చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చెన్నైలో "వాటర్ మ్యాటర్స్ " ఎగ్జిబిషన్ ప్రారంభించిన అమెరికా కాన్సులేట్ జనరల్

|
Google Oneindia TeluguNews

చెన్నై: చెన్నైలోని అమెరికా కాన్సులేట్‌ జనరల్ కేర్‌‌ ఎర్త్ ట్రస్ట్, తమిళనాడు ప్రభుత్వం, స్మిత్ సోనియన్ ఇన్స్‌టిట్యూషన్ ట్రావెలింగ్ ఎగ్జిబిషన్ సర్వీస్ (SITES) సహకారంతో వాటర్ మ్యాటర్స్ ఎగ్జిబిషన్‌ను ఫిబ్రవరి 10వ తేదీన ప్రారంభించింది. చెన్నైలోని పెరియార్ సైన్స్ అండ్ టెక్నాలజీ సెంటర్ ఇందుకు వేదికగా నిలిచింది. ఫిబ్రవరి 11 నుంచి 29వ తేదీ వరకు ఈ ఎగ్జిబిషన్ ప్రజలకోసం తెరిచి ఉంటుంది.

ఈ ఎగ్జిబిషన్‌ను సందర్శించాల్సిందిగా ప్రజలకు ఆహ్వానం పలుకుతున్నట్లు చెప్పారు అమెరికా కాన్సుల్ జనరల్ రాబర్ట్ బర్గెస్. ముఖ్యంగా యువత సందర్శించాలని ఆయన కోరారు. స్థిరమైన నీటి నిర్వహణలో ఎదురయ్యే సమస్యలను ఎదుర్కొనడం వాటికి పరిష్కారం కనుగొనేందుకు ఈ ఎగ్జిబిషన్‌లో జరిగే చర్చ ఉపయోగపడుతుందన్నారు. స్మిత్‌సోనియన్ ఇన్స్‌టిట్యూషన్ మరియు కేర్ ఎర్త్ ట్రస్టుతో కలిసి ఈ ఎగ్జిబిషన్ నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు రాబర్ట్ బర్గెస్.

Water Matters Exhibition opens in Chennai

స్మిత్‌సోనియన్ ఇన్స్‌టిట్యూషన్ నిర్వహిస్తున్న ట్రావెలింగ్ ఎగ్జిబిషన్ H2O టుడే పై వాటర్ మ్యాటర్స్ ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా దక్షిణ భారత దేశంలో స్మిత్‌సోనియన్‌కు ఉన్న చరిత్రను మరింత బలోపేతం చేయడంలో ఈ వాటర్ మ్యాటర్స్ ఎగ్జిబిషన్ ఉపయోగపడుతుంది. ఈ ఎగ్జిబిషన్‌లో సైన్స్, ఇన్నోవేషన్, స్థిరమైన నీటి నిర్వహణ, సమాచారం, ఇతర ఎడ్యుకేషనల్ ప్రయోగాలకు సంబంధించిన అంశాలపై 53 ప్యానెల్స్ ఫోకస్ చేస్తాయి.

ఇక నీటి నిర్వహణపై కొన్ని కార్యక్రమాలు కూడా ఈ ఎగ్జిబిషన్‌లో ఉంటాయి. ముఖ్యంగా లెక్చర్లు, సైన్స్ వర్క్‌షాప్ మాస్టర్ క్లాసెస్ నుంచి నగరంలో అక్కడక్కడ నిర్వహించే సాంస్కృతిక కార్యక్రమాలు హాజరు కావాల్సిందిగా ప్రజలకు ఆహ్వానం పలుకుతోంది. ఇక కార్యక్రమాలకు సంబంధించిన క్యాలెండర్ కూడా యూఎస్ కాన్సులేట్ జనరల్ చెన్నై ఫేస్‌ బుక్ పేజ్ పై పొందుపర్చడం జరిగింది
http://www.facebook.com/chennai.usconsulate.

తమిళనాడు ప్రజలకు ఉపయుక్తకరంగా ఉండేందుకు నిర్వహించిన ఈ ఎగ్జిబిషన్‌‌ను అభినందించారు తమిళనాడు ఉన్నత విద్యాశాఖ మంత్రి కేపీ అన్బలగన్. ఈ కార్యక్రమం చేపట్టిన అమెరికా కాన్సులేట్ జనరల్‌తో పాటుగా స్మిత్‌సోనియన్ ఇన్స్‌టిట్యూషన్‌కు కూడా కృతజ్ఞతలు తెలిపారు. ఇక ఈ కార్యక్రమంలో అకాడెమీ విజేత ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహ్మాన్ పాల్గొని అమెరికా కాన్సులేట్ జనరల్‌ను అభినందించారు. స్థిరమైన నీటి నిర్వహణ కోసం ఎగ్జిబిషన్ పెట్టినందుకు ధన్యవాదాలు తెలిపారు. నీటి వనరులు జీవితంలో ప్రధాన పాత్ర పోషిస్తాయని చెప్పిన ఏఆర్ రెహ్మాన్ వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని చెప్పారు. భవిష్యత్ తరాల వారికి శుభ్రమైన సురక్షితమైన నీరును అందించాలని అన్నారు. ఈ ఎగ్జిబిషన్ ద్వారా నీటి విలువ ఏంటో అంతా గ్రహిస్తారని తాను భావిస్తున్నట్లు చెప్పారు.

చెన్నైలో మంచి వర్షపాతం నమోదవుతుందని ఇక్కడ నాలుగు నదులతో పాటు సముద్ర తీరం కూడా ఉందని అన్నారు కేర్ ఎర్త్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ డాక్టర్ జయశ్రీ వెంకటేశన్. అయితే చెన్నై నగరంలో నీరు చాలా విరివిగా లభిస్తుందని లేదంటే అస్సలు నీరు లభించదని అన్నారు. ఇక వాటర్ మ్యాటర్స్ ద్వారా ప్రజల్లో అవగాహన వచ్చి నగరంలో నీటి నిల్వ చేసుకునేలా దోహదపడుతుందని భావిస్తున్నట్లు డాక్టర్ జయశ్రీ చెప్పారు.

ఎగ్జిబిషన్ వివరాలు:

తేదీలు: ఫిబ్రవరి 11 నుంచి ఫిబ్రవరి 29, 2020

సమయం: ఉదయం 10:30 గంటల నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు

స్థలం: పెరియార్ సైన్స్ అండ్ టెక్నాలజీ సెంటర్ ( బిర్లా ప్లానెటోరియం పక్కన) కొట్టుపురం

English summary
The U.S. Consulate General in Chennai in cooperation with Care Earth Trust, the Government of Tamil Nadu, and the Smithsonian Institution Traveling Exhibition Service (SITES) inaugurated the Water Matters exhibition at the Periyar Science and Technology Centre in Chennai on February 10. The exhibition will be open to the public February 11-29.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X