
పఠాన్‌కోట్ దాడి: నవాజ్ షరీఫ్ అలంకార ప్రధానేనా?
న్యూఢిల్లీ: పాకిస్థాన్‌కు కర్త-కర్మ-క్రియా అన్నీ తామేననీ, ప్రధాని నవాజ్ షరీఫ్ కానేకాదంటూ పాకిస్తాన్ సైనిక సారధి, ఐఎస్‌ఐలు పఠాన్‌కోట్ దాడి ద్వారా ఆయనకు హెచ్చరిక చేశాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రధాని మోడీ, పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ భేటీ అనంతరం పఠాన్‌కోఠ్ దాడి జరిగింది.
ఈ దాడి ద్వారా నవాజ్ షరీఫ్ కేవలం పాకిస్తాన్‌కు అలంకారప్రాయ ప్రధాని మాత్రమేననే విషయాన్ని పాక్ సైన్యం, ఐఎస్ఐలు పఠాన్‌కోట్ దాడి ద్వారా చెబుతున్నాయని అంటున్నారు. తమ అభిప్రాయం మేరకే దేశాన్ని నడిపిస్తామని ఏకంగా నవాజ్ షరీఫ్‌కే సవాల్ లేదా హెచ్చరికగా అభిప్రాయపడుతున్నారు.

వారంతా ఆత్మాహుతి దళానికి చెందనవారే: జైట్లీ
పంజాబ్‌లోని పఠాన్‌కోట్‌లో ఆత్మాహుతి దళానికి చెందినవారే దాడులకు పాల్పడ్డారని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి అరుణ్ జైట్లీ తెలిపారు. సోమవారం ఆయన మాట్లాడారు. ఉగ్రవాదులు బాగా శిక్షణ పొందినవారని, వైమానికి స్థావరం ఆస్తుల ధ్వంసమే లక్ష్యంగా దాడులు జరిగాయన్నారు.
పఠాన్‌కోట్ వైమానికి స్థావరం చాలా విశాలమైనదని, ప్రస్తుతం ముమ్మర తనిఖీలు కొనసాగుతున్నాయని, అక్కడ సైనిక కార్యాచరణ ముగిసిన తర్వాత పాక్‌తో చర్చలపై నిర్ణయం తీసుకుంటామని, ఉగ్రవాదులను పట్టుకునే లక్ష్యంతో సైనిక కార్యాచరణ కొనసాగుతోందన్నారు.