వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇండో పసిఫిక్ ప్రాంతంలో అలజడి సృష్టిస్తే ఊరుకోబోమన్న ప్రధాని..చైనాకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన మోదీ

|
Google Oneindia TeluguNews

భారత్‌లో అభివృద్ధి జరిగితేనే ప్రపంచ దేశాలు అభివృద్ధి చెందుతాయని, భారత్‌లో సంస్కరణలు జరిగితేనే ప్రపంచదేశాలు రూపాంతరం చెందుతాయని చెప్పారు ప్రధాని నరేంద్ర మోదీ. 76వ ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశాల్లో ప్రసంగించిన ప్రధాని మోదీ చైనాకు గట్టి వార్నింగ్ పంపారు. ఇండో పసిఫిక్ ప్రాంతంలో ఎవరైనా దురాగతాలకు పాల్పడితే ఊరుకునేదిలేదని తేల్చి చెప్పారు. కరోనా కట్టడిలో భారత్ విజయం సాధించిందని చెప్పిన మోదీ...నాసల్ వ్యాక్సిన్‌ త్వరలోనే భారత్ తీసుకొస్తుందని చెప్పారు. అఫ్గానిస్తాన్‌ గడ్డను ఉగ్రవాదం ప్రమోట్ చేసేందుకు వినియోగించకూడదని ప్రధాని మోదీ చెప్పారు. ఇక శాస్త్రసాంకేతిక రంగంలో భారత్ దూసుకెళుతోందని చెప్పారు. ఇక ఇదే సమయంలో పాకిస్తాన్‌ సరిహద్దుల వద్ద రెచ్చగొట్టే చర్యలు చేపడితే ధీటైన సమాధానం ఇస్తామని మోదీ స్పష్టం చేశారు. అఫ్గానిస్తాన్ మహిళలను పిల్లలను ఆదుకోవాలని ప్రధాని మోదీ ఈ సందర్భంగా ప్రపంచ దేశాలకు పిలుపునిచ్చారు.

PM Modi Speech In UNGA Summit Live Updates In Telugu:Know the issues that PM will Address

Newest First Oldest First
6:59 PM, 25 Sep

ఐక్యరాజ్యసమితిలో ముగిసిన ప్రధాని మోదీ ప్రసంగం
6:56 PM, 25 Sep

కొందరు ఉగ్రవాదాన్ని రాజకీయ పరికరంగా వాడుకుంటున్నారు: ప్రధాని మోదీ
6:55 PM, 25 Sep

ఐక్యరాజ్య సమితి వేదికగా చైనాకు వార్నింగ్ ఇచ్చిన ప్రధాని మోదీ
6:54 PM, 25 Sep

ఇండో పసిఫిక్ ప్రాంతంలో ఎవరి దురాగతాలు చెల్లవు: ప్రధాని మోదీ
6:54 PM, 25 Sep

అఫ్గానిస్తాన్‌ గడ్డను ఉగ్రవాదంకు వినియోగించుకోకూడదు: ప్రధాని మోదీ
6:52 PM, 25 Sep

ఉగ్రవాదంను అణిచివేయడంలో భారత్ ముందుంటుంది:ప్రధాని మోదీ
6:52 PM, 25 Sep

ఈ రోజు అంతరిక్షంలోకి వెళుతున్న భారత ఉపగ్రహాలను స్కూలు కాలేజీ విద్యార్థులు తయారు చేస్తున్నారు:ప్రధాని మోదీ
6:51 PM, 25 Sep

తీవ్రవాదం ప్రస్తుతం ప్రపంచ దేశాలకు సవాలుగా మారాయి: ప్రధాని మోదీ
6:50 PM, 25 Sep

హరిత శక్తి వైపు భారత్ అడుగులు వేస్తోంది: ప్రధాని మోదీ
6:50 PM, 25 Sep

భారత్ 400గిగా వాట్ల మేరా పునరుత్పాదక శక్తిని ఉత్పత్తి చేస్తోంది: ప్రధాని మోదీ
6:49 PM, 25 Sep

