వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అంతరిక్షంలో బతకాలంటే ఆహారం ఎక్కడినుంచి వస్తుంది? చెట్లు మొలుస్తాయా? మాంసం తయారు చేయొచ్చా?

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
వ్యోమగామి

జెఫ్‌ బెజోస్, ఎలాన్ మస్క్ అంతరిక్షంలో కాలనీలు ఏర్పాటు చేసే ప్రయత్నాల్లో ఉన్నారు. నాసా కూడా దుమ్మూ ధూళితో నిండిన మార్స్ మీదకు జనాన్ని పంపేందుకు సిద్ధమవుతోంది.

అంతా బాగానే ఉంది. వీళ్లంతా అక్కడికి మనుషులను పంపిస్తారు సరే. వాళ్లు తినడానికి తిండి సంగతేంటి, అక్కడికెళ్లిన వారు ఏం తిని బతుకుతారు?

అంతరిక్షంలో చెట్లు మొలుస్తాయా అన్నదానిపై ఇప్పటికే అనేక ప్రయోగాలు జరిగాయి. అక్కడ మాంసపు కణాలు పెరుగుతాయా లేదా అన్నదానిపై ఇటీవలనే ప్రయోగాత్మక పరిశీలన ప్రారంభమైంది.

అంతరిక్షంలో పోషకాలను పెంచడం కుదురుతుందా అన్నదానిపై ఇది చిన్న పైలట్ ప్రాజెక్ట్ మాత్రమే. అయితే భవిష్యత్తులో ఇది ఒక పెద్ద ముందడుగు కావచ్చు.

కనీసం స్పేస్ ట్రావెలర్స్ కోసమైనా ఇది ఉపయోగపడుతుందని సైంటిస్టులు భావిస్తున్నారు.

కణాల నుంచి మాంసాన్ని తయారు చేయడంలో ఎక్స్‌పర్ట్ అయిన ఇజ్రాయెల్ కంపెనీ ఆలెఫ్ ఫార్మ్స్ ఈ ఆలోచనను ముందుగా బైట పెట్టింది. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్‌కు వెల్ ఆల్‌ ప్రైవేట్‌ ఆస్ట్రోనాట్ టీమ్ ఈ ప్రయోగాన్ని నిర్వహించింది.

అయితే, అంతరిక్షంలో పరిస్థితులు ఎప్పుడూ స్థిరంగా ఉండవు. ఇది భూమి మీద నుంచి మాంసాన్ని అంతరిక్షంలోకి తీసుకెళ్లినంత సులభం కాదంటున్నారు నిపుణులు.

కణాల నుంచి మాంసం తయారు చేయడం, అది కూడా అన్నీ సవ్యంగా ఉండేలా తయారు చేయడం భూమి మీద కూడా అంత సులభం కాదు. కల్చరల్ మీట్ తయారు చేయడానికి ప్రయత్నిస్తున్న కంపెనీల్లో ఒకటైన ఆలెఫ్ ఫార్మ్, ముందుగా దీన్ని అంతరిక్షంలో తయారు చేయాలని భావిస్తోంది.

ఆవులోని కణాలు ( లేదా ఏదైనా జంతువు కణాలైనా కావచ్చు) తాము పెరగడానికి అవసరమైన అమైనో ఆమ్లాలు, కార్బోహైడ్రేట్ల వంటి వాటిని స్వీకరిస్తాయి. కండర కణజాలం ఏర్పడే వరకు ఆ కణాలు రెట్టింపు అవుతుంటాయి. చివరకు మనం తినే మాంసం సిద్ధమవుతుంది. ఈ ప్రక్రియను " కల్టివేషన్" లేదా "ప్రొలిఫిరేషన్ " అంటారు.

ఇక్కడ మాంసాన్ని ట్యాంకుల్లో తయారు చేస్తారు. ఇది మీరు వ్యవసాయ క్షేత్రంలో తయారైన మాంసం కంటే బ్రూవరీలో తయారు చేసిన మాంసంలాగానే ఉంటుంది. మాంసం కోసం పెంచిన జంతువు జీవిత చక్రం, అంటే పుట్టుక, జీవితం, చంపిన సమయంలాంటివి పూర్తిగా రహస్యంగా ఉంటాయి.

ఈ ప్రక్రియ పర్యావరణానికి అనుకూలంగా ఉంటుందని, ఉదాహరణకు మీథేన్ ఉద్గారాలను గణనీయంగా తగ్గించవచ్చని పర్యావరణవేత్తలు, నిపుణులు అంటున్నారు.

అంతరిక్షంలో మాంసం ఎందుకు తయారు చేయాలి?

