వణికిస్తోన్న హైపోథార్మియా: తెల్లారేసరికే ప్రాణాలు పోతున్నాయ్, ఏంటీ వింత?

Subscribe to Oneindia Telugu

బ్యాంకాక్: హైపోథెర్మియా మరణాలు థాయ్‌లాండ్‌ను వణికిస్తున్నాయి. దీని బారినపడ్డ వాళ్ల శరీర ఉష్ణోగ్రతలు పూర్తిగా పడిపోయి.. శరీరం చల్లబడిపోయి ప్రాణాలు విడుస్తారు. గత 15రోజుల వ్యవధిలో ఇద్దరు వ్యక్తులు ఇలాగే వదలడం గమనార్హం.

మ్యూయాంగ్ జిల్లా ముక్దాన్‌ అనే పట్టణంలో మూడు రోజుల క్రితం ఓ వ్యక్తి హైపోథెర్మియాతో మరణించాడు. రాత్రిపూట పడుకునే సమయంలో చొక్కా లేకుండా పడుకున్నాడు. ఇక్కడ పగలు ఎంత అధిక ఉష్ణోగ్రతలు ఉంటాయో.. రాత్రికి అంత దారుణంగా పడిపోతుంటాయి.

Another succumbs to hypothermia in Thailand

చొక్కా లేకుండా పడుకోవడంతో శరీరం మొత్తం చల్లబడిపోయి ప్రాణాలు కోల్పోయాడు. వైద్యులు ఈ విషయాన్ని ధ్రువీకరించారు. 10రోజుల క్రితం యాఫూమ్‌ ప్రావిన్స్‌ కు చెందిన సొబ్తావీ (44) తాంబాన్‌ అనే వ్యక్తి కూడా ఇలాగే మరణించాడు. తల్లి(86)ని చూసేందుకని వెళ్లి.. ఉక్కపోత ఎక్కువగా ఉండటంతో మూడు ఫ్యాన్లు పెట్టుకుని నిద్రపోయాడు.

రాత్రిపూట ఒక్కసారిగా ఉష్ణోగ్రతలు పడిపోవడం.. నేల పైనే పడుకుని ఉండటంతో అతని శరీరం పూర్తిగా చల్లబడిపోయింది. తెల్లారేసరికి అతను ప్రాణాలు కోల్పోయాడు. హైపోథెర్మియా మరణాల గురించి ఇప్పుడు థాయ్ లాండ్ లో పెద్ద ఎత్తున చర్చ జరుగతోంది. దీనివల్ల శరీర ఉష్ణోగ్రత 98.6ఫారన్ హీట్స్ నుంచి 95ఫారన్ హీట్స్ కు పడిపోతుంది. మనిషి ఎంత శారీరక దృఢంగా ఉన్నాడన్న దానితో సంబంధం లేకుండా ఈ మరణాలు సంభవిస్తుంటాయని వైద్యులు తెలిపారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A man was found dead in his house in Mukdahan’s Mueang district on Friday morning, apparently suffering from hypothermia.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి