Wife: భర్త ఫ్రెండ్ ను గిల్లిన వల్లి, మొగుడు ముందే క్రిమినల్, సైలెంట్ గా ఉంటే కిక్కు లేదని ?
చెన్నై/మదురై: దంపతులు మాత్రమే నివాసం ఉంటున్నారు. ఓ కేసులో భర్త జైలుకు వెళ్లాడు. జైల్లో ఉన్న భర్తను బయటకు తీసుకురావడానికి అతని భార్య ప్రయత్నించింది. భర్త స్నేహితుడు అతనికి బెయిల్ ఇప్పించడానికి ప్రయత్నించాడు. ఇదే సందర్బంలో భర్త స్నేహితుడు ఆమె ఇంటికి పదేపదే వెళ్లాడు. ఒంటరిగా ఉన్న మహిళ ఆమె భర్త స్నేహితుడితో అక్రమ సంబంధం పెట్టుకుని ఎంజాయ్ చేసింది. చివరికి భర్త జైలు నుంచి బయటకు వచ్చాడు. అసలే నేరస్తుడు, అసలు మ్యాటర్ తెలీకుండా ఉంటుందా చెప్పండి. భర్త అతని ఫ్రెండ్స్ కు అదిరిపోయే మంచి మందు పార్టీ ఇచ్చాడు. అక్కడ అసలు స్కెచ్ వేసిన భర్త అతని భార్య ప్రియుడిని చంపేసి హస్తిపంజరం మాత్రమే పోలీసులకు చిక్కేటట్లు ప్లాన్ చేశాడు.

మొగుడు క్రిమినల్
తమిళనాడులోని మదురై జిల్లాలోని ఒతకడై ప్రాంతంలో పెరియస్వామి అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. కొన్ని సంవత్సరాల క్రితం వల్లి అనే మహిళను పెరియస్వామి వివాహం చేసుకున్నాడు. ఉద్దరగా డబ్బులు సంపాదించాలనే ఆశతో పెరియస్వామి చోరీలు, లూటీలు, దారిదోపిడీలు చేసి క్రిమినల్ గా తయారైనాడు.

జైలుకు వెళ్లిన భర్త
పలు చోరీ కేసుల్లో నిందితుడు అయిన పెరియస్వామి మీద అనేక కేసులు నమోదు అయ్యాయి. ఓ కేసులో పెరియస్వామి మదురై సెంట్రల్ జైలుకు వెళ్లాడు. జైల్లో ఉన్న భర్త పెరియస్వామిని బయటకు తీసుకురావడానికి అతని భార్య వల్లి ప్రయత్నించింది. భర్త పెరియస్వామి స్నేహితుడు తమిళరసన్ అతనికి బెయిల్ ఇప్పించడానికి ప్రయత్నించాడు.

ఇద్దరికి అసలు మ్యాటర్ తెలుసు
ఇదే సందర్బంలో భర్త పెరియస్వామి స్నేహితుడు తమిళరసన్ వల్లి ఇంటికి పదేపదే వెళ్లాడు. బెయిల్ విషయంలో ఇద్దరు మాట్లాడుకుంటూ ఉండేవాళ్లు. భర్త పెరియస్వామి జైల్లో ఉండటంతో వల్లి ఒంటరిగా ఉంది. ఫ్రెండ్ పెరియస్వామికి ఇప్పుడు బెయిల్ రాదని అతని ఫ్రెండ్ తమిళరసన్ కు తెలుసు.

భర్త ఫ్రెండ్ ను గిల్లిన వల్లి
ఇదే సమయంలో వల్లి. తమిళరసరన్ ఒకరిని ఒకరు గిల్లుకున్నారు. భర్త పెరియస్వామి ఫ్రెండ్ తమిళరసన్ తో అక్రమ సంబంధం పెట్టుకున్నవల్లి అతనితో పిచ్చపాటిగా ఎంజాయ్ చేసింది. నాలుగు నెలల తరువాత ఏదేదో చేసి పెరియస్వామి బెయిల్ మీద జైలు నుంచి విడుదల అయ్యాడు.

భార్య మ్యాటర్ తెలిసి స్కెచ్ వేసిన భర్త
అసలే నేరస్తుడు అయిన పెరియస్వామికి అతని స్నేహితులు అతని భార్య వల్లి, తమిళరసన్ అక్రమ సంబందం గురించి పిన్ టూ పిన్ చెప్పేశారు. వల్లి అక్రమ సంబంధం మ్యాటర్ తెలీకుండా ఉంటుంది అనుకున్న తమిళరసన్ అసలు మ్యాటర్ ఊహించలేకపోయాడు. పెరియస్వామి అతని ఫ్రెండ్స్ కు మదురై సమీపంలోని కురుదూర్ లో అదిరిపోయే మంచి మందు పార్టీ ఇచ్చాడు. అక్కడ అసలు కథ మొదలైయ్యింది.

చంపేపి శవం ఏం చేశాడంటే ?
తమిళరసన్ కు అతని ఫ్రెండ్ పెరియస్వామి పీకలదాక మద్యం తాగించాడు. తరువాత నా భార్య వల్లితోనే అక్రమ సంబంధం పెట్టుకుంటావా అంటూ తమిళరసన్ ను చితకబాదేశారు. అదే సమయంలో పెరియస్వామి అతని స్నేహితులు నవీన్, అళగన్, గుణాలన్, అలగరన్ అనే స్నేహితులు కలిసి తమిళరసన్ ను దారుణంగా చంపేశారు.

హస్తిపంజరం మాత్రం బయటకు వచ్చింది
తమిళరసన్ ను హత్య చేసిన తరువాత అతని శవాన్ని పాడుపడిన బావిలో విసిరేశారు. అప్పటి నుంచి తమిళరసన్ కోసం అతని కుటుంబ సభ్యులు వెతుకుతున్నారు. నెల రోజుల తరువాత వల్లి భర్త పెరియస్వామి మళ్లీ జైలుకు వెళ్లాడు. పెరియస్వామి స్నేహితుడు నవీన్ తాగేసి అతని స్నేహితుల ముందు తమిళరసన్ హత్య గురించి మ్యాటర్ చెప్పాడు.

ఫ్రెండ్ భార్యతో డీల్ ఇలాగే ఉంటుంది
విషయం తెలుసుకున్న మదురై జిల్లా పోలీసులు పాడుపడిన బావిలో గాలించగా తమిళరసన్ అస్తిపంజరం మాత్రమే చిక్కడంతో దానికి వైద్యపరీక్షలు నిర్వహించారు. ఫ్రెండ్ పెరియస్వామి భార్య వల్లితో అక్రమ సంబంధం పెట్టుకున్న తమిళరసన్ దారుణ హత్యకు గురి కావడం మదురైలో కలకలం రేపింది












Click it and Unblock the Notifications