జీరో గ్రావిటీలో దీనిని పునరావృతం చేయవచ్చో లేదో శాస్త్రవేత్తలకు తెలియదని ఆలెఫ్ ఫార్మ్స్ స్పేస్ ప్రోగ్రామ్ కు నాయకత్వం వహిస్తున్న జ్వికా తమరి చెప్పారు.

"మైక్రోగ్రావిటీ వాతావరణంలో శరీర ధర్మ శాస్త్రం, జీవశాస్త్రం చాలా భిన్నంగా ప్రవర్తిస్తాయని ఇంతకు ముందు జరిగిన అనేక శాస్త్రీయ అధ్యయనాలతో తేలింది. కాబట్టి, మాంసం తయారీ ప్రక్రియలు అంతరిక్షంలో జరుగుతాయో లేదో మాకు ఇంకా తెలియదు, మాకే కాదు ఎవరికీ తెలియదు" అన్నారు తమరి.

ఏప్రిల్ 8న నలుగురు వ్యక్తులు స్పేస్‌ఎక్స్ రాకెట్‌లో అంతరిక్షంలోని అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి(ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్-ఐఎస్ఎస్) మొట్ట మొదటి ప్రైవేట్ మిషన్‌లో వెళ్లారు. వారు తమతోపాటు జంతు కణాలున్న ఒక చిన్న షూ బాక్స్ సైజు ఉన్న కంటైనర్‌ను తీసుకువెళ్లారు. అక్కడ దానిని వృద్ధి చేయాల్సి ఉంటుంది.

మాజీ వ్యోమగామి మైఖేల్ లోపెజ్ అలెగ్రియాతో కలిసి ఫ్లోరిడాలోని కెన్నెడీ స్పేస్ సెంటర్ నుండి లారీ కానర్, ఐటాన్ స్టిబ్బే, మార్క్ పాథీ అంతరిక్షంలోకి వెళ్లారు. వారు తిరిగి వచ్చిన తర్వాత అక్కడి నుంచి తీసుకొచ్చిన కణాలను పరిశీలిస్తారు.

ఇది అంత విలువైనదేనా?

ఒకవేళ ఈ ప్రయోగం సక్సెస్ అయ్యి, అంతరిక్షంలో కృత్రిమంగా మాంసం తయారు చేయడం సాధ్యమని తేలినా, అదేమీ గొప్ప విషయం కాబోదని నిపుణులు అంటున్నారు. ఎందుకంటే, ఇక్కడ భూమి మీద స్థానిక మార్కెట్లలో ఈ కణాల నుంచి తయారైన మాంసమే పెద్దగా కనిపించదు. ఈ స్పేస్ ప్రోగ్రామ్ ద్వారా మాంసాన్ని తయారు చేయడం కోసం వందలు వేల కోట్ల డాలర్లు ఖర్చవుతున్నాయి. (హాలీవుడ్ నటుడు లియోనార్డో డికాప్రియో కూడా ఆలెఫ్ ఫార్మ్స్ ప్రాజెక్టులో పెట్టుబడులు పెట్టారు). అంతేకాదు ఈ మాంసాన్ని పెద్ద ఎత్తున తయారు చేయడం కూడా కష్టమంటున్నారు. ఇజ్రాయెల్ లోనే దీనిని రెస్టారెంట్లలో వడ్డించే స్థాయిలో చట్టబద్ధమైన అనుమతులు రావాల్సి ఉంది.

భూమి మీదనే ఇన్ని సమస్యలుంటే, ఇక అంతరిక్షంలో ఎప్పటికి ఇది విజయవంతం అవుతుందన్నది ప్రశ్నార్ధకం. దీనికి తోడు అంతరిక్షంలో దీన్ని తయారు చేయడానికి బోలెడన్ని ప్రాక్టికల్ సమస్యలున్నాయని అంటున్నారు. ముఖ్యంగా స్టెరిలిటి(క్రిమిరాహిత్యం) ఎంత అన్నది కీలకం.

''జంతువులలో కణాలు చాలా నెమ్మదిగా పెరుగుతుంటాయి'' అని బెర్క్‌లీలో కెమికల్ ఇంజినీర్ డేవిడ్ హంబర్డ్ అన్నారు.

''బ్యాక్టీరియా, ఫంగస్‌లు కల్చర్‌లోకి వస్తే అవి మామూలు జంతువుల కణాలకన్నా వేగంగా పెరుగుతాయి. అప్పుడు మీరు తయారు చేసింది మాంసం కాదు. బ్యాక్టీరియా. వాటిని పారేయడం తప్ప మరో మార్గం ఉండదు'' అన్నారు హంబర్డ్.

అయితే అంతరిక్షంలో బ్యాక్టీరియాగా మారే సమస్యను అధిగమించవచ్చని ఆలెఫ్ ఫార్మ్ అంటోంది. అక్కడ తయారు చేసేది కొద్ది మొత్తంలో కాబట్టి ఇది సమస్య కాకపోవచ్చని అంటోంది. అయితే, మార్స్ లాంటి ప్రాంతంలో ఇది ప్రమాదకరంగా మారే అవకాశం ఉందని నిపుణఉలు చెబుతున్నారు.

