చైనాలో ట్రంప్‌ కు ఘన స్వాగతం! కదిలిన మూడు యుద్ధనౌకలు, అయినా తగ్గని కిమ్!

Posted By:
Subscribe to Oneindia Telugu
  చైనా-భారత్ కు హానికరం: అమెరికా హెచ్చరిక | Oneindia Telugu

  బీజింగ్‌: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ కు చైనాలో ఘన స్వాగతం లభించింది. ఆసియా టూర్ లో భాగంగా భార్య మెలానియాతో కలిసి మూడు రోజుల చైనా పర్యటనకు వచ్చిన అగ్రరాజ్యాధినేతకు బీజింగ్‌లో చైనా అధ్యక్షుడు జీ జిన్ పింగ్, ఆయన భార్య ఎదురేగి స్వాగతం పలికారు.

  మింట్‌ రాజవంశీకుల ప్రాచీన భవనం ఫర్‌బిడెన్‌ సిటీలో ట్రంప్ కు ఆతిథ్యం ఇవ్వటం ద్వారా చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌ ఈ కార్యక్రమానికి రాజరికపు సొబగులు అద్దారు. ఈ సందర్భంగా తేనేటి విందు, పెకింగ్‌ ఒపెరా వంటి సాంస్కృతిక ప్రదర్శనలను ఏర్పాటు చేశారు.

  తొలిరోజే విలువైన ఒప్పందాలు...

  తొలిరోజే విలువైన ఒప్పందాలు...

  ట్రంప్‌ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా చైనా పర్యటనకు వచ్చారు. పర్యటన తొలిరోజే అమెరికా-చైనాల మధ్య సుమారు రూ.58,500 కోట్ల (900 కోట్ల డాలర్ల) విలువైన వాణిజ్య ఒప్పందాలు కుదిరాయి.

  మళ్లీ జాత్యహంకారం బుసలు! న్యూజెర్సీలో భారత సంతతి మహిళపై దుష్ప్రచారం!

  ట్రంప్‌ మనుమరాలు ప్రావీణ్యం...

  ట్రంప్‌ మనుమరాలు ప్రావీణ్యం...

  తన ఆరేళ్ల మనుమరాలు (ఇవాంకా, జరేద్‌ కుష్నర్ ల కుమార్తె) అరబెల్లా చైనా భాష మాండరిన్‌ను నేర్చుకుంటున్న వీడియో దృశ్యాలను చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌కు ట్రంప్‌ ప్రత్యేకంగా చూపించారు. ఆమె ప్రావీణ్యాన్ని చూసి జిన్‌పింగ్‌ అరబెల్లాకు ఏ+ సర్టిఫికేట్‌ ఇవ్వవచ్చంటూ మెచ్చుకున్నారు.

  ట్రంప్‌కు ఎదురుదెబ్బ, చైనా ముందు జాగ్రత్త, అక్కడ నో ట్విట్టర్.. మరెలా?

  ట్రంప్‌ కోసం ప్రత్యేకంగా...

  ట్రంప్‌ కోసం ప్రత్యేకంగా...

  కాలుష్యం, మంచుతో కమ్ముకుని ఉండే బీజింగ్‌ నగరంలో ట్రంప్‌ రాక సందర్భంగా చైనా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. గత వారం నుంచి కాలుష్యం కట్టడికి తీసుకున్న చర్యలు బుధవారం ఫలించాయి. దీని కోసం వాహనాల రాకపోకలపై ఆంక్షలు విధించారు. ఉక్కు, సిమెంట్‌ తదితర పరిశ్రమల్లో ఉత్పత్తిని నిలిపివేశారు. అమెరికా అధ్యక్షుడి విమానం బీజింగ్‌లో దిగే సమయానికి ఆకాశం నిర్మలంగా మారింది. వాతావరణ కాలుష్యం గణనీయంగా తగ్గింది.

  పాపం ఉత్తరకొరియా! అమెరికాకు లొంగి బతకాలా, ఆత్మరక్షణ నేరమా, చరిత్ర ఏం చెబుతోంది?

  దాడిని ఎదుర్కొనేందుకు ఎల్లవేళలా సిద్ధంగా..

  దాడిని ఎదుర్కొనేందుకు ఎల్లవేళలా సిద్ధంగా..

