భారత్‌కు ట్రంప్ బంపర్ ఆఫర్!
డొనాల్డ్ ట్రంప్ నేతృత్వంలోని అమెరికా సర్కారు భారత్‌పై ఓ వైపు టారిఫ్ హెచ్చరికలు చేస్తూనే.. మరోవైపు ఇంధన రంగంలో భారీ ఊరటనిచ్చే కీలక ప్రకటన చేసింది. వెనిజులా నుంచి భారత్ చమురు కొనుగోలు చేయడానికి అమెరికా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఎట్టకేలకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత్‌కు సంబంధించి ఓ సంచలన నిర్ణయం తీసుకున్నారు. వెనిజులాపై ఉన్న ఆంక్షల కారణంగా నిలిచిపోయిన చమురు దిగుమతులను భారత్ తిరిగి ప్రారంభించేందుకు అనుమతి ఇస్తున్నట్లు వైట్ హౌస్ ప్రకటించింది. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నందుకు భారత్ పై 500 శాతం టారిఫ్ విధిస్తామని ఒకరోజు ముందే హెచ్చరించిన ట్రంప్.. ఇప్పుడు వెనిజులా చమురు విషయంలో సానుకూల నిర్ణయం తీసుకోవడం గమనార్హం. వెనిజులా చమురుకు భారత్ ఒకప్పుడు అతిపెద్ద మార్కెట్ గా ఉండేది. ఇప్పుడు ఈ నిర్ణయంతో తిరిగి ఆ పాత సంబంధాలు చిగురించనున్నాయి.
అమెరికా పెట్టిన నిబంధనలు ఏమిటి?
అయితే వెనిజులా చమురు విక్రయాల విషయంలో అమెరికా కఠినమైన షరతులను విధించింది. అమెరికా ఇంధన శాఖ మంత్రి క్రిస్టోఫర్ రైట్ తెలిపిన వివరాల ప్రకారం.. వెనిజులా నుండి చమురు విక్రయాలు పూర్తిగా అమెరికా ప్రభుత్వం పర్యవేక్షణలోనే జరుగుతాయి. చమురు అమ్మకం ద్వారా వచ్చే ఆదాయం మొత్తం అమెరికా నియంత్రణలో ఉన్న బ్యాంకు ఖాతాల్లోనే జమ అవుతుంది. ఆ నిధులను వెనిజులాలోని అవినీతి పరులకు లేదా పాత పాలకులకు అందకుండా, కేవలం అక్కడి ప్రజల సంక్షేమం కోసం మాత్రమే ఖర్చు చేసేలా అమెరికా జాగ్రత్తలు తీసుకోనుంది.

ప్రపంచ మార్కెట్లో వెనిజులా క్రూడాయిల్ క్రేజ్
వెనిజులాలో ప్రపంచంలోనే అత్యధిక చమురు నిల్వలు ఉన్నాయి. అమెరికా రిఫైనరీలతో పాటు యూరోప్, ఆసియా దేశాలకు కూడా వెనిజులా ముడి చమురు అవసరం చాలా ఉంది. ముఖ్యంగా భారత్‌లో ఉన్న భారీ రిఫైనరీలు వెనిజులాకు చెందిన 'హెవీ క్రూడ్ ఆయిల్'ను శుద్ధి చేయడానికి అనుకూలంగా రూపొందించబడ్డాయి. ఇప్పుడు అమెరికా తీసుకున్న ఈ నిర్ణయం వల్ల వెనిజులా చమురు అంతర్జాతీయ మార్కెట్లోకి విరివిగా అందుబాటులోకి రానుంది. ఇది అంతర్జాతీయంగా చమురు ధరలు తగ్గడానికి కూడా దోహదపడవచ్చు.
భారత వ్యూహాత్మక ప్రయోజనం
రష్యా నుంచి చమురు దిగుమతుల విషయంలో అమెరికా ఒత్తిడి పెరుగుతున్న వేళ.. వెనిజులా రూపంలో భారత్‌కు మరో ప్రత్యామ్నాయం దొరికినట్లయింది. భారత్ తన ఇంధన అవసరాల కోసం వివిధ దేశాలపై ఆధారపడుతోంది. వెనిజులా నుంచి చమురు దిగుమతులు మళ్లీ ప్రారంభమైతే, భారత్ తన ఇంధన భద్రతను మరింత పటిష్టం చేసుకోవడమే కాకుండా, ఇతర దేశాలతో బేరసారాలు ఆడే సామర్థ్యాన్ని కూడా పెంచుకుంటుంది. ఈ పరిణామం భారత ఆర్థిక వ్యవస్థపై సానుకూల ప్రభావం చూపే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు.
-
హార్ముజ్ సంగతి తర్వాత-యుద్దం ముగించేద్దాం..! ట్రంప్ మరో షాక్ ..! -
అగ్నికి ఆజ్యం పోసిన ట్రంప్- క్రూడ్ రేట్లు జంప్ -
నో హార్ముజ్, నో డీల్..! ఒట్టి చేతులతో ఇరాన్ వీడనున్న ట్రంప్..! -
మైక్రోసాఫ్ట్, గూగుల్, ఆపిల్ సంస్థల్ని బూడిద చేస్తాం: అమెరికాకు ఇరాన్ స్ట్రాంగ్ వార్నింగ్.. -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
మళ్లీ మొదలెట్టావా పాప.. ప్రెగ్నెన్సీ నిజమేనా? -
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
విజయ్ దేవరకొండపై ఆ స్టార్ హీరో భార్య సీక్రెట్ లవ్.. పెళ్లయినా ఆగని..! -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం












Click it and Unblock the Notifications