సమస్యలు ఉన్నాయా?

అంతరిక్షంలోకి ఆహారాన్ని రవాణా చేయడం చాలా ఖరీదైన వ్యవహారం కాబట్టి ఇది మేలైన విధానమని ఆలెఫ్ ఫార్మ్స్ వాదిస్తోంది. 2008 నాటి నాసా అంచనాల ప్రకారం...సుమారు అరకేజీ ఆహారాన్ని మోసుకెళ్లడానికి దాదాపు 10,000 డాలర్లు (సుమారు రూ.7,66,880) అవుతుంది.

అదే మార్స్ మీదకు ఇదే పరిమాణంలో ఆహారాన్ని తీసుకెళ్లాలంటే ఇంకా ఎక్కువ ఖర్చవుతుంది.

''మార్స్ మనకు లక్షల కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అక్కడ స్థానికంగా మనం ఫుడ్ తయారు చేసుకోవడం వల్ల చాలా ప్రయోజనం ఉంటుంది'' అన్నారు జ్వికా తమరి. అయితే, ప్రయోజనాల విషయంలో జ్వికా తమరి తో విభేదించారు హంబర్డ్.

''తినదగిన పదార్థాలపై స్వయంగా పెరిగిన కణాలు చక్కెర, అమైనో ఆమ్లాలు, నీరుగా మారతాయి. కానీ, తయారు చేసే కణాల కేలరీల విలువ ఎప్పుడూ దానికన్నా తక్కువగానే ఉంటుంది'' అన్నారు హంబర్డ్

''మీరు తీసుకెళ్లే పదార్ధాలలోనే 25 శాతం కేలరీలు ఉంటాయి. మిగిలిన 75 కేలరీలను సృష్టించడానికి వీటిని ఇక్కడి నుంచి అక్కడికి మోసుకుపోవడం అవసరమా'' అని ఆయన ప్రశ్నించారు.

కృత్రిమ మాంసం తయారు చేయడం ద్వారా కార్బన్ ఉద్గారాలను తగ్గించవచ్చని నిపుణులు చెబుతున్నారు

అయితే, వ్యోమగాముల మానసిక ఆరోగ్య పరిస్థితికి సంబంధించిన మరికొన్ని ప్రయోజనాలు ఉన్నాయని అంటున్నారు నిపుణులు.

నాసా మాజీ వ్యోమగామి కరెన్ నైబర్గ్ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ఐదున్నర నెలలు గడిపారు. ఇప్పుడామె ఆలెఫ్ ఫార్మ్స్ సలహా బోర్డులో ఉన్నారు. ఇలాంటి ఆహారం వ్యోమగాముల మానసిక ఆరోగ్య స్థితిపై ప్రభావం చూపుతుందని ఆమె అంటున్నారు.

''మనకు తెల్లటి సంచుల్లో వచ్చే ఫుడ్ కేవలంహైడ్రేట్ కావడానికి ఉపయోగపడుతుంది. ఉదాహరణకు పాలపొడిలాంటివి. కానీ, నాకు వెల్లుల్లి, ఆలివ్ ఆయిల్ లాంటి వాసనల కావాలనిపిస్తుంది. అవి మన దగ్గర ఉండవు. అలాంటివి దొరికితే అది మన ఇంటి దగ్గరే ఉన్న భావన కలిగిస్తుంది'' అన్నారు నైబర్గ్.

సంవత్సరాల తరబడి అంతరిక్షంలో ఉండే వ్యోమగాములకు తాజా పండ్లు కూరగాయల్లాంటివి కోరుకోవడం సహజమని నైబర్గ్ అన్నారు.

మనుషులను మార్స్ మీదకు పంపాలని పట్టుదలగా ఉంటే, అక్కడ వ్యోమగాములకు తాజా పళ్లు ఆహారం అందించడం అనేది పెద్ద సమస్యే. అంతరిక్షంలోనే మాంసంలాంటి వాటిని తయారు చేసుకోగలిగితే అవి భూమి నుంచి తీసుకెళ్లే ఆహారానికి ప్రత్యామ్నాయంగా మారతాయని నైబర్గ్ లాంటి వారు చెబుతున్నారు.

ఆలేఫ్ ఫార్మ్స్ చాలా ఉత్సాహంగా ఉంది. కానీ, భూమి మీదే పెద్ద ఎత్తున మాంసాన్ని తయారు చేయడం సాధ్యమని నిరూపించడమే ఆ కంపెనీకి పెద్ద సమస్యగా మారింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Where does food come from to survive in space? Do trees grow? Can meat be prepared
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X