ఆ దేశంలో కండోమ్‌లపై పన్ను భారీగా పెంపు.. కారణమిదే?
జనాభా సంక్షోభంలో అల్లాడుతున్న చైనా దేశంలో జననాల రేటును పెంచేందుకు ఊహించని చర్యలకు శ్రీకారం చుట్టింది. ఇప్పటికే పిల్లలను కనడానికి ప్రోత్సాహకాలు ప్రకటిస్తున్న చైనా ప్రభుత్వం.. తాజాగా కండోమ్‌లు సహా ఇతర గర్భనిరోధక సాధనాలు, ఔషధాలపై పన్ను విధించాలని నిర్ణయించింది. గత మూడు దశాబ్ధాలలో జనాభా పెంపునకు సంబంధించి చైనా ప్రభుత్వం ఇలాంటి నిర్ణయం తీసుకోవడం ఇదే తొలిసారి.
కొత్తగా సవరించిన విలువ ఆధారిత పన్ను(వ్యాట్) చట్టం ప్రకారం.. గర్భనిరోధక సాధనాలు, ఔషధాలపై 13 శాతం పన్ను విధించనున్నారు. 1993 నుంచి కఠినంగా అమలు చేసిన కుటుంబ నియంత్రణ(వన్-చైల్డ్ పాలసీ) విధానంలో భాగంగా ఈ గర్భనిరోధక సాధనాలపై పన్ను మినహాయింపు కొనసాగుతోంది. తాజాగా చైనా ప్రభుత్వం ఈ మినహాయింపును ఎత్తివేసేందుకు సిద్ధమైంది. వచ్చే జనవరి నుంచి ఈ కొత్త పన్ను విధానం అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. ఈ చర్య ద్వారా గర్భనిరోధక సాధనాల వాడకాన్ని తగ్గించి జననాల రేటును పెంచవచ్చని చైనా ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది.

ఇతర ప్రోత్సాహకాలు.. పన్ను మినహాయింపులు
జననాల రేటు పెంపును ప్రోత్సహించడానికి చైనా ప్రభుత్వం తల్లిదండ్రులకు కొన్ని రంగాలలో పన్ను మినహాయింపులు కూడా ప్రకటించింది. జననాల రేటు పెంపును ప్రోత్సహించడానికి, చైనా ప్రభుత్వం తల్లిదండ్రులకు కొన్ని రంగాలలో పన్ను మినహాయింపులు కూడా ప్రకటించింది. పిల్లల సంరక్షణ సేవలు (నర్సరీ నుంచి కిండర్గార్టెన్ల వరకు), వృద్ధుల సంరక్షణ, వికలాంగుల సేవలు, వివాహ సంబంధిత సేవల్లో మినహాయింపులు ప్రకటించింది. పిల్లల సంరక్షణ కోసం నగదు ప్రోత్సాహకాలు అందించడం, పితృత్వ, ప్రసూతి సెలవులను పెంచడం, అలాగే గర్భస్రావాలను తగ్గించడం వంటి చర్యలను కూడా చైనా చేపడుతోంది.
పిల్లల పెంపకం భారం.. జనాభా సంక్షోభం
ప్రపంచంలోనే పిల్లల పెంపకం అత్యంత ఖరీదైన దేశాలలో చైనా ఒకటి. చైనాలో ఒక బిడ్డను 18 ఏళ్లు వచ్చే వరకు పెంచడానికి సగటున 76 వేల డాలర్లు (సుమారు ₹68 లక్షలు) ఖర్చు అవుతున్నట్లు అంచనా. ఈ అధిక ఖర్చు కారణంగా చాలా మంది దంపతులు పిల్లలను కనడానికి వెనకాడుతున్నారు. దశాబ్దాల పాటు 'ఒక బిడ్డ పాలసీ'ని అనుసరించిన చైనాలో ప్రస్తుతం వృద్ధ జనాభా వేగంగా పెరుగుతోంది. జననాల రేటు గత మూడేళ్లుగా గణనీయంగా తగ్గింది. దశాబ్దం క్రితం ఏడాదికి 1.88 కోట్ల జననాలు నమోదు కాగా.. గతేడాది ఇది సగానికి పడిపోయి 95.4 లక్షలకు చేరుకుంది.ఈ సంక్షోభాన్ని అధిగమించేందుకు చైనా ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతోంది.
హెచ్ఐవీపై ఆందోళనలు
కండోమ్‌లపై పన్ను విధించడంపై సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా హెచ్ఐవీ కేసులు తగ్గుముఖం పడుతున్నప్పటికీ.. చైనాలో గత 20 ఏళ్లతో పోలిస్తే ఎయిడ్స్ కేసుల సంఖ్య పెరిగినట్లు నివేదికలు ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో కండోమ్‌ల ధరలు పెరిగితే.. వాటి వినియోగం తగ్గి.. హెచ్ఐవీ వంటి లైంగికంగా సంక్రమించే వ్యాధులు పెరగడానికి దారితీయవచ్చనే ఆందోళనలు స్థానిక సోషల్ మీడియాలో వ్యక్తం అవుతున్నాయి ఈ సంచలన నిర్ణయం చైనా జననా రేటుపై ఎలాంటి ప్రభావాన్ని చూపుతుందో చూడాలి.
-
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్












Click it and Unblock the Notifications