దేశం గర్వించే బాల వీరులు.. 2025 బాల పురస్కార విజేతలు వీరే!
Veer Bal Diwas 2025: నేడు(డిసెంబర్ 26, 2025) 'వీర బాల దివస్' సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 'ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్ 2025' అవార్డులను ప్రదానం చేశారు. దేశవ్యాప్తంగా వివిధ రంగాల్లో అసాధారణ ప్రతిభ కనబరిచిన 20 మంది చిన్నారులను ఈ గౌరవం వరించింది. వీరిలో ఇద్దరు చిన్నారులకు వారి ప్రాణాలను పణంగా పెట్టి ఇతరులను రక్షించినందుకు గానూ మరణానంతర పురస్కారాలు లభించాయి. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ అవార్డు గ్రహీతలను ఉద్దేశించి ప్రసంగిస్తూ వారి ధైర్యసాహసాలను కొనియాడారు.
పురస్కార గ్రహీతల వివరాలు, వారి సాహసగాథలు ఇవే:
1.బ్యోమా (మరణానంతరం) -తమిళనాడు(సాహసం)- కరెంట్ షాక్ తగులుతున్న 6 ఏళ్ల బాబును కాపాడుతూ తన ప్రాణాలు కోల్పోయింది.
2.కమలేష్ (మరణానంతరం)-బీహార్(సాహసం) -దుర్గావతి నదిలో మునిగిపోతున్న చిన్నారిని రక్షిస్తూ ప్రాణత్యాగం చేశాడు.

3. వైభవ్ సూర్యవంశీ- బీహార్(క్రీడలు)-14 ఏళ్ల వయసులోనే క్రికెట్లో రికార్డులు సృష్టించిన అద్భుత ప్రతిభాశాలి.
4. మహ్మద్ సిద్దన్- కేరళ(సాహసం) -విద్యుత్ షాక్ నుంచి తన ఇద్దరు స్నేహితులను ప్రాణాలతో కాపాడాడు.
5.అజయ్ రాజ్-ఉత్తరప్రదేశ్(సాహసం)-తండ్రిని పట్టుకున్న మొసలిపై ధైర్యంగా దాడి చేసి ఆయన ప్రాణాలను కాపాడాడు.
6. శ్రవణ్ -పంజాబ్(సామాజిక సేవ) -'ఆపరేషన్ సిందూర్' సమయంలో జవాన్లకు నిరంతరం సేవలు అందించాడు.
7. శివాని హోస్రు ఉప్పర -ఆంధ్రప్రదేశ్(క్రీడలు)- పారా అథ్లెటిక్స్‌లో అద్భుత ప్రతిభ కనబరిచినందుకు ఈ అవార్డు దక్కింది.
8.అనుష్క-జార్ఖండ్(క్రీడలు)-ఫుట్‌బాల్ క్రీడలో రాణిస్తున్నందుకు గౌరవించబడ్డారు.
9.వాకా లక్ష్మి ప్రజ్ఞిక- గుజరాత్(క్రీడలు)-ప్రపంచ చెస్ ఛాంపియన్‌షిప్‌లో 9కి 9 రౌండ్లు గెలిచి రికార్డు సృష్టించింది.
10. యోగితా మాండవి-ఛత్తీస్‌గఢ్(క్రీడలు)-నక్సల్స్ ప్రభావిత ప్రాంతం నుంచి వచ్చి జూడోలో నేషనల్ ప్లేయర్‌గా ఎదిగింది.
11.సుమన్ సర్కార్ -పశ్చిమ బెంగాల్(కళ-సంస్కృతి)-తబలా వాద్యకారుడిగా అంతర్జాతీయ స్థాయిలో 43 పురస్కారాలు గెలుచుకున్నారు.
12. వంశ్-చండీగఢ్(సామాజిక సేవ) -నిరంతరం సమాజ సేవలో పాల్గొంటున్నందుకు గుర్తింపు.
13.పూజ-ఉత్తరప్రదేశ్(ఆవిష్కరణ)- కాలుష్యాన్ని నివారించేలా ప్రత్యేకమైన త్రెషర్ మిషన్‌ను రూపొందించింది.
14. అర్ణవ్ మహర్షి-మహారాష్ట్ర(సైన్స్ & ఇన్నోవేషన్)-కేంద్ర ప్రభుత్వం పేటెంట్ పొందిన ప్రత్యేక AI సాఫ్ట్‌వేర్‌ను అభివృద్ధి చేశాడు.
15.ఎస్తేర్ లాల్దుహవ్మి-మిజోరం(కళ-సంస్కృతి)-20 మిలియన్ల ఫాలోవర్లు ఉన్న చిన్నారి యూట్యూబర్, గాయని.
16.ఐషీ ప్రిషా బోరా -అస్సాం (పర్యావరణం)- విద్యుత్ అవసరం లేని పెన్సిల్ తయారీ మెషీన్, వాటర్ రీసైక్లింగ్ సిస్టమ్ తయారు చేసింది.
ముఖ్య విశేషాలు:
వీర బాల దివస్: సిక్కుల పదో గురువు గోవింద్ సింగ్ నలుగురు కుమారుల (సాహిబ్జాదాలు) త్యాగాలకు గుర్తుగా ప్రతి ఏడాది డిసెంబర్ 26న ఈ దినోత్సవాన్ని జరుపుకుంటారు. సాహసం, కళ, సంస్కృతి, సైన్స్, పర్యావరణం, సామాజిక సేవ, క్రీడలు అనే 6 విభాగాల్లో ఈ అవార్డులు అందించారు. 18 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి 20 మంది చిన్నారులు ఎంపికయ్యారు.
-
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
మళ్లీ మొదలెట్టావా పాప.. ప్రెగ్నెన్సీ నిజమేనా? -
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
విజయ్ దేవరకొండపై ఆ స్టార్ హీరో భార్య సీక్రెట్ లవ్.. పెళ్లయినా ఆగని..! -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!!












Click it and Unblock the Notifications