బట్టలు లేకుండా కొత్త ఏడాది వేడుకలు.. ఎక్కడంటే ??
సాధారణంగా కొత్త ఏడాది వేడుకలంటే రంగురంగుల దుస్తులు, బాణసంచా సందడి కనిపిస్తుంది. కానీ బర్మింగ్‌హామ్‌లోని ఎర్డింగ్టన్ ప్రాంతంలో ఉన్న క్లోవర్ స్పా దీనికి భిన్నంగా ఆలోచించింది. ఇది బ్రిటన్‌లోనే అత్యంత అరుదైన మరియు ప్రసిద్ధ నేచురిస్ట్ హోటల్‌గా పేరుగాంచింది. డిసెంబర్ 31 రాత్రి అతిథులు ఎటువంటి దుస్తులు ధరించకుండానే 2026కి స్వాగతం పలికేలా 'న్యూడ్ పార్టీ'ని నిర్వహిస్తోంది. దీంతో ఈ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది.
కాగా హోటల్ యజమాని టిమ్ హిగ్స్ ఆధ్వర్యంలో ఈ వేడుకలు అత్యంత వైభవంగా జరగనున్నాయి. పార్టీలో అదిరిపోయే డీజే సంగీతం, నృత్యాలు, రుచికరమైన విందు భోజనం ఉండనున్నాయి. ముఖ్యంగా అర్ధరాత్రి కౌంట్‌డౌన్ ముగిసిన తర్వాత సాంప్రదాయ 'ఆల్డ్ లాంగ్ సైన్' (Auld Lang Syne) పాటను పాడటం ఈ వేడుకలో ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. అతిథుల కోసం స్టీమ్ రూమ్, సౌనా వంటి స్పా సౌకర్యాలతో పాటు 20 మంది ఒకేసారి ఆస్వాదించగలిగే భారీ 'హాట్ టబ్'ను కూడా సిద్ధం చేశారు.

కఠినమైన నిబంధనలు..
అయితే ఈ వేడుక కేవలం సామాజిక, స్నేహపూర్వక వాతావరణంలో జరిగే ప్రకృతి సిద్ధమైన కలయిక అని యాజమాన్యం స్పష్టం చేసింది. 18 ఏళ్లు నిండిన వారు మాత్రమే ఈ పార్టీకి అర్హులని.. ముఖ్యంగా ఇది కేవలం నేచురిజం (ప్రకృతికి దగ్గరగా ఉండటం) మాత్రమేనని వెల్లడించింది. ఎటువంటి లైంగిక కార్యకలాపాలకు ఇక్కడ అనుమతి ఉండదని హెచ్చరించారు. ఎవరైనా అనుచితంగా ప్రవర్తిస్తే వారిని వెంటనే హోటల్ నుంచి పంపించి వేసేలా కఠిన నిబంధనలు అమలు చేస్తామన్నారు.
బుకింగ్ & ధరల వివరాలు..
ఈ వినూత్న అనుభవాన్ని పొందాలనుకునే వారు ముందుగానే తమ పేర్లను నమోదు చేసుకోవాలి. సాధారణ స్పా డే బుకింగ్ ధరతో పాటు అదనంగా £15 (దాదాపు ₹1,800) చెల్లించి ఈ న్యూ ఇయర్ పార్టీలో పాలుపంచుకోవచ్చు. పాత సంవత్సరానికి వీడ్కోలు పలికి, కొత్త ఏడాదిని స్వేచ్ఛగా ఆహ్వానించాలనుకునే నేచురిస్టుల కోసం ఈ హోటల్ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.
యజమాని టిమ్ హిగ్స్ మాట్లాడుతూ.. నేచురిజం అంటే స్వేచ్ఛ, ఆరోగ్యం, ప్రకృతితో మమేకమవ్వడం అని తెలిపారు. దుస్తులు అనే సామాజిక ఆటంకాలు లేనప్పుడు మనుషుల మధ్య సమానత్వం పెరుగుతుందని స్పష్టం చేశారు.
-
ఏపీ, తెలంగాణలో రెండు కొత్త ఎయిర్‌పోర్ట్‌లకు గ్రీన్ సిగ్నల్ - ఈ ప్రాంతాల్లోనే..!! -
PDS Kerosene: మళ్లీ రేషన్ షాపుల్లో కిరోసిన్-కేంద్రం అత్యవసర ఆదేశాలు..! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్ -
విజయ్ పార్టీకి త్రిష శాపం? రెండు చోట్ల ఓటమి ఖాయం! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
కొత్త పెన్షన్ల పై ప్రభుత్వం కీలక నిర్ణయం: పంపిణీ ముహూర్తం, మార్గదర్శకాలు..!! -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
రూట్ మార్చిన ఫరియా.. ఊర మాస్ పాత్రలో హిట్ కొట్టేనా ?? -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- నేడు ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు -
రూపాయి సేఫ్: ఒక్కరోజే భారీ లాభం!












Click it and Unblock the Notifications