వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తొలిసారి బరిలో మాజీ సీఎంల వారసులు

ముఖ్యమంత్రుల కొడుకులు, కూతుళ్లు, తొలి నుంచి పోటీ నుంచి చేస్తున్న ఈ దశలో వివిధ పార్టీల తరఫున ఎన్నికల బరిలో నిలిచిన ప్రముఖులు, కొత్త ముఖాల గురించి విశ్లేషణ..

By Swetha Basvababu
|
Google Oneindia TeluguNews

డెహ్రాడూన్: ఉత్తరాఖండ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు ఈ నెల 15న పోలింగ్ జరుగనున్నది. ఫలితాలు మాత్రం వచ్చే నెల 11న వెలువడతాయి. కిచ్చా, హరిద్వార్ రూరల్ స్థానాల నుంచి అధికార కాంగ్రెస్ పార్టీ తరఫున సీఎం హరీశ్ రావత్ పోటీ చేస్తున్నారు. రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం హోరుగా సాగుతున్నది. ముఖ్యమంత్రుల కొడుకులు, కూతుళ్లు, తొలి నుంచి పోటీ నుంచి చేస్తున్న ఈ దశలో వివిధ పార్టీల తరఫున ఎన్నికల బరిలో నిలిచిన ప్రముఖులు, కొత్త ముఖాల గురించి విశ్లేషణ..

సితార్‌గంజ్ నుంచి సౌరవ్ బహుగుణ

ఉద్ధంసింగ్ నగర్ జిల్లా సితార్‌గంజ్ స్థానం నుంచి రాజకీయంగా అద్రుష్టాన్ని పరీక్షించుకుంటున్న సౌరవ్ బహుగుణ బిజెపి తరఫున బరిలో నిలిచారు. ఢిల్లీ, అలహాబాద్ విశ్వవిద్యాలయాల్లో విద్యాభ్యాసం పూర్తిచేశారు. ఆయన తండ్రి విజయ్ బహుగుణ ఇంతకుముందు ఉత్తరాఖండ్ సిఎంగా పనిచేశారు. అంతే కాదు ఆయన తాత హేమవతి నందన్ బహుగుణ.. ఉత్తరప్రదేశ్ సీఎంగా పని చేశారు.

Uttarakhand assembly elections: New faces and veterans

ఒక గోల్ఫ్ ఆటగాడిగా, న్యాయవాద వ్రుత్తిలో కొనసాగుతున్నారు. 2013లో కేదరీనాథ్ వరదల్లో సిఎంగా ఉన్న విజయ్ బహుగుణకు సౌరవ్ బహుగుణ చేయూతనిచ్చారు. కానీ ప్రక్రుతి వైపరీత్యాల నుంచి రాష్ట్రాన్ని సరిగ్గా కాపాడటంలో విఫలమైనందుకు విజయ్ బహుగుణ సీఎంగా వైదొలిగారు. కొన్నేళ్లుగా సితార్‌గంజ్ స్థానం నుంచి పోటీ చేయడానికి నియోజకవర్గంలో పర్యటిస్తూ ప్రజలతో మమేకం అవుతున్నారు.

యాంకేశ్వర్ బరిలో రితూ ఖండూరీ భూషణ్

ఉత్తరాఖండ్ మాజీ సీఎం బీసీ ఖండూరీ తనయ రీటా ఖండూరీ భూషణ్ (52).. యాంకేశ్వర్ స్థానం నుంచి ఎన్నికల బరిలో నిలిచారు. పౌరి గర్హ్వాల్ జిల్లాలోని యాంకేశ్వర్ అసెంబ్లీ స్థానం పోటీ చేస్తున్నారు. పౌరీ కేంద్రంగా పనిచేస్తున్న స్వచ్ఛంద సంస్థ 'జై దుర్గా సామాజిక్ కల్యాణ్ సంస్థాన్' ద్వారా ప్రజలకు సేవలందిస్తున్నారు. గార్హ్వాల్ లోక్ సభ స్థానం నుంచి పార్లమెంట్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న బీసీ ఖండూరీ.. తన కూతురు రీటా ఖండూరీ భూషణ్‌ను సొంత గడ్డ నుంచి ఎన్నికల బరిలో దించారు. అయితే సిట్టింగ్ ఎమ్మెల్యే విజయ్ బ్రాథ్‌వాల్ నుంచి ఆమెకు వ్యతిరేకత ఎదుర్కొంటున్నారు.

Uttarakhand assembly elections: New faces and veterans

డెహ్రాడూన్ కంటోన్మెంట్ నుంచి పట్టువదలని విక్రమార్కుడు

డెహ్రాడూన్ కంటోన్మెంట్ స్థానం నుంచి పోటీ చేస్తున్న సీనియర్ మోస్ట్ ఎమ్మెల్యే హర్బన్స్ కపూర్ (71) మరోసారి అసెంబ్లీలో అడుగు పెట్టేందుకు సన్నద్ధం అయ్యారు. ఏడోసారి పోటీచేస్తున్న హర్బన్స్ తొలిసారి 1985లో పోటీచేసినప్పుడు ఓటమి పాలయ్యారు. అసెంబ్లీ నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ తర్వాత ఈ నియోజకవర్గాన్ని డెహ్రాడూన్ స్థానంగా మార్చారు.

