వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

షాకింగ్: రాయబారి కూతుర్ని కిడ్నాప్ చేసి -తాలిబన్లకు మద్దతుగా పాకిస్తాన్ దురాగతం -అఫ్గానిస్థాన్ గగ్గోలు

|
Google Oneindia TeluguNews

ఇటీవలి చరిత్రలో అరుదైన, షాకింగ్ సంఘటన పాకిస్థాన్ లో చోటుచేసుకుంది. పాకిస్థాన్ లో అఫ్గానిస్థాన్ రాయబారి కూతురు కిడ్నాప్ కు గురైంది. ఈ సంఘటనను సీరియస్ గా తీసుకున్న అఫ్గానిస్థాన్.. తాలిబన్లకు మద్దతుగానే పాకిస్తాన్ ఈ దురాగతానికి పూనుకుందని ఆరోపించింది. అమెరికా సేనల నిష్క్రమణ తర్వాత అఫ్గానిస్థాన్ లో పరిస్థితులు వేగంగా దిగజారిపోతుండగా, తాలిబన్లకు అన్ని రకాలుగా సహాయం చేస్తూ అఫ్గాన్ ను ఇంకాస్త దిగజార్చే పనిని పాకిస్తాన్ తలకెత్తుకున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. వివరాలివి..

పాకిస్తాన్‌లోని అఫ్గానిస్తాన్‌ రాయబారి నజీబుల్లా అలీఖీల్ కుమార్తెను కొందరు దుండగులు కిడ్నాప్ చేసి దారుణంగా హింసించారు. శుక్రవారం సాయంత్రం జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ విషయాన్ని అఫ్గాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ కూడా ధ్రువీకరించింది. ఈ అనైతిక సంఘటన పాకిస్తాన్, అఫ్గానిస్థాన్ ల మధ్య ఉద్రిక్తతను సృష్టించింది.

daughter-of-afghanistan-s-envoy-abducted-tortured-in-pakistan-imran-backs-taliban

ఇస్లామాబాద్ లో ఉంటోన్న అఫ్గానిస్థాన్ రాయబారి నజీబుల్లా అలీఖీల్‌ కూతురు సిల్‌సిలా అలీఖీల్‌ (26) శుక్రవారం సాయంత్రం స్థానిక జిన్నా సూపర్‌ మార్కెట్‌ నుంచి ఇంటికి తిరిగి వస్తుండగా కొందరు యువకులు అడ్డుకుని కిడ్నాప్‌ చేశారు. అనంతరం ఆమెను దారుణంగా హింసించినట్లు సమాచారం. దుండగుల బారి నుంచి బయటపడి ఇంటికి వచ్చిన సిల్‌సిలాను స్థానిక దవాఖానలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. ఈ విషయాన్ని అఫ్గాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది.

పొరుగుదేశంలో తమ రాయబారి కూతురు కిడ్నాప్ కు గురికావడంతో అఫ్గాన్ ప్రభుత్వం.. పాకిస్తాన్‌లో తమ రాయబార కార్యాలయం అధికారులకు, వారి కుటుంబాలకు రక్షణ కొరవడిందని విచారం వ్యక్తం చేసింది. ఈ మేరకు అఫ్గాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ శనివారం ఒక ప్రకటన విడుదల చేసింది. అంతర్జాతీయ ఒప్పందాలు, కట్టుబాట్లకు అనుగుణంగా, అఫ్గాన్ దౌత్యవేత్తలు, వారి కుటుంబాలకు పూర్తి భద్రతను కల్పించేందుకు అవసరమైన తక్షణ చర్యలు తీసుకోవాలని పాకిస్తాన్ ప్రభుత్వాన్ని కోరింది. నేరస్థులను వీలైనంత త్వరగా గుర్తించి విచారించి కఠిన చర్యలు తీసుకోవాలని అభ్యర్థించింది. కాగా,

జగన్ ఆదేశం, మోదీ శాసనం -బెయిల్ రద్దు తథ్యం -లక్ష్మీపార్వతి జూదం -కేసీఆర్‌ జగడం: రఘురామ సంచలనంజగన్ ఆదేశం, మోదీ శాసనం -బెయిల్ రద్దు తథ్యం -లక్ష్మీపార్వతి జూదం -కేసీఆర్‌ జగడం: రఘురామ సంచలనం

Recommended Video

India - China : అంతర్జాతీయ వేదికపై నవ్వులపాలైన China.. చైనాపై భారత్ ఘన విజయం!! || Oneindia Telugu

అమెరికా సైన్యాలు పూర్తిగా నిష్క్రమించిన తర్వాతి నిమిషం నుంచే తాలిబన్ సేనలు పేట్రేగుతూ ఒక్కొక్కటిగా అఫ్గానిస్థాన్ లోని ప్రాంతాలను ఆక్రమించుకుంటూ వెళుతున్నారు. ముందుగా పాకిస్తాన్ సరిహద్దులోని కాందహార్ ప్రాంతం తాలిబన్ల చేతుల్లోకి వెళ్ళింది. ఇప్పటికే తాలిబన్లు పాక్ సరిహద్దును మూసేశారు. పాకిస్తాన్ సైన్యం నుంచి ఆయుధ సహాయం, వాయు సేనల సహాయం తాలిబన్లకు అందుతున్నదని అఫ్గాన్ మంత్రులు ఆరోపిస్తున్నారు.

English summary
The daughter of Afghanistan’s ambassador to Pakistan Najibullah Alikhil was briefly abducted and tortured before she was released, the Afghan foreign ministry said on Saturday. “The daughter of the Afghan ambassador to Islamabad Ms. Silsila Alikhil, was abducted for several hours and severely tortured by unknown individuals on her way home,” the Afghan foreign ministry said in a statement. The incident happened on July 16.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X