వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

డెల్టా కంటే డేంజరస్ వేరియంట్ లాంబ్డా .. ఇప్పటి వరకు 30 దేశాల్లో వ్యాప్తితో కొత్త భయం

|
Google Oneindia TeluguNews

కరోనా మహమ్మారి యావత్ ప్రపంచాన్ని పట్టి పీడిస్తోంది. రోజుకో రూపం మార్చుకుంటున్న కరోనా మహమ్మారి కొత్త భయాలకు కారణమవుతుంది. ఓ వేరియంట్ నుండి ఉపశమనం పొందగానే మరో వేరియంట్ రూపంలో దండయాత్ర మొదలుపెడుతుంది. నిన్నటిదాకా డెల్టా వేరియంట్ ను ఆందోళనకర వైవిధ్యంగా అందరూ భావిస్తే, అంతకుమించి ప్రమాదకరమైన మరో వేరియంట్ కేసులు తాజాగా వెలుగు చూస్తున్నాయి.

 ప్రపంచంలోని 30 దేశాలలో లాంబ్డా వేరియంట్

ప్రపంచంలోని 30 దేశాలలో లాంబ్డా వేరియంట్

కరోనా వైరస్ రూపాంతరం చెందుతూ రకరకాల మ్యుటేషన్ లతో విరుచుకు పడుతుంది. ఇప్పటి వరకు ఇండియన్ వేరియంట్ అయిన డెల్టా వేరియంట్ అన్నిటికంటే ప్రమాదకర వేరియంట్ అని దీని వ్యాప్తి అధికంగా ఉంటుందని నిపుణులు హెచ్చరించారు. అయితే ఇప్పుడు డెల్టా ప్లస్ వేరియంట్ తరువాత లాంబ్డా వేరియంట్, డెల్టా వేరియంట్ కంటే అత్యంత ప్రమాదకరమైనదని మలేషియా ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఇప్పటికే ప్రపంచంలోని 30 దేశాలు లాంబ్డా వేరియంట్ ను గుర్తించారని పేర్కొంది.

లాంబ్డా వేరియంట్ కేసులు పెరూలో దాదాపు 82 శాతం

లాంబ్డా వేరియంట్ కేసులు పెరూలో దాదాపు 82 శాతం

యూకేలో లాంబ్డా వేరియంట్ కేసులు ఆరు నమోదయినట్లు గా తెలుస్తుంది. పెరూలో మే మరియు జూన్ నెలల్లో నివేదించిన కరోనావైరస్ కేసు నమూనాలలో లాంబ్డా వేరియంట్ కేసులు దాదాపు 82 శాతం ఉన్నాయని పాన్ అమెరికన్ హెల్త్ ఆర్గనైజేషన్ (పాహో) ను ఉటంకిస్తూ నివేదించింది. డెల్టా వేరియంట్ కంటే 'లాంబ్డా' అనే కొత్త కోవిడ్ -19 జాతి చాలా ప్రమాదకరమని యుకె ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. గత నాలుగు వారాల్లోనే ఇది 30 కి పైగా దేశాలలో కనుగొనబడింది.

 డెల్టా కంటే డేంజరస్ అని ఆందోళన

డెల్టా కంటే డేంజరస్ అని ఆందోళన

ఈ మేరకు యూ కె ఆరోగ్య మంత్రిత్వ శాఖ ట్వీట్ చేసింది, "లాంబ్డా జాతి ప్రపంచంలో అత్యధిక మరణాల రేటు ఉన్న దేశం పెరూ నుండి ఉద్భవించిందని నివేదించబడిందని పేర్కొంది.అయితే, ఈ వేరియంట్ డెల్టా వేరియంట్ కంటే ఎక్కువ డేంజర్ కావచ్చునని పరిశోధకులు ఆందోళన చెందుతున్నారని తెలుస్తుంది.మరో దక్షిణ అమెరికా దేశమైన చిలీలో 31 శాతానికిపైగా నమూనాలలో లాంబ్డా వేరియంట్ ఉందని పేర్కొన్నారు. ఇది ప్రస్తుతం ప్రపంచ దేశాల ఆందోళనకు కారణంగా మారింది.

రోజురోజుకూ పెరుగుతున్న లాంబ్డా కేసులు

రోజురోజుకూ పెరుగుతున్న లాంబ్డా కేసులు

రోజుకో రకంగా మార్పు చెందుతున్న వైరల్ మ్యూటేషన్ లపై యూరో న్యూస్ పాన్ అమెరికన్ హెల్త్ ఆర్గనైజేషన్ యొక్క ప్రాంతీయ సలహాదారు, జైరో మెండెజ్, జూన్ 30 న లాటిన్ అమెరికా మరియు కరేబియన్ యొక్క ఎనిమిది దేశాలలో ఇది కనుగొనబడింది. ఇది మరింత సంక్రమించే వైరస్ అని ఇంకా స్పష్టమైన ఆధారాలు లేవని మెండెజ్ పేర్కొన్నారు. అంతకుముందు, ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) డెల్టా వేరియంట్‌ను ఆందోళనకర వైవిధ్యంగా పేర్కొంది. ఆ తర్వాత లాంబ్డా వేరియంట్ కేసులు వెలుగుచూస్తున్నాయి.

English summary
A new COVID-19 strain called 'Lambda' is much more dangerous than the Delta variant, said the UK Health Ministry adding that it has been detected in more than 30 countries in the past four weeks.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X