వైరల్ వీడియో: మహిళా జర్నలిస్ట్ కు కన్నుకొట్టిన పాక్ లెఫ్టినెంట్ జనరల్..
పాకిస్థాన్ సైనిక అధికార ప్రతినిధి, లెఫ్టినెంట్ జనరల్ అహ్మద్ షరీఫ్ చౌదరి.. తన హోదాకు మచ్చ తెచ్చేలా సభ్య సమాజం తలదించుకునేలా వ్యవహరించారు. గౌరవమైన వృత్తిలో ఉండి ఇలాంటి పనులు అది కూడా బహిరంగ ప్రదేశాల్లో చేయడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తున్నాయి. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఇటీవల విలేకరుల సమావేశంలో ఓ మహిళా జర్నలిస్టు అడిగిన ప్రశ్నలకు బదులిస్తూ.. ఆమె వైపు చూస్తూ అహ్మద్ షరీఫ్ కన్ను కొట్టారు. ఈ వీడియో నెట్టింట్లో వైరల్ గా మారింది. ఈ ఘటనపై నెటిజన్లు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
డిసెంబర్ 9న జరిగిన ప్రెస్ మీట్ లో మహిళా జర్నలిస్టు అబ్సా కోమల్.. పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పై వచ్చిన ఆరోపణలపై లెఫ్టినెంట్ జనరల్ అహ్మద్ షరీఫ్ చౌదరిని ప్రశ్నించారు. ఇమ్రాన్ ఖాన్‌ను 'జాతీయ భద్రతకు ముప్పు', 'రాష్ట్ర వ్యతిరేకి', 'దిల్లీ చేతిలో కీలుబొమ్మ' తదితర ఆరోపణలు చేసిన నేపథ్యంలో.. ఆమె ఆ ప్రశ్నలను సంధించారు. అయితే, పాకిస్థాన్ ఇంటర్-సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్ (DGISPR) డైరెక్టర్ జనరల్ చౌదరి, ఆమె ప్రశ్నకు కనుసైగతో సమాధానం ఇచ్చారు.

ఈ వీడియో డిసెంబర్ 9, 2025న 'ఎలైట్ ప్రిడేటర్స్' అనే ఖాతా ద్వారా ఎక్స్ (గతంలో ట్విట్టర్)లో తొలుత పోస్ట్ చేయబడింది. ఈ వీడియోపై నెటిజన్లు తీవ్రంగా స్పందించారు. ఓ నెటిజన్.. ఇదంతా లైవ్ లోనే బహిరంగంగా జరుగుతోంది.. అన్నాడు. పాకిస్థాన్ లో ప్రజాస్వామ్యం అంతమైపోయింది.. ప్రధాని కీలుబొమ్మ అని వ్యాఖ్యానించగా, మరొకరు దేశానికే ఒక మీమ్ అని అభివర్ణించారు.
Pakistan's Army's DG ISPR winking at a female journalist after she questioned why they are being labelled as funded by Delhi.
— Elite Predators (@elitepredatorss) December 9, 2025
Honestly, I am not even surprised.pic.twitter.com/FzA4SMgSM8
మరో నెటిజన్ మాట్లాడుతూ.. అతను వృత్తిరీత్యా సైనికుడు కాదని పేర్కొన్నారు. ఇంకొకరు.. యూనిఫాంలో ఉన్న వ్యక్తి ఇలా బహిరంగంగా కన్ను ఎలా కొట్టగలడు ?" అని ప్రశ్నించారు. మరోవైపు అహ్మద్ షరీఫ్ చౌదరి నేపథ్యం కూడా ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. అతని తండ్రి సుల్తాన్ బషీరుద్దీన్ మహమూద్ .. ఓ ఉగ్రవాది.. అతను ఒసామా బిన్ లాడెన్ కు సహాయకుడు. ఇక ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
-
భారత్ కు గుడ్ న్యూస్ చెప్పిన పాకిస్థాన్ -
నేడే హనుమాన్ జయంతి- ఛైత్ర పౌర్ణమి నాడే -
భారత్ కు మెషిన్ గన్స్ పంపించిన ఇజ్రాయెల్.. పాకిస్థాన్ పని ఖతం.. -
గోరు వెచ్చని నీటిలో నిమ్మరసం కలిపి తాగుతున్నారా - అయితే, ఇది మీ కోసమే..!! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
మళ్లీ మొదలెట్టావా పాప.. ప్రెగ్నెన్సీ నిజమేనా? -
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
విజయ్ దేవరకొండపై ఆ స్టార్ హీరో భార్య సీక్రెట్ లవ్.. పెళ్లయినా ఆగని..! -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం












Click it and Unblock the Notifications