వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పిల్లులకు ప్రమాదం.. శునకాలకు ఎక్కువ యాంటిబాడీస్, తాజా పరిశోధన

|
Google Oneindia TeluguNews

కరోనా మహమ్మారి మనుషులకే కాదు జంతువులకు కూడా ముప్పుగా పరిణమిస్తోంది. ఇప్పటికే అనేక జంతు ప్రదర్శనశాలల్లో గల జంతువులు కరోనా భారిన పడ్డాయి. కొన్ని ప్రాణాలు కూడా కోల్పోయాయి. అయితే తాజాగా పలు అధ్యయనాల్లో జంతువులకు కరోనా సోకే ప్రమాదం అధికమని తేలింది. న్యూయార్క్‌కు చెందిన వెటర్నరీ బయోమెడికల్ పరిశోధకుడు డాక్టర్ హిన్హ్ లీ, ఆయన సతీమణి యూయింగ్ లియాంగ్ జరిపిన పరిశోధనలో పలు ఆసక్తికర విషయాలు వెలుగు చూశాయి.

కుక్కలు , పిల్లుల్లో కోవిడ్ ప్రభావంపై వారు పరిశీలన చేశారు. పిల్లుల్లో కంటే కుక్కల్లో కరోనా వైరస్ ఎదుర్కొనే ప్రతిరక్షకాలు అధికంగా ఉన్నట్లు యాంటి బాడీ పరీక్షల్లో నిర్ధారించారు. వారి పరిశోధన వివరాలు వైరలెన్స్ జర్నల్‌లో ప్రచురితం అయ్యాయి. పిల్లులకు కరోనా వైరస్ సోకినప్పటికీ వాటిలో వైరస్ ప్రభావిత లక్షణాలు స్వల్పంగానే ఉన్నట్లు తేల్చారు.

coronavirus risk high in cats

చైనాలోని హార్బిన్ వెటర్నీరీ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ వైద్య బృందం అధ్యయనంలో వైరస్‌కు గురైన పిల్లులు, ఇతర పిల్లులకు వ్యాప్తి చేసినట్లు గుర్తించారు. శునకాల్లో మాత్రం ఇలాంటి వ్యాప్తి ఏమి లేదని తేల్చారు. కోళ్ళు, పందులు, బాతులు వైరస్ వచ్చే అవకాశం లేదని నిర్ధారణకు వచ్చారు. జంతువుల నుంచి వాటి యజమానులకు కరోనా వైరస్ సంక్రమించే విషయంపై ప్రత్యక్ష అధారాలు లేవని పరిశోధకులు చెబుతున్నారు. ఇదీ కాస్త ఊపిరి పీల్చుకునే అంశం.

వేసవిలోనే కరోనా వైరస్ ప్రభావం ఎక్కువగా ఉంటోంది. గతేడాది సమ్మర్‌లో కరోనా ఇంపాక్ట్ ఎక్కువగానే ఉంది. ఈ సారి సెకండ్ వేవ్ వల్ల యువత పిట్టల్లా రాలిపోయారు. థర్డ్‌వేవ్ పిల్లలకు అని ప్రచారం జరుగుతోంది. మరోవైపు వచ్చే ఏడాది సమ్మర్‌లో ఫోర్త్ వేవ్ అని కూడా అంటున్నారు. దీంతో కరోనా 5,6 ఏళ్లు ఉంటుందని అర్థం చేసుకోవచ్చు. వానకాలం రావడంతో ఫంగస్ ఇంపాక్ట్ తగ్గుతుందని వైద్యులు సూచిస్తున్నారు. ఇప్పటివరకు బ్లాక్ ఫంగస్ ఇంపాక్ట్ కనిపించింది.

English summary
coronavirus risk high in cats new study revealed. hinslee couple research this issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X