Uttarakhand assembly elections: New faces and veterans

2007లో బిజెపి అధికారంలోకి వచ్చిన తర్వాత క్యాబినెట్ లోకి తీసుకునేందుకు పార్టీ నాయకత్వం తర్వాత స్పీకర్ గా నియమించారు. కార్పొరేటర్ స్థాయి నేతలే కార్లు నడుపుతుంటే.. ఆయన మాత్రం నిత్యం తన స్కూటర్ పైనే నియోజకవర్గంలో పర్యటిస్తూ ప్రజల కష్ట సుఖాలు తెలుసుకుంటుంటారు. ఈ దఫా ఆమ్ఆద్మీ ఉత్తరాఖండ్ రాష్ట్ర శాఖ మాజీ కన్వీనర్ అనూప్ నౌతియాల్ ను స్వతంత్ర్య అభ్యర్థిగా ఎదుర్కొంటున్నారు.

నైనిటాల్ ఎస్సీ స్థానం నుంచి కాంగ్రెస్ రెబెల్ కొడుకు

సంజీవ్ ఆర్యా.. కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ మంత్రి యశ్‌పాల్ ఆర్యా కొడుకు. కాంగ్రెస్ పార్టీ నుంచి తిరుగుబాటుచేసి బిజెపిలో చేరిన యశ్ పాల్ ఆర్యా తన కొడుక్కి నైనిటాల్ ఎస్సీ స్థానం టిక్కెట్ ఇప్పించుకున్నారు. సంజీవ్ ఆర్యా ప్రస్తుతం ఉత్తరాఖండ్ సహకార బ్యాంక్ చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. అయితే సంజీవ్ ప్రస్తుతం జంట సవాళ్లను ఎదుర్కొంటున్నారు. కాంగ్రెస్ పార్టీ తరఫున సిట్టింగ్ ఎంపీ రేఖా ఆర్యాతోపాటు బిజెపి తరఫున టిక్కెట్ ఆశించి భంగపడ్డ హేమ్ చంద్ర ఆర్యా స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉన్నారు. హేమ్ చంద్రా 2012 ఎన్నికల్లో 37.4 % ఓట్లు పొందారు.

Uttarakhand assembly elections: New faces and veterans

ఉత్తరాఖండ్‌లో 14% నేరస్థులే

ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేస్తున్న 637 మంది అభ్యర్థుల్లో 14 శాతం (91 మంది) మంది నేరస్తులని అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రీఫార్మ్స్ తేల్చింది. బీజేపీలో 27 శాతం మందితో అత్యధికులు నేరస్థులకు అవకాశం కల్పించగా, కాంగ్రెస్ పార్టీ 24 శాతం మందికి చోటు కల్పించింది. బిజెపిలో 19 మంది, కాంగ్రెస్ పార్టీలో 17 మంది అభ్యర్థులకు నేరాలతో సంబంధం ఉంది.

69 స్థానాల్లో 10 శాతం మంది అభ్యర్థులు బీఎస్పీ తరఫున, ఉత్తరాఖండ్ క్రాంతిదళ్ పార్టీ నుంచి ఏడు శాతం మంది అభ్యర్థులపై కేసులు ఉన్నాయి. 20 స్థానాల నుంచి పోటీ చేస్తున్న సమాజ్‌వాదీ పార్టీ ఇద్దరు అభ్యర్థులకు చోటు కల్పించింది. 261 మంది స్వతంత్ర్య అభ్యర్థుల్లో 32 శాతం మంది నేరస్థులే. తీవ్రమైన నేరాభియోగాలు ఎదుర్కొంటున్న వారిలో ఎనిమిది శాతం (44 మంది) పోటీ చేస్తున్నారు. ఐదుగురు అభ్యర్థులు హత్యానేరం, మరో ఐదుగురు హత్యాయత్నం నేరాభియోగం ఎదుర్కొంటున్నారు.

మహిళలపై దాడులు చేసిన వారు ఐదుగురు ఉన్నారు. కాంగ్రెస్ పార్టీలో 12 మంది తీవ్రమైన నేరాభియోగాలు ఎదుర్కొంటుండగా, బిజెపి నుంచి 10 శాతం మంది ఉన్నారు. మాయావతి సారథ్యంలో బీఎస్పీ అభ్యర్థుల్లో తొమ్మిది శాతం మందిపై తీవ్ర నేరాభియోగాలు ఉన్నాయి. ఎస్పీలో 10 శాతం, యూకేడీలో ఐదు శాతం మందిపై తీవ్ర నేరాభియోగాలు నమోదయ్యాయి.

English summary
Here's a brief profile of all the new faces fielded by various political parties in Uttarakhand. Uttarakhand will go to polls on February 15, 2017. The results will be announced on 11 March 2017.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X