ఈ ప్రభుత్వాన్ని ఇంటికి పంపుతా, అధికార దాహం: దినకరన్

Posted By:
Subscribe to Oneindia Telugu

చెన్నై: అన్నాడీఎంకే కార్యవర్గ సమావేశాన్ని దినకరన్ ఖండించారు. తనను, శశికళను పార్టీ నుంచి తప్పించే హక్కు ఎవరికీ లేదని ఆయన చెప్పారు.

ముఖ్యమంత్రి పళనిస్వామి, మాజీ సీఎం పన్నీరుసెల్వంలకు ప్రజలు, కార్యకర్తల మద్దతు ఉందనుకుంటే ఎన్నికలకు వెళ్లాలని సవాల్ చేశారు. పళనిస్వామి నాయకత్వాన్ని ప్రజలు కోరుకోవడం లేదని చెప్పారు.

తమకు చాలామంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని తెలిపారు. మంత్రులకు ఎన్నికల భయం పట్టుకుందన్నారు. నేను ఈ ప్రభుత్వాన్ని ఇంటికి పంపడం ఖాయమని దినకరన్ అన్నారు.

పార్టీ నుంచి శశికళ, దినకరన్‌లు ఔట్: జయ శాశ్వత ప్రధాన కార్యదర్శి

Will work to bring down Palaniswami government: Dinakaran

మాకు, డిఎంకేకు మాత్రమే పోరాటం కొనసాగుతుందన్నారు. పళనికి ఎవరూ ఓటేయలన్నారు. ఆయనను సీఎం పీఠంపై చూడలేనని చెప్పారు. పన్నీరు కారణంగా మా ఎన్నికల గుర్తు పోయిందన్నారు. కార్యకర్తలు మా వెంటే ఉన్నారని చెప్పారు.

పళని, పన్నీరులకు కావాల్సింది సీఎం పీఠంపై కూర్చొని అధికారం అనుభవించడమే అన్నారు. అమ్మకు నమ్మిన బంటును తానే అని చెప్పారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Sidelined AIADMK leader T.T.V. Dinakaran, who is leading 21 party legislators, on Tuesday said he would work towards bringing down the K. Palaniswami government.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి