భార్య తనను వదిలేసిందని.. మహిళల ప్రైవేట్ భాగాలే టార్గెట్!
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఆగ్రాలో ఓ వికృత మనస్తత్వం కలిగిన ఉన్మాది ఉదంతం కలకలం రేపింది. తన భార్య తనను వదిలి వెళ్లిపోయిందన్న కోపంతో మహిళలందరినీ ద్వేషించడం మొదలుపెట్టిన ఈ కిరాతకుడు.. అనామక మహిళల ప్రైవేట్ భాగాలపై కత్తులతో దాడి చేస్తూ భీభత్సం సృష్టించాడు. ఎట్టకేలకు ఆగ్రా పోలీసులు ఆ ఉన్మాదిని పట్టుకున్నారు.
అసలేం జరిగిందంటే?
ఫిబ్రవరి 22న ఆగ్రాలోని దయాల్బాగ్ ప్రాంతంలో పుష్పాంజలి బాగ్ నివాసి సోనా దేవి మార్నింగ్ వాక్ కోసం బయటకు వచ్చారు. అదన్ బాగ్ సమీపంలో ఓ గుర్తుతెలియని వ్యక్తి ఆమెను వెంబడించి, ఒక్కసారిగా ఆమె ప్రైవేట్ భాగాలపై కత్తితో దాడి చేసి పారిపోయాడు. రక్తపు మడుగులో ఉన్న ఆమెను పోలీసులు వెంటనే ఎస్ఎన్ మెడికల్ కాలేజీలో చేర్పించారు. ఈ వింతైన, భయంకరమైన దాడి పోలీసులకు ఒక సవాలుగా మారింది.

పోలీసుల వేట: 100కు పైగా సీసీటీవీ కెమెరాలు
ఏసీపీ హరిపర్వత్ అక్షయ్ మహాడిక్ నేతృత్వంలో పోలీసులు ఈ కేసును దర్యాప్తు చేశారు. నిందితుడిని పట్టుకోవడం పోలీసులకు కష్టతరంగా మారింది, ఎందుకంటే అతను తన వద్ద మొబైల్ ఫోన్ ఉంచుకోడు, స్థిరంగా ఒకచోట ఉండడు. దాదాపు 100కు పైగా సీసీటీవీ కెమెరాలను విశ్లేషించిన పోలీసులు, గురువారం రాత్రి ఖాస్పూర్ చౌరస్తా వద్ద నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిని సుభాష్ నగర్‌కు చెందిన శ్యామ్ సుందర్ శర్మగా గుర్తించారు.
మహిళలపై ద్వేషానికి కారణం అదే!
పోలీసు విచారణలో నిందితుడు శ్యామ్ సుందర్ చెప్పిన విషయాలు విని పోలీసులు సైతం నివ్వెరపోయారు. తాను వెండి పని చేసే వ్యక్తినని, గత మూడు నెలల క్రితం తన భార్య గొడవపడి తనను వదిలి వెళ్లిపోయిందని చెప్పాడు. ఆ ఘటన తర్వాత అతనికి మహిళలపై తీవ్రమైన ద్వేషం ఏర్పడింది. "నేను నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు ఆ మహిళ నన్ను ఎందుకు వెంబడిస్తున్నావని ప్రశ్నించింది. ఆ మాట నాకు కోపం తెప్పించింది. మహిళలంటేనే అసహ్యం వేస్తోంది, అందుకే నా దగ్గర ఉన్న కత్తితో ఆమె రహస్య భాగాలపై పొడిచి అక్కడే వదిలేసి పారిపోయాను" అని నిందితుడు ఒప్పుకున్నాడు.
భయంకరమైన లైఫ్‌స్టైల్
నిందితుడు పట్టుబడకుండా ఉండేందుకు రాత్రిపూట పార్కులలో, ఆసుపత్రుల బయట లేదా రోడ్డు పక్కన నిద్రపోయేవాడు. మహిళల ప్రైవేట్ భాగాలను లక్ష్యంగా చేసుకుని దాడి చేయడం అతని వికృత మనస్తత్వానికి నిదర్శనమని పోలీసులు వెల్లడించారు. ప్రస్తుతం నిందితుడిని జైలుకు పంపిన పోలీసులు.. అతనిపై కఠిన సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.
-
IPL 2026: మలుపు తిప్పిన రనౌట్.. కేకేఆర్‌ను చిత్తు చేసిన సన్‌రైజర్స్! -
రైతు భరోసా రెండో విడత నిధుల జమ షెడ్యూల్ ఖరారు, ఈ సారి వీరికే..!! -
Tamil Nadu Survey: తమిళనాడులో మారిపోయిన లెక్కలు-తాజా సర్వేలో ఓటర్ల షాక్..! -
ఇందిరమ్మ లబ్దిదారులకు గుడ్ న్యూస్.. రెండో విడత ఇళ్లపై కీలక ప్రకటన -
ఈ సారి 'తల్లికి వందనం' అమలు అప్పుడే - చంద్రబాబు కీలక ప్రకటన..!! -
బంగారం ధరలకు గత వైభవం -
మెగా డాటర్ మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో.. సంగీత్ శోభన్ "రాకాస" రివ్యూ ! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, అసలు సమస్య - ఇలా చేయండి..!! -
Vijay: ఎంజీఆర్, జయలలిత చేయని సాహసం చేస్తున్న విజయ్? డీఎంకే కంచుకోటలో..! -
చర్లపల్లి నుంచి తెలుగు రాష్ట్రాల మీదుగా ఇక ఈ రైళ్లు ..! -
INS Aridhaman: ప్రళయ కాల రుద్రుడు, నీటి అడుగున భారత్ విశ్వరూపం.. -
బీఆర్ఎస్ లో చేరిక పై తేల్చేసిన జీవన్ రెడ్డి, వాట్ నెక్స్ట్..!!












Click it and Unblock the Notifications