Chinaలో మరో ఘోరం: 13 మంది కార్మికుల దుర్మరణం -నిర్లక్ష్యం కారణంగా ఐరన్ మైన్‌లో ప్రమాదం, అరెస్టులు

ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైనవిగా పేరుపొందిన చైనా దేశంలోని గనుల్లో మరో ఘోర ప్రమాదం జరిగింది. ఉత్తర చైనాలోని షాంజి ప్రావిన్స్, దిక్సియాన్ కౌంటీలో గల దెహోంగ్చాయ్ ఐరన్ గనిలో 13 మంది కార్మికులు దుర్మరణం చెందారు. దీనికి సంబందించి స్థానిక అధికారులు, మీడియా చెప్పిన వివరాలివి..

దిక్సియాన్ కౌంటీలోని ఐరన్ గనిలో ఈనెల 10న ప్రమాదం జరిగింది. గని నిర్వహణలో తీవ్ర నిర్లక్ష్యం కారణంగానే ఆ సంఘటన జరిగినట్లు రిపోర్టులు వచ్చాయి. ప్రమాద సమయంలో లోపల 13 మంది కార్మికులు చిక్కుకుపోయారు. వాళ్లను రెస్క్యూ చేసేందుకు ఏకంగా 1084 మంది రెస్క్యూ సిబ్బంది నిర్విరామంగా ఆరు రోజులపాటు కష్టపడ్డారు. చివరికి..

China Iron Mine Accident: 13 Workers’ death confirmed

గనిలో చిక్కుకుపోయిన 13 మంది కార్మికులూ మరణించినట్లు అధికారులు వెల్లడించారు. కార్మికుల మృతదేహాలను గని నుంచి వెలికి తీశారు. ఈ ప్రమాదానికి సంబంధించి ఇప్పటికే 13 మంది అనుమానితులను అధికారులు అరెస్టు చేశారు. దర్యాప్తు కొనసాగుతున్నదని, ప్రమాదానికి కారకులైనవారిపై కఠిన చర్యలుంటాయని పేర్కొన్నారు.

గని ప్రమాదాలకు కేరాఫ్ అయిన చైనాలో ఒక్క 2009లోనే ఏకంగా 2,631 మంది కార్మికులు దుర్మరణం చెందారు. ఎక్కువగా బొగ్గు గనుల్లో ప్రమాదాలు జరుగుతుండగా, అప్పుడప్పుడూ ఐరన్ గనుల్లోనూ పెద్ద సంఖ్యలో కార్మికులు ప్రాణాలు కోల్పోతున్నారు. ఇదిలా ఉంటే, హుబే ప్రావిన్స్ లో చోటుచేసుకున్న గ్యాస్ లీకేజీ ఘటనలోనూ మృతుల సంఖ్య భారీగా పెరిగింది..

హుబే రాష్టం జంగ్వాన్‌లోని షియాన్‌ సిటీలో ఓ రెండంతస్తుల భవంతిలో గ్యాస్‌ పైప్‌లైన్‌లో లీకేజీ కారణంగా పేలుడు సంభవించి 25 మంది మరణించారు. పదుల మంది గాయపడ్డారు. ఈ ఘటన నేపథ్యంలో కమర్షియల్‌, డొమెస్టిక్‌ గ్యాస్‌ పైప్‌లైన్‌లపై తనిఖీలు చేపట్టాలని చైనా ప్రభుత్వం ఆదేశించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+