• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వీడియో: గ్రహశకలం దిశను మార్చి - అంతరిక్షంలో హాలీవుడ్ సినిమా చూపించిన నాసా

|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: భూమిపైకి దూసుకొచ్చిన గ్రహశకలాన్ని నాసా ఏ రకంగా ధ్వంసం చేస్తుందనే కథాంశంతో రూపొందించిన హాలీవుడ్ మూవీ- ఆర్మగెడాన్. బ్రూస్ విల్లీస్ హీరో. 1998లో వచ్చిన ఈ మూవీని నాసా ఇప్పుడు నిజం చేసింది. భూమిపైకి దూసుకొస్తోన్న ఓ గ్రహశకలం - డైమోర్ఫస్‌ను నాసా ప్రయోగించిన డార్ట్‌ స్పేస్‌క్రాఫ్ట్ ఢీ కొట్టింది. దాని దిశను మార్చివేసింది. దీనికి సంబంధించిన ఓ వీడియోను నాసా తన విడుదల చేసింది.

1,260 పౌండ్ల బరువు..

1,260-పౌండ్ల బరువు ఉన్న డబుల్ ఆస్టరాయిడ్ రీ-డైరెక్షన్ టెస్ట్ (డార్ట్) స్పేస్‌క్రాఫ్ట్ ఈ తెల్లవారు జామున 4:40 నిమిషాలకు ఆ గ్రహశకలాన్ని ఢీ కొట్టింది. భూ ఉపరితలం నుంచి ఏడు మిలియన్ మైళ్ల దూరంలో ఈ ఘటన చోటు చేసుకుంది. గంటకు 14,000 మైళ్ల వేగంతో ఆ స్పేస్‌క్రాఫ్ట్ డైమోర్ఫస్ అస్టరాయిడ్‌ను ఢీకొట్టింది. ఈ గ్రహశకలం బరువు 11 బిలియన్ పౌండ్లు. 520 అడుగుల పొడవు ఉండే ఈ అస్టరాయిడ్ సెంటర్ పాయింట్‌కు దాదాపు 55 అడుగుల దూరంలో గల ప్రాంతాన్ని నాసా డార్ట్ స్పేస్ క్రాఫ్ట్ ఢీకొట్టింది.

ప్రయోగం.. సక్సెస్


ఈ మిషన్‌ మొత్తాన్నీ కెమెరాలో బంధించింది నాసా. దీనికోసం ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసింది. ఫొటోలు తీయడానికి అంతరిక్ష నౌకకు షూబాక్స్ సైజులో కెమెరాను అమర్చింది. ఈ ప్రయోగం విజయవంతమైనట్లు నాసా ప్రకటించింది. తాము ఇంతకు ముందు ఎప్పుడూ లేవివిధంగా చిన్న గ్రహశకలాన్ని ఢీకొట్టడానికి చేసిన ప్రయోగం సక్సెస్ అయిందని వెల్లడించింది. అంతులేని విశ్వంలో వేలకిలోమీటర్ల వేగంతో తిరుగాడే ఓ చిన్న గ్రహశకలాన్ని ఢీకొట్టాలనుకోవడం సంక్లిష్టమే అయినప్పటికీ.. దాన్ని సాధించామని నాసా పేర్కొంది.

10 నెలల ప్రయాణం..

గ్రహశకలం నిర్దేశిత స్థానంలో ఢీ కొట్టడం కష్టతరమైనప్పటికీ- ఆ లక్ష్యాన్ని అందుకోవడం ఆనందంగా ఉందని జాన్స్ హాప్కిన్స్ విశ్వవిద్యాలయం ప్లానెటరీ శాస్త్రవేత్త, డార్ట్ స్పేస్‌క్రాఫ్ట్ మిషన్ టీమ్ లీడర్ న్యాన్సీ చాబోట్ చెప్పారు. గ్రహశకలం భూమి వైపు దూసుకొస్తోందనే విషయాన్ని నాసా ఇదివరకే పసిగట్టింది. ఆ తరువాత ఈ డార్ట్ మిషన్‌ చేపట్టింది. 10 నెలల సుదీర్ఘ ప్రయాణం అనంతరం ఈ స్పేస్ క్రాఫ్ట్ తన లక్ష్యాన్ని ఛేదించింది.

325 మిలియన్ డాలర్లతో..

ఈ ప్రాజెక్ట్ కోసం నాసా 325 మిలియన్ డాలర్లను ఖర్చు చేసింది. దీన్ని ఢీ కొట్టడం ద్వారా డైమోర్ఫస్‌ను 65803 డిడిమోస్ అనే మరో భారీ గ్రహశకలం కక్ష్యలోకి దీన్ని తీసుకెళ్తుంది. ఫలితంగా అది డిడిమోస్ కక్ష్యలోనే సంచరిస్తుంటుంది. భవిష్యత్తులో కూడా భూమికి డైమోర్ఫస్ నుంచి ఎలాంటి ముప్పు ఉండదు. ఈ మిషన్‌ ద్వారా కొన్ని కొత్త ఆవిష్కరణలను కనుగొన్నట్లు నాసా పేర్కొంది. భవిష్యత్‌లో భూమి వైపునకు దూసుకొచ్చే గ్రహశకలాల దిశను మార్చడానికి ఈ ప్రయోగం శ్రీకారం చుట్టినట్లు తెలిపింది.

అస్టరాయిడ్ల నుంచి


అస్టరాయిడ్ల నుంచి భూమిని ఎలా రక్షించుకోవాలనే విషయంపై స్పష్టత వచ్చిందని నాసా అడ్మినిస్ట్రేటర్ బిల్ నెల్సన్ అన్నారు. అస్టరాయిడ్ల దాడి నుంచి భూమిని రక్షించుకోవడం ఇక సాధ్యమేనని చెప్పారు. డార్ట్ స్పేస్ క్రాఫ్ట్ డైమోర్ఫస్ అస్టరాయిడ్‌ను ఢీ కొట్టినప్పుడు వెలువడిన శక్తి, ఇతర ప్రభావాల గురించి ఇంకా పూర్తి సమాచారం అందాల్సి ఉందని, దీనికోసం కొన్ని వారాలు లేదా నెలలు పట్టొచ్చని మిషన్ సిస్టమ్స్ ఇంజినీర్ ఎలెనా ఆడమ్స్ అన్నారు.

 డిడిమోస్ కక్ష్యలో..

డిడిమోస్ కక్ష్యలో..

రెండు నెలల్లోగా దీనికి సంబంధించిన పూర్తి సమాచారం అందుబాటులోకి రావొచ్చని చెప్పారు. గ్రహశకలాన్ని నాశనం చేయాలనేది తమ లక్ష్యం కాదని, డైమోర్ఫస్‌ను డిడిమోస్ చుట్టూ, దాని కక్ష్యలోకి ప్రవేశపెట్టాలని మొదటే నిర్ణయించుకున్నామని అన్నారు. ఈ ప్రయోగం వల్ల డైమార్ఫస్, డిడిమోస్ గ్రహశకలాల కక్ష్య వేగం మారిందని చెప్పారు. డిడిమోస్ ఒక కక్ష్యను 11 గంటల 55 నిమిషాలలో పూర్తి చేస్తుండేదని, స్పేస్ క్రాఫ్ట్ ఢీ కొట్టిన తాకిడికి దాని కక్ష్యను 10 నిమిషాలు తగ్గిస్తుందని అంచనా వేస్తోన్నట్లు పేర్కొన్నారు.

English summary
NASA successfully crashed a spacecraft into an asteroid, marking a win for the agency's plan for when a devastating asteroid should ever threaten humanity.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X