రివర్స్ మైగ్రేషన్ ప్రకటించిన ట్రంప్- భారీ షాక్: ఇక వారికి అమెరికాలో నో ఎంట్రీ
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వలస విధానంలో కఠిన మార్పులను ప్రకటించారు. దేశీయ వ్యవస్థలను పునర్నిర్మించడం, అనధికార వలసలను అరికట్టడం, విదేశీయులపై నిఘాను కఠినతరం చేయడం వంటి విస్తృత లక్ష్యాలలో భాగంగా ఈ నిర్ణయాలను తీసుకున్నారు. 'మూడవ ప్రపంచ దేశాల' నుండి వలసలను శాశ్వతంగా నిలిపివేయడానికి కృషి చేస్తానని తెలిపారు. వాషింగ్టన్ డీసీలో వైట్‌హౌస్ సమీపంలో ఇద్దరు నేషనల్ గార్డులపై ఆఫ్ఘన్ జాతీయుడి కాల్పుల అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నారు.
అమెరికా పౌరులందరికీ థాంక్స్ గివింగ్ శుభాకాంక్షలు అంటూ సుదీర్ఘ ట్వీట్ పెట్టారు. మూడో ప్రపంచ దేశాల నుండి వలసలను శాశ్వతంగా నిలిపివేస్తానని డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. అమెరికా పూర్తిగా కోలుకోవడానికి ఇది అత్యవసరమని అన్నారు. జో బైడెన్ జారీ చేసిన మిలియన్ల కొద్దీ అక్రమ అనుమతులను రద్దు చేస్తానని తెలిపారు. దీనికంతటికి గత ప్రభుత్వమే కారణమని వ్యాఖ్యానించారు. బైడెన్ ప్రభుత్వాన్ని స్లీపీ ఆటో పెన్..గా అభివర్ణించారు. అమెరికాను ప్రేమించలేని ఎవరినైనా తొలగిస్తానని ట్రూత్ సోషల్‌లో పోస్ట్ చేశారు.

గ్రీన్ కార్డ్ ఉన్న ఒక వలసదారు 30,000 డాలర్లు సంపాదిస్తుంటే, అతని కుటుంబానికి సంవత్సరానికి సుమారు 50,000 డాలర్ల విలువ చేసే ప్రయోజనాలు లభిస్తున్నాయని ట్రంప్ తెలిపారు. వాస్తవ వలసదారుల సంఖ్య దీని కంటే చాలా ఎక్కువగా పేర్కొన్నారు. ఈ శరణార్థుల భారం అమెరికాలో సామాజిక అస్తవ్యస్తతకు ప్రధాన కారణమని, రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఇలాంటి పరిస్థితి లేదని పేర్కొన్నారు. అధిక నేరాలు, పట్టణ జనాభాలో క్షీణత, దిగజారిన పాఠశాలలు, ఆసుపత్రు్లో రద్దీ, గృహాల కొరత, భారీ లోటు బడ్జెట్ వంటివి దీనికి నిదర్శనమని చెప్పారు.
ఒకప్పుడు గొప్ప రాష్ట్రంగా వెలుగొందిన మిన్నెసోటాను సోమాలియా నుండి వచ్చిన లక్షలాది శరణార్థులు పూర్తిగా స్వాధీనం చేసుకున్నారని డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. సోమాలియన్ ముఠాలు వీధుల్లో తిరుగుతూ ఇక్కడి వారిని ఎరగా చూస్తోన్నారని, మిన్నెసొటా ప్రజలు ఇళ్లలో భయంతో జీవిస్తున్నారని అన్నారు.
నాన్ అమెరికన్ సిటిజన్స్ కు ఇప్పటవరకు అందుతున్న ప్రయోజనాలు, సబ్సిడీలను రద్దు చేస్తానని, శాంతియుత వాతావరణానికి భంగం కలిగించే వలసదారుల పౌరసత్వాన్ని రద్దు చేసి, ప్రజా భారంగా మారిన, భద్రతకు ప్రమాదకరంగా ఉన్న లేదా పాశ్చాత్య నాగరికతకు సరిపోని ఏ విదేశీయుడిని అయినా బహిష్కరిస్తానని డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. అలాంటి వారికి అమెరికాలో నివసించే అధికారం లేదని తేల్చి చెప్పారు.
ఆఫ్రికా, ఆసియా, లాటిన్ అమెరికా, ఓషియానియాలోని కొన్ని ప్రాంతాల్లో ఉన్న తక్కువ, మధ్య ఆదాయ అభివృద్ధి చెందుతున్న దేశాలను మూడో ప్రపంచ దేశాలుగా నిలుస్తారు. ఆయా దేశాల శరణార్థుల భారాన్ని అమెరికన్లు మోస్తోన్నారని, అది సామాజిక అసాధారణత్వానికి ప్రధాన కారణమని ట్రంప్ వ్యాఖ్యానించారు. సాంకేతికంగా పురోగమిస్తున్నప్పటికీ, వలస విధానం ఆ లాభాలను, చాలా మంది జీవన పరిస్థితులను క్షీణింపజేసిందని పేర్కొన్నారు. రివర్స్ మైగ్రేషన్ మాత్రమే ఈ పరిస్థితిని పూర్తిగా నయం చేయగలదని తేల్చారు.
-
సైలెంట్ కిల్లర్స్: ఇరాన్ సామ్రాజ్యాన్ని కుప్పకూల్చిన ఇజ్రాయెల్ 'యూనిట్ 8200'!! -
నో హార్ముజ్, నో డీల్..! ఒట్టి చేతులతో ఇరాన్ వీడనున్న ట్రంప్..! -
అడకత్తెరలో ట్రంప్- ప్రజల ముందుకు -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!!












Click it and Unblock the Notifications