేశ్ లో తీవ్రస్థాయిలో దుమారం రేపుతున్నాయి. అటు అధికారులు, ఇటు రాజకీయ వర్గాల్లో కలకలం చెలరేగింది. శంకరాచార్యుల పట్ల అగౌరవం, యూనివర్శిటీ గ్రాంట్ కమిషన్ (UGC) నిబంధనల ఉల్లంఘనలను కారణాలుగా పేర్కొంటూ అగ్నిహోత్రి తన పదవికి రాజీనామా చేశారు.ఆ తర్వాత ఆయనను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఇదే ఇప్పుడు ప్రకంపనలు పుట్టించింది.
రాజీనామా చేసిన అధికారిని ఎందుకు సస్పెండ్ చేయాల్సి వచ్చిందనేది ఇప్పుడు ప్రశ్నాంశమైంది. రాజీనామా నిర్ణయంపై అగ్నిహోత్రి ఏ మాత్రం వెనక్కి తగ్గలేదు. రాత్రంతా జిల్లాస్థాయికి చెందిన వివిధ విభాగాధిపతులు, ఇతర ఉన్నతాధికారులు ఆయనను ఒప్పించే ప్రయత్నాలు చేశారు గానీ అవేవీ ఫలించలేదు. ఈ సమస్యను సామరస్యంగా ముగిద్దామని భావించిన ప్రభుత్వ పెద్దలకూ చుక్కెదురైంది.

దీంతో ఆయనను సస్పెండ్ చేస్తూ అర్ధరాత్రి ఉత్తర్వులు జారీ అయ్యాయి. సస్పెండ్‌కు తోడు ఆయన్ను షామ్లీకి బదిలీ చేసి శాఖాపరమైన విచారణకు కూడా ఆదేశాలు జారీ చేసింది ప్రభుత్వం. పదేళ్ల కార్పొరేట్ ఐటీ రంగ అనుభవం, మొదటి ప్రయత్నంలోనే ప్రొవెన్షియల్ సివిల్ సర్వీసెస్ సాధించిన అగ్నిహోత్రి.. ఏకంగా తన పదవికి రాజీనామా చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఆయన తప్పటడుగు వేశారనే అభిప్రాయాలూ లేకపోలేదు.
అలంకార్ అగ్నిహోత్రి చేసిన ప్రధాన తప్పిదం 'ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ కోడ్ ఆఫ్ కండక్ట్ ను ఉల్లంఘించడమేనని తెలుస్తోంది. ప్రభుత్వ సేవలో ఉన్న ఏ అధికారి కూడా ప్రత్యక్షంగా ఏదైనా రాజకీయ పార్టీకి వ్యతిరేకంగా నిరసన తెలపకూడదు. అలంకార్ తన సోషల్ మీడియా పోస్ట్‌లో 'బాయ్‌కాట్ బీజేపీ' అని పోస్ట్ పెట్టారు. ఇది- క్రమశిక్షణ లక్ష్మణ రేఖను దాటినట్టేననే నిర్ణయానికొచ్చింది ప్రభుత్వం. ఆయనపై కఠిన చర్య తీసుకోవడానికి ప్రభుత్వానికి బలమైన ఆధారంగా నిలిచింది.
సర్వీస్ లో ఉన్నప్పుడు రాజీనామా సమర్పించడానికి నిర్దుష్టమైన పద్ధతి, నిబంధనలు ఉంటాయి. రాజీనామా పత్రాన్ని నియామక అధికారికి సమర్పించాల్సి ఉంటుంది. దీనికి భిన్నంగా అలంకార్ తన రాజీనామాను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రభుత్వ విధానాలను 'నల్ల చట్టాలు'గా అభివర్ణించారు. ఆయన రాజీనామా వ్యవహారం మొత్తం కూడా వ్యక్తిగత కారణాలకు సంబంధించినదైతే ఇంత వివాదం రేగేది కాదని అంటున్నారు. రాజకీయ నినాదాలతో ఇది ముడిపడి ఉండటం ప్రభుత్వంపై తిరుగుబాటుగా పరిణమించింది.
అగ్నిహోత్రి రాజీనామా తర్వాత అయోధ్య జీఎస్టీ డిప్యూటీ కమిషనర్ ప్రశాంత్ సింగ్ కూడా పదవిని వీడారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌లపై అవిముక్తేశ్వరానంద్ చేసిన వ్యాఖ్యలు తనను తీవ్రంగా బాధించాయని ఆయన స్పష్టం చేశారు. తన రాజీనామా నిర్ణయాన్ని రాజకీయ ధర్మంగా అభివర్ణించారు. ప్రధాని, ముఖ్యమంత్రి, రాష్ట్ర ప్రభుత్వంపై జరిగిన అవమానాలను నిరసించడం ప్రభుత్వ ఉద్యోగిగా తన విధి అని వివరించారు.
-
మళ్లీ మొదలెట్టావా పాప.. ప్రెగ్నెన్సీ నిజమేనా? -
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
విజయ్ దేవరకొండపై ఆ స్టార్ హీరో భార్య సీక్రెట్ లవ్.. పెళ్లయినా ఆగని..! -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
పవన్ కళ్యాణ్‌ని నిండాముంచిన హరీష్ శంకర్..












Click it and Unblock the Notifications