ఎంఆర్‌ఎన్‌ఏ వ్యాక్సిన్ పరీక్షలు చివరి దశలో ఉన్నాయి: ప్రధాని మోదీ
6:49 PM, 25 Sep

త్వరలోనే భారత్‌ నాసల్ వ్యాక్సిన్‌ను తీసుకువస్తుంది: ప్రధాని మోదీ
6:48 PM, 25 Sep

భారత్‌లోని వైద్యులు, శాస్త్రవేత్తలు, ఇంజినీర్లు ప్రపంచ దేశాలకు సేవలను అందిస్తున్నారు: ప్రధాని మోదీ
6:47 PM, 25 Sep

వ్యాక్సిన్‌ తయారీ సంస్థలను భారత్‌లో వ్యాక్సిన్ తయారు చేసేందుకు రావాలని ఆహ్వానిస్తున్నాను: ప్రధాని మోదీ
6:47 PM, 25 Sep

కోవిన్ టెక్నాలజీ ద్వారా ప్రతిరోజు భారత్‌కు సేవలందిస్తున్నాం:ప్రధాని మోదీ
6:46 PM, 25 Sep

యూపీఐ ద్వారా నేడు భారత్‌లో రూ.300 కోట్లకు పైగా లావాదేవీలు జరుగుతున్నాయి: ప్రధాని మోదీ
6:45 PM, 25 Sep

భారత్‌లో సంస్కరణలు వస్తే.. ప్రపంచదేశాల రూపురేఖలు మారుతాయి: ప్రధాని మోదీ
6:44 PM, 25 Sep

భారత్‌లో అభివృద్ధి జరిగితే ప్రపంచ దేశాల్లో అభివృద్ధి జరుగుతుంది: ప్రధాని మోదీ
6:44 PM, 25 Sep

50 కోట్ల మందికి ఉచితంగా వైద్యంం అందుతోంది: ప్రధాని మోదీ
6:43 PM, 25 Sep

గత కొన్నేళ్లుగా భారత్‌లో వేగవంతమైన అభివృద్ధి చోటుచేసుకుంటోంది: ప్రధాని మోదీ
6:39 PM, 25 Sep

ఒకప్పుడు చాయ్ అమ్ముకుని జీవనం సాగించిన ఓ కుర్రాడు నేడు ఓ అఖండ భారత దేశానికి ప్రధాని అయి, నాల్గవ సారి ఐక్యరాజ్యసమితిలో ప్రసంగిస్తున్నాడు: ప్రధాని మోదీ
6:38 PM, 25 Sep

భారత దేశంలో ఎన్నో భాషలు,ఎన్నో సంస్కృతులు ఇవన్నీ మేళవింపే ప్రజాస్వామ్యం
6:37 PM, 25 Sep

కరోనా వ్యాధి సోకి ఎంతో మంది చనిపోయారు. వారందరికి ఈ సందర్భంగా సంతాపం తెలుపుతున్నాను: ప్రధాని మోదీ
6:37 PM, 25 Sep

గత ఏడాదిన్నర కాలంగా ప్రపంచం కరోనా మహమ్మారితో తీవ్రంగా నష్టపోయింది: ప్రధాని మోదీ
6:36 PM, 25 Sep

ప్రసంగం ప్రారంభించిన ప్రధాని మోదీ
6:31 PM, 25 Sep

ఐక్యరాజ్యసమితి సమావేశాలకు హాజరైన విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జైశంకర్ మరియు జాతీయ భద్రతాధికారి అజిత్ దోవల్
6:25 PM, 25 Sep

ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయానికి చేరుకున్న ప్రధాని. మరికాసేపట్లో ప్రధాని మోదీ ప్రసంగం
6:25 PM, 25 Sep

ఐక్యరాజ్య సమితి వద్ద భారత్‌ మాతాకీ జై నినాదాలు
5:57 PM, 25 Sep

ప్రధాని నరేంద్ర మోదీ చివరిసారిగా 2019లో ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశాల్లో ప్రసంగించారు
4:58 PM, 25 Sep

ఐక్యరాజ్య సమితి సమావేశాల్లో పాల్గొనేందుకు వాషింగ్టన్ నుంచి న్యూయార్క్‌కు బయలుదేరి వెళ్లిన ప్రధాని మోదీ
READ MORE

English summary
PM Modi who is on US Visit will Address the 76th session of the United General Assembly on saturday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X