షాక్: పట్టపగలే దెయ్యం ఉయ్యాల ఊగింది(వీడియో)

Subscribe to Oneindia Telugu

న్యూయార్క్: ఈ వీడియో చూసిన తర్వాత ఏ తండ్రైనా తన పిల్లలను పార్కుకు తీసుకెళ్లాలంటే భయపడతాడు. పట్టపగలే ఎలాంటి గాలి కూడా రాని సమయంలో ఓ పార్కులో ఉయ్యాల దానంతట అదే ఊగితే ఎలా ఉంటుంది. ఆ ఘటనను వీడియో తీశాడు ఓ తండ్రి.. తన చిన్నారి కూతురితో కలిసి.

అమెరికాలోని రోడే ఐలాండ్‌లో వార్విక్ అనే ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్కాట్ డెంటన్ అనే వ్యక్తి తన కుటుంబాన్ని సరదాగా బయటికెళ్లినప్పుడు ఓ పార్కులో ఈ సన్నివేశం ఎదురైంది. వెంటనే తన కెమెరాలో బంధించాడతను.

ఎలాంటి గాలి లేకుండానే ఒక్క ఊయల మాత్రమే ఊగడంతో అతడు తన కారులోనే ఉండిపోయాడు. కారు కూడా దిగకుండానే ఆ సంఘటనను వీడియో తీశాడు. దెయ్యం ఉయ్యాల ఊగుతోందంటూ అతను తన వీడిలో చెప్పుకొచ్చాడు.

పగలు కూడా దెయ్యాలు తిరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశాడు. అంతేగాక, ఆ వీడియోను సోషల్ మీడియాలో పెట్టడంతో వైరల్‌గా మారింది. ఇప్పుడు సోషల్ మీడియాలో ఆ వీడియో చక్కర్లు కొడుతోంది.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
The swing rocks rapidly from side to side despite nobody being in the park and extremely mild weather.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

X