వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మాల్యా కావాల్సిందే: సుప్రీం, భారత్‌పై లిక్కర్ కింగ్ షాకింగ్ కామెంట్స్

బ్యాంకుల్లో అప్పులు చేసి విదేశాల్లో త‌లదాచుకుంటున్న లిక్కర్ కింగ్ విజ‌య్ మాల్యా కేసు విచార‌ణ‌లో భాగంగా కోర్టులో హాజ‌రు కావాల్సిందేన‌ని సుప్రీం కోర్టు శుక్రవారం తేల్చి చెప్పింది.

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: బ్యాంకుల్లో అప్పులు చేసి విదేశాల్లో త‌లదాచుకుంటున్న లిక్కర్ కింగ్ విజ‌య్ మాల్యా కేసు విచార‌ణ‌లో భాగంగా కోర్టులో హాజ‌రు కావాల్సిందేన‌ని సుప్రీం కోర్టు శుక్రవారం తేల్చి చెప్పింది.

అతనిని భార‌త్ తీసుకురావ‌డానికి లండ‌న్‌లో వేసిన కేసు వాయిదా పడిన విష‌యాన్ని సుప్రీం ఈ సందర్భంగా గుర్తు చేసింది. ఈ నేప‌థ్యంలో డిసెంబ‌ర్ వ‌ర‌కు ఈ కేసు విచార‌ణ కొనసాగదన్నారు.

సాక్ష్యాధారాల ప‌రిమాణం పెద్ద‌గా ఉండ‌టం వ‌ల్ల వాటిని కుదించ‌మ‌ని చెబుతూ లండ‌న్ కోర్టు విజ‌య్ మాల్యా కేసును డిసెంబ‌ర్ వ‌ర‌కు వాయిదా వేసింది.

అలాగే జీ20 స‌మావేశాల్లో భాగంగా భార‌త ప్ర‌ధాని నరేంద్ర మోడీ బ్రిట‌న్ ప్ర‌ధాని థెరెసా మేతో విజ‌య్ మాల్యా విష‌యమై చర్చించారని చెబుతున్నారు.

మాల్యా షాకింగ్ సమాధానం

మాల్యా షాకింగ్ సమాధానం

భారత దేశంతో తనకు మానసిక సంబంధం ఏదీ లేదని విజయ్ మాల్యా చెప్పారు. బ్రిటిష్ గ్రాండ్ ప్రిక్స్‌లో ఆయనను అడిగిన ఓ ప్రశ్నకు చాలా అభ్యంతరకరమైన సమాధానం చెప్పారు.

మీరు భారత్‌ను మిస్సవుతున్నారా అంటే..

మీరు భారత్‌ను మిస్సవుతున్నారా అంటే..

మీరు ఇండియాను మిస్ అవుతున్నారా అని అడిగితే.. మిస్ అవడానికి ఏమీ లేదని చెప్పారు. తన సమీప బంధువులు ఇంగ్లాండులో, అమెరికాలో ఉన్నారని చెప్పారు. ఇండియాలో ఎవరూ లేరని, కొంచెం దూరపు బంధువుల గురించి చూస్తే, వాళ్లంతా బ్రిటీష్ పౌరులు అని, అందువల్ల కుటుంబపరంగా కోల్పోయేదేమీ లేదన్నారు.

Recommended Video

Vijay Malya says, no grounds to extradite me to India : Watch video | Oneindia News
భారత దేశ కోర్టులపై..

భారత దేశ కోర్టులపై..

కోర్టుల్లో విచారణపై మాట్లాడుతూ.. తన కోసం వేట కొంతకాలం జరుగుతోందని వ్యాఖ్యానించారు. అందువల్ల తాను ఏదో మానసిక ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నదేమీ లేదని, తాను కచ్చితంగా ఏ తప్పు చేయలేదన్నారు. నిజానికి అంతిమంగా బ్రిటన్ కోర్టులో విచారణ జరుగుతుండటం తనకు సంతోషంగా ఉందని, ఇది నిష్పాక్షికమైన కోర్టు అని, చూద్దాం ఏం జరుగుతుందో అన్నారు.

1992 నుంచి బ్రిటన్‌లో మాల్యా

1992 నుంచి బ్రిటన్‌లో మాల్యా

విజయ్ మాల్యా 1992 నుంచి బ్రిటన్‌లో ఉంటున్నాడు. దీనిని తన రెండో నివాసంగా భావిస్తున్నాడు. మాల్యాను లండన్ నుంచి భారత దేశానికి రప్పించేందుకు కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తోంది.

English summary
The Supreme Court on Friday adjourned the hearing on contempt case proceedings against embattled businessman Vijay Mallya while observing that it will proceed in the case only when he is produced before it. The apex court also noted the government’s stand that proceedings to bring Mallya back is pending in the United Kingdom.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X