  మరోవైపు అమెరికా తన సైనిక శక్తికి కూడా పదునుపెడుతోంది. ట్రంప్ ఆసియా దేశాల పర్యటన నేపథ్యంలో ఉత్తరకొరియా నుంచి పొంచి ఉన్న ముప్పును సమర్ధంగా ఎదుర్కొనేందుకు అవసరమైన అన్ని చర్యలూ తీసుకుంటోంది. ఇప్పటికే అమెరికాకు చెందిన యుద్దనౌకలు నిమితీజ్, రోనాల్డ్ రీగన్, తేడోర్ రూజ్ వెల్ట్‌లు ఫసిఫిక్ సముద్రంలో విన్యాసాలు నిర్వహిస్తున్నాయి. అత్యంత ఆధునికమైన ఈ మూడు యుద్ధ నౌకలుండగా ఏ దేశం అమెరికాతో పోరుకు ముందుకు రాలేదని అమెరికా మీడియా చెబుతోంది.

  మూడు అమెరికా యుద్ధ నౌకలు ఒకేసారి..

  మూడు అమెరికా యుద్ధ నౌకలు ఒకేసారి..

  నిజానికి 2007 తర్వాత అమెరికా ఎప్పుడూ కూడా మూడు యుద్ధనౌకలను ఒకేసారి సముద్రంలోకి పంపలేదు. అయితే ప్రస్తుతం నెలకొన్న పరిస్థితి వేరు. ఉత్తరకొరియాతో ఉద్రిక్తతల నేపథ్యంలోనే ఈ మూడు యుద్ధ నౌకలు ఒకేసారి పసిఫిక్ జలాల్లోకి ప్రవేశించాయని అమెరికా మీడియా చెబుతోంది. యుద్ధానికి సర్వసన్నధం చేసిన తర్వాతనే అమెరికా రక్షణ విభాగం వాటిని ఫసిఫిక్ సముద్రంలో పంపిందని పేర్కొంది.

  నిశితంగా పరిశీలిస్తోన్న ఉత్తరకొరియా...

  నిశితంగా పరిశీలిస్తోన్న ఉత్తరకొరియా...

  మరోవైపు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆసియా పర్యటనను ఉత్తరకొరియా నిశితంగా పరిశీలిస్తోందని అంతర్జాతీయ మీడియా తెలిపింది. కొంతకాలంగా రెండు దేశాల మధ్య మాటల యుద్ధం జరుగుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆ యుద్ధం ముదిరిందని, అది మాటల వరకు పరిమితమయితే బాగుంటుందని.. చేతల్లోకి మళ్లితే ప్రపంచానికి ఎంతో ప్రమాదకరమని అంతర్జాతీయ మీడియా హెచ్చరించింది.

  మాటల్లోనే దైర్యం.. చేతల్లో లేదు...

  మాటల్లోనే దైర్యం.. చేతల్లో లేదు...

  దక్షిణకొరియా పార్లమెంట్‌లో మాట్లాడిన ట్రంప్ ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ ను పిచ్చివాడితో పోల్చారు. ఉత్తరకొరియా కూడా అమెరికా అధ్యక్షుడికి దీటుగా జవాబిచ్చింది. ట్రంప్ మాటల్లో ఉన్న దైర్యం చేతల్లో కనపడటం లేదని, ఆయన చేతకాని వాడంటూ విమర్శించింది. ఉత్తరకొరియా జోలికి వస్తే 1953 నాటి పరిస్థితులే పునరావృతం అవుతాయని మళ్లీ ఒకసారి హెచ్చరించింది.ఆ దేశ అధినేత కిమ్ జాంగ్ ఉన్ కూడా ‘ఆ ముసలి పిచ్చివాడి పదవి తొలగించండి..' అంటూ ట్రంప్ ని ఉద్దేశించి తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. ఇరాక్ అధ్యక్షుడు సద్దాం హుస్సేన్ ను అంతమొందించినట్లుగా అమెరికా తనను కూడా చంపేస్తుందని కిమ్ భావిస్తున్నారని, అందుకే ట్రంప్ గద్దె దిగిపోతే ఉత్తరకొరియాకు ఎలాంటి ప్రమాదం ఉండదని ఆయన భావిస్తున్నారని ఉత్తరకొరియా మీడియా తాజాగా ఓ కథనంలో పేర్కొంది.

  ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  China also poured on the pomp and pageantry for Trump's arrival on Wednesday. The President and First Lady Melania Trump were greeted at the airport by dozens of jumping children who waved US and Chinese flags. The couple spent the first hours of their visit on a private tour of the Forbidden City, Beijing's ancient imperial palace. It's usually teeming with tourists but was closed to the public for the presidential visit. The Trumps walked alongside Xi and his wife through the historic site and admired artefacts from centuries' past. Trump posed for photos and, with a wave of his hand, joked to Xi about the reporters watching. And he laughed and clapped along during an outdoor opera featuring colourful costumes, martial arts and atonal music.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి