వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

శభాష్ హర్లీ.. నదిలో కొట్టుకుపోతున్న జింక పిల్లను కాపాడి.. నెటిజన్ల ప్రశంసలు

|
Google Oneindia TeluguNews

అప్పుడప్పుడు విచిత్రాలు జరుగుతుంటాయి. జాతి వైరాలు మరచి మరీ జంతువులు ప్రవర్తిస్తాయి. చాలా సందర్భాల్లో గొడవకు దిగే అవీ.. కొన్ని సందర్బాల్లో మాత్రం తమ గొప్పతనాన్ని చాటుతాయి. తాజాగా ఓ శునకం ఇలానే చేసింది. కొట్టుకుపోతున్న జింక పిల్లను కాపాడి.. తన ఉదారతను చాటుకుంది. ఆ జింక కృతజ్ఞతగా శునకాన్ని కలిసింది. ఈ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతుంది. పూర్తి వివరాలు తెలుసుకుందాం. పదండి.

కనిపించని హర్లీ..

కనిపించని హర్లీ..

అమెరికాలో హర్లీ అనే శునకాన్ని పెంచుకుంటున్నారు. అయితే అదీ ఈ నెల మొదటి వారం నుంచి కనిపించడం లేదు. దీంతో యజమాని కంగారు పడ్డారు. సోషల్ మీడియా ఫేస్ ‌బుక్‌లో దాని గురించి రాశారు. అదీ చదివిన వర్జినియాకు చెందిన రల్ప్ డర్న్.. హర్లీని కనుగొన్నారు. తమ ఇంటి పక్కన గల సరస్సులో శునకం కనిపించిందని తెలిపారు. అయితే అదీ చిన్న జింక పిల్లకు సమీపంలో ఉందని.. జింక పిల్లను బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుందని వివరించారు. అయితే సరస్సులోకి హర్లే ఎలా వెళ్లిందనే అంశంపై మాత్రం క్లారిటీ లేదు.

 నదిలో ఈదుకుంటూ..

నదిలో ఈదుకుంటూ..

దీనికి సంబంధించి ఫోటోలను డర్న్ షేర్ చేశారు. జింక పిల్ల వద్దకు హర్లీ వెళ్లే ఫోటోలు కనిపించాయి. ఓ తల్లిలా జింక పిల్లను కాపాడింది హర్లీ. తర్వాత దానిని ఇంటికి తీసుకొచ్చారు. అయితే కొన్నిరోజుల తర్వాత హర్లీ చికాకు పడటం చూశారు. జింక పిల్లను చూడకుంటే పిచ్చిగా ప్రవర్తించింది. దానిని చూశాక.. కుదుటపడింది. ముక్కును టచ్ చేసి.. రెండు దగ్గరగా ఉన్నాయి. తర్వాత తోకముడిచి.. కామ్‌గా ఇంటికి చేరుకుంది హర్లీ. జింక పిల్లను వదలి ఉండటానికి హర్లీ సుతారము ఇష్టపడలేదు. ఈ పోస్ట్‌కు నెటిజన్ల నుంచి తెగ స్పందన వస్తుంది. 2.5 లక్షల సార్లు షేర్ చేశారు. చాలా మంది కామెంట్ కూడా చేశారు.

శభాష్

శభాష్

హర్లీ చేసిన పనిని ప్రశంసిస్తున్నారు. మేం ఇప్పుడూ ఇలాంటి ఘటన చూడలేదు.. గుడ్ జాబ్ హర్లీ అనే కామెంట్లు వస్తున్నాయి. నిజంగా ఇదీ మంచి జంతువుల స్టోరీ.. అని మరొకరు.. జింక పిల్లను కాపాడిన హర్లీ సో స్వీట్ అని మరొకరు కామెంట్ చేశారు.

English summary
Harley the dog rescued a baby deer drowning in a lake.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X