మానవాళికి అతి పెద్ద సవాల్- ప్రధాని మోదీ ఆందోళన
దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్‌బర్గ్‌లో ఏర్పాటైన జీ20 లీడర్స్ సమ్మిట్ రెండవ సెషన్లో.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగించారు. పలు అంశాలను ప్రస్తావించారు. ఉగ్రవాదం అణచివేత, వాతావరణ మార్పులు, విపత్తుల నిర్వహణ, ప్రపంచ దేశాల మధ్య సమన్వయం- పరస్పర సహకారం, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ వంటి విషయాలపై ఆయన తన అభిప్రాయాలను వెల్లడించారు. అంతర్జాతీయ సహకారాన్ని పెంపొందించాల్సిన అవసరం ఉందని అన్నారు.
ప్రపంచవ్యాప్తంగా విపత్తుల దుష్ప్రభావాలు పెరుగుతున్నాయని మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. ఇవి మానవాళికి పెద్ద సవాలుగా పరిణమించాయని అన్నారు. ఈ రంగంలో ప్రపంచ సహకారాన్ని బలోపేతం చేయడానికి, తన 2023 జీ20 అధ్యక్షతన జరిగిన డిజాస్టర్ రిస్క్ రిడక్షన్ వర్కింగ్ గ్రూప్‌ను ఏర్పాటు చేసిందని గుర్తు చేశారు. ఈ సమస్యకు ప్రాధాన్యత ఇచ్చినందుకు దక్షిణాఫ్రికాను ప్రశంసించారు.

విపత్తులు మానవాళికి పెద్ద సవాలుగా మారుతున్నాయని, ఈ సంవత్సరం కూడా మెజారిటీ దేశాలను తీవ్రంగా ప్రభావితం చేశాయని చెప్పారు. ఈ సంఘటనలు- విపత్తులను ఎదుర్కోవడంపై అంతర్జాతీయ సహకారాన్ని మరింత బలోపేతం చేయాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తోన్నాయని అన్నారు. ఈ పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షించడానికి డిజాస్టర్ రిస్క్ రిడక్షన్ వర్కింగ్ గ్రూప్‌ను ఏర్పాటు చేశామని, ఈ ముఖ్యమైన అజెండాకు ప్రాధాన్యత ఇచ్చినందుకు దక్షిణాఫ్రికాను అభినందిస్తున్నానని చెప్పారు.
విపత్తులను తట్టుకునే సామర్థ్యాన్ని పెంపొందించుకోవడానికి క్విక్ రియాక్షన్ ఆధారిత విధానం నుండి అభివృద్ధి-కేంద్రీకృత విధానానికి మారాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. ఈ విషయంలో ఉపగ్రహాలను వినియోగించుకోవాల్సి ఉందని, అంతరిక్ష సాంకేతికత మానవాళికి ఉపయోగపడాలనేది తమ ఉద్దేశమని అన్నారు. ఉపగ్రహ డేటాను మరింత అందుబాటులోకి తీసుకురావడానికి, ముఖ్యంగా గ్లోబల్ సౌత్ కోసం అనుకూలంగా మార్చడానికి జీ20 ఓపెన్ శాటిలైట్