"ఉంగిలి చూపిస్తే పిడికిలితో కొడతాం": పాక్‌కు ఆఫ్ఘన్ ఆర్మీ చీఫ్ మాస్ వార్నింగ్!
పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్ మధ్య సరిహద్దు వివాదం ఇప్పుడు పూర్తి స్థాయి యుద్ధంగా మారుతోంది. రెండో రోజుకు చేరుకున్న ఈ పోరులో ఇరుదేశాలు భారీగా ప్రాణ, ఆస్తి నష్టాన్ని చవిచూస్తున్నాయి. తాజాగా ఆఫ్ఘన్ ఆర్మీ చీఫ్ ఫసీహుద్దీన్ ఫిత్రత్ పాకిస్థాన్‌కు మాస్ వార్నింగ్ ఇచ్చారు.
12 మంది సైనికులు మృతి.. అంగీకరించిన పాకిస్థాన్
శుక్రవారం పాకిస్థాన్ సైన్యం నిర్వహించిన ప్రెస్ మీడియాలో కీలక విషయాలను వెల్లడించింది. ఆఫ్ఘన్ దాడుల్లో తమ వైపు 12 మంది సైనికులు మరణించారని.. ఒక సైనికుడు గల్లంతవ్వగా.. మరో 27 మంది తీవ్రంగా గాయపడ్డారని అధికారికంగా అంగీకరించింది. అయితే తాము జరిపిన ఎదురుదాడుల్లో 274 మంది ఆఫ్ఘన్ పోరాట యోధులను మట్టుబెట్టినట్లు పాక్ ప్రకటించింది. అంతేకాకుండా ఆఫ్ఘనిస్థాన్‌కు చెందిన 73 చెక్ పోస్టులను ధ్వంసం చేశామని.. 18 పోస్టులను తమ ఆధీనంలోకి తీసుకున్నామని పాక్ ఆర్మీ పేర్కొంది.

ఉంగిలి చూపిస్తే.. పిడికిలితో కొడతాం..
ఆఫ్ఘనిస్థాన్ ఆర్మీ చీఫ్ ఫసీహుద్దీన్ ఫిత్రత్ పాక్ మిలిటరీ నాయకత్వాన్ని ఉద్దేశించి సంచలన కామెంట్స్ చేశారు. "పాకిస్థాన్ మా దేశ భూభాగంపై ఉంగిలి చూపిస్తే.. మేము పిడికిలితో సమాధానం చెబుతాం. మా భూభాగంపై జరిగే ఏ ఒక్క దాడిని కూడా మేము వదిలిపెట్టం. ఒకవేళ పాక్ తన దురాగతాలను కొనసాగిస్తే.. ఇస్లామాబాద్‌లోని ప్రధాన కేంద్రాల్లో కూడా మీరు సురక్షితంగా ఉండలేరు" అని ఆయన హెచ్చరించారు.
పాక్ రాజధానిలో ఆఫ్ఘన్ ఎయిర్ స్ట్రైక్స్
శుక్రవారం ఆఫ్ఘన్ దళాలు పాకిస్థాన్ గుండెల్లో నిద్రపోయాయి. ఇస్లామాబాద్‌లోని పాక్ ప్రధాని నివాసానికి కేవలం 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక ఆర్మీ క్యాంప్‌పై ఆఫ్ఘన్ దళాలు వైమానిక దాడులు చేశాయి. వీటితో పాటు ఖైబర్ పఖ్తుంఖ్వాలోని నౌషెరా, జమ్రూద్, అబోటాబాద్ ప్రాంతాల్లో కూడా ఆఫ్ఘన్ ఎయిర్ స్ట్రైక్స్ నిర్వహించి పాక్ బలగాలను కోలుకోలేని దెబ్బ తీశాయి.
ఇరు దేశాల వాదనలు ఇలా..
యుద్ధం నేపథ్యంలో ఇరు దేశాలు పరస్పర దాడులపై భిన్నమైన గణాంకాలను విడుదల చేస్తున్నాయి. తమ దాడుల్లో 55 మంది పాక్ సైనికులు మరణించారని.. తమ వైపు కేవలం 8 మంది మాత్రమే అమరులయ్యారని ఆఫ్ఘన్ పేర్కొంది. ఆఫ్ఘన్ తాలిబన్ ప్రభుత్వాన్ని ఒక "అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ"గా పాక్ అభివర్ణించింది. తమ ప్రతిదాడిలో ఆఫ్ఘన్‌కు చెందిన 115 ట్యాంకులు, ఆర్టిలరీ గన్లను ధ్వంసం చేశామని చెప్పుకొచ్చింది.
ప్రజల్లో ఆగ్రహం.. జిహాద్‌కు సిద్ధం
పాకిస్థాన్ వైఖరిపై ఆఫ్ఘనిస్థాన్ ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. పాకిస్థాన్‌ను "ఇస్లాం, మానవత్వానికి శత్రువు"గా ఆఫ్ఘన్ పౌరులు అభివర్ణిస్తున్నారు. తమ నేతలు పిలుపునిస్తే దేశ రక్షణ కోసం 'జిహాద్' చేయడానికి కూడా తాము సిద్ధమని అక్కడి ప్రజలు నినదిస్తున్నారు. ఆఫ్ఘన్ హోం మంత్రి సిరాజుద్దీన్ హక్కానీ కూడా పాకిస్థాన్‌కు వ్యతిరేకంగా నిర్ణయాత్మక పోరాటం చేస్తామని ప్రకటించారు.
-
వి ఆర్ రెడీ: పాకిస్థాన్ సంచలన ప్రకటన -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
ఏపీ, తెలంగాణలో రెండు కొత్త ఎయిర్‌పోర్ట్‌లకు గ్రీన్ సిగ్నల్ - ఈ ప్రాంతాల్లోనే..!! -
PDS Kerosene: మళ్లీ రేషన్ షాపుల్లో కిరోసిన్-కేంద్రం అత్యవసర ఆదేశాలు..! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్ -
విజయ్ పార్టీకి త్రిష శాపం? రెండు చోట్ల ఓటమి ఖాయం! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
కొత్త పెన్షన్ల పై ప్రభుత్వం కీలక నిర్ణయం: పంపిణీ ముహూర్తం, మార్గదర్శకాలు..!!












Click it and Unblock the Notifications