వెనిజులాకు అండగా మస్క్ సంచలనం నిర్ణయం.. ట్రంప్ కు బిగ్ షాక్..!
అమెరికా సైన్యం జరిపిన వైమానిక దాడుల్లో వెనిజులా విలవిల్లాడిన విషయం తెలిసిందే. వెనిజులా రాజధాని కరాకస్ పరిసర ప్రాంతాల్లోని ఏడు చోట్ల భారీ పేలుళ్లు జరిపింది. ఆ దేశ అధ్యక్షుడు నికోలస్ మదురో, అతని భార్య సిలియా ఫ్లోర్స్ ను కస్టడీలోకి తీసుకుంది అమెరికా సైన్యం. అమెరికాకు చెందిన డెల్టా ఫోర్స్ ఈ ఆపరేషన్ చేపట్టింది. ఈ క్రమంలో అమెరికా భీకర దాడులతో వెనిజులా అట్టుడికిపోయింది. విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. రవాణా అస్తవ్యస్తం అయింది. భయాందోళనతో ప్రజలు వీధుల్లో గడుపుతున్నారు.
అయితే ఇబ్బందుల్లో ఉన్న వెనిజులా ప్రజలకు ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ గుడ్ న్యూస్ చెప్పారు. వెనిజులా ప్రజలకు ఉచితంగా ఇంటర్నెట్ సదుపాయాన్ని కల్పించనున్నట్లు వెల్లడించారు. వెనిజులాలో ఫిబ్రవరి 3 నుంచి ఉచితంగా ప్రజలకు ఇంటర్నెట్ సేవలను అందించనున్నట్లు ఎలాన్ మస్క్ కు చెందిన స్టార్ లింక్ ఇంటర్నెట్ ప్రొవైడర్ సంస్థ పేర్కొంది.

ప్రస్తుతం వెనిజులాలో సంక్షోభం నడుస్తున్న నేపథ్యంలో ఈ సమయంలో ప్రజలకు మద్దతుగా నిలిచి వారి ఇబ్బందులను తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేసింది. ఈ మేరకు ఈ నిర్ణయానికి సంబంధించిన వివరాలను ఎలాన్ మస్క్ తన ఎక్స్ ఖాతా ద్వారా పంచుకున్నారు. వెనిజులా ప్రజలకు సాయం చేసేందుకు తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు మస్క్ స్పష్టం చేశారు. ఫిబ్రవరి 3 నుంచి వెనిజులాలో స్టార్ లింక్ ఉచిత ఇంటర్నెట్ సేవలు ప్రారంభం అవుతాయని పేర్కొన్నారు.
జనవరి 3 న వెనిజులాపై అమెరికా సైన్యం ఆపరేషన్ అబ్సల్యూట్ రిజాల్వ్ చేపట్టిన విషయం తెలిసిందే. అమెరికా వైమానిక దళాలు వెనిజులా రాజధాని కరాకస్ లోని ఏడు ప్రాంతాల్లో దాడులు చేపట్టాయి. ఉత్తర వెనిజులాలోని మిలిటరీ ప్రాంతాలే లక్ష్యంగా దాడులు నిర్వహించింది. వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురో, అతని భార్య సిలియా ఫ్లోర్స్ ను కస్టడీలోకి తీసుకుంది అమెరికా సైన్యం. అక్కడి నుంచి న్యూ యార్క్ కు తరలించింది.
In support of the people of Venezuela 🇻🇪 https://t.co/JKxOFWsikP
— Elon Musk (@elonmusk) January 4, 2026
వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురో నార్కో టెర్రరిజం, డ్రగ్ ట్రాఫికింగ్ చేస్తున్నారని ట్రంప్ సర్కార్ కొన్నేళ్లుగా ఆరోపణలు చేస్తోంది. ఈ క్రమంలోనే వెనీజులాపై అమెరికా దాడులకు పాల్పడింది. మరోవైపు నికోలస్ మదురోపై నార్కో-టెర్రరిజం కేసు పెట్టినట్లు యూఎస్ అటార్నీ జనరల్ పమేలా బోండి తెలిపారు. ఆయనపై అమెరికా చట్టాల ప్రకారం విచారణ జరిపిస్తామని స్పష్టం చేశారు.
ఇక వెనిజులా అధ్యక్షుడు నికోలాస్ మదురోను అమెరికా సైన్యం బంధించడంపై వెనిజులా ప్రతిపక్ష నేత, నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మచాడో సంచలన ప్రకటన చేశారు. సోషల్ మీడియా వేదికగా ఆమె స్పందించారు. వెనిజులా ప్రజలు స్వేచ్ఛలోకి అడుగుపెట్టబోతున్నారని తెలిపారు. మదురోపై ఇంటర్నేషనల్ చట్టం అమలు అవుతుందని అన్నారు. వెనిజులాలో ప్రజాస్వామ్యం కోసం ఏళ్ల తరబడి సాగిన పోరాటం ఇప్పుడు కీలక మలుపు తిరిగిందని తెలిపారు.
-
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
పవన్ కళ్యాణ్‌ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు -
IPL తొలి మ్యాచ్ లోనే సెన్సేషన్, ఎవరీ కూపర్ కనోలీ - సూర్యవంశీని డామినేట్ చేస్తూ..!! -
పాల ధరలు భారీగా పెంపు, ఒకే సారి - కొత్త రేట్లు ఇలా..!! -
రైతు భరోసా అమలులో కీలక మార్పులు, ఇక వారికీ వర్తింపు - నిధుల జమ ముహూర్తం..!! -
Amaravati Bill: పార్లమెంట్ లో అమరావతి బిల్లు..! కాంగ్రెస్ స్టాండ్ ఇదే..! -
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ -
జన్మ నక్షత్రం మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
ఈ టైంలో కరెంట్ వాడితే బాదుడే, విద్యుత్ ఛార్జీల్లో మార్పులు - నేటి నుంచే అమలు..!! -
అయోధ్య రాముని సన్నిధిలో గౌతమ్ అదానీ..! -
రైలు బయల్దేరే ముందు ఎక్కే స్టేషన్ మార్పు..! రైల్వే కొత్త రూల్..!











Click it and Unblock the Notifications