అప్పటి వరకూ పాకిస్థాన్ కు నో వాటర్: భారత్ సంచలనం
సింధూ జలాల ఒప్పందంపై పాకిస్థాన్ కు భారత్ మరోసారి భారీ షాక్ ఇచ్చింది. పాకిస్థాన్ ఉగ్రవాదాన్ని విడిచిపెట్టేంత వరకూ ఆ దేశంపై సింధు జలాల ఒప్పందాన్ని నిలిపి వేస్తున్నట్లు స్పష్టం చేసింది. ఈ మేరకు ఐక్యరాజ్యసమితిలో భారత్ శాశ్వత ప్రతినిధి హరీష్ పేర్కొన్నారు. ఉగ్రవాదానికి కేంద్ర బిందువుగా పాకిస్థాన్ మారిందని అన్నారు. ఇక జమ్మూకాశ్మీర్ లోని పహల్గామ్ లో గతేడాది ఏప్రిల్ 22న జరిగిన ఉగ్రవాదుల దాడిలో 26 మంది భారతీయులు మరణించిన నేపథ్యంలో భారత్- పాకిస్థాన్ మధ్య ఉన్న ఈ ఒప్పందాన్ని భారత్ నిలిపివేసిన విషయం తెలిసిందే.
ఉగ్రవాదాన్ని పెంచి పోషించినంత కాలం పాకిస్థాన్ పై విధించిన సింధు జలాల ఒప్పందం నిలిపివేత కొనసాగుతుందని భారత్ మరోసారి స్పష్టం చేసింది. ఈ మేరకు యూఎన్ లో భారత్ శాశ్వత అధికార ప్రతినిధి హరీష్ తెలిపారు. ప్రపంచ నీటి దినోత్సవం సందర్భంగా ఐక్యరాజ్యసమితిలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. 'జల్ జీవన్ మిషన్' ద్వారా ప్రజలందరికీ సురక్షితమైన తాగునీటిని అందించడంలో భారత్ పురోగతి సాధిస్తోందని పేర్కొన్నారు.
అలాగే ప్రస్తుతం మారుతున్న సాంకేతిక, పర్యావరణ పరిస్థితులకు అనుగుణంగా ఒప్పందంలో మార్పులు చేద్దామని భారత్ చేసిన ప్రతిపాదనను పాకిస్థాన్ తిరస్కరించినట్లు హరీష్ వెల్లడించారు. ప్రపంచానికి ఉగ్రవాద కేంద్రంగా పాకిస్థాన్ మారిందని ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. 1960 లో భారత్ సింధూ జలాల ఒప్పందంపై చిత్తశుద్ధితో సంతకం చేసిందని.. కానీ కాలానుగుణంగా పాకిస్థాన్ యుద్ధాలు, ఉగ్రదాడుల ద్వారా ఆ నమ్మకాన్ని కోల్పోయిందని హరీష్ పేర్కొన్నారు.
ఇక గతేడాది ఏప్రిల్ 22 న పహల్గామ్ లో పాకిస్థాన్ కు చెందిన నలుగురు ఉగ్రమూకలు జరిపిన దాడుల్లో 26 మంది అమాయక టూరిస్టులు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ దాడికి అయితే ఈ దాడికి పాల్పడింది పాకిస్థాన్ అని తేలిన నేపథ్యంలో మే 7-10 మధ్య పాకిస్థాన్ లోని 9 కీలక స్థావరాలపై భారత్ దాడులకు పాల్పడింది. వాటిని ధ్వంసం చేసింది. వందలాది మంది టెర్రరిస్టులను హతమార్చింది.

పాకిస్థాన్ లో ధ్వంసం అయిన స్థావరాల్లో ముజఫరాబాద్ లోని సవాయ్ నాలా క్యాంప్, సిడ్నా బిలాల్ క్యాంప్, కోట్లీలోని గుల్ పూర్ క్యాంప్, అబ్బాస్ క్యాంప్, భీంబర్ లోని బర్నాలా క్యాంప్, సియాల్ కోట్ లోని సర్జాల్ క్యాంప్, మెహమూనా జోయా క్యాంప్, మురిడ్ కే లోని మార్కాజ్ టైబా క్యాంప్, బహావల్ పుర్ లోని మార్కజ్ సుభానల్లా క్యాంప్ లు ఉన్నాయి.
-
వి ఆర్ రెడీ: పాకిస్థాన్ సంచలన ప్రకటన -
కొబ్బరి నీళ్లు Vs మజ్జిగ - రెండింటిలో వేసవిలో ఏది బెస్ట్..!! -
జైపూర్ ఏనుగుకు గులాబీ రంగు పూసిన రష్యన్.. జైలుకు వెళ్లక తప్పదా ??? -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
ఏపీ, తెలంగాణలో రెండు కొత్త ఎయిర్‌పోర్ట్‌లకు గ్రీన్ సిగ్నల్ - ఈ ప్రాంతాల్లోనే..!! -
PDS Kerosene: మళ్లీ రేషన్ షాపుల్లో కిరోసిన్-కేంద్రం అత్యవసర ఆదేశాలు..! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్ -
విజయ్ పార్టీకి త్రిష శాపం? రెండు చోట్ల ఓటమి ఖాయం!












Click it and Unblock the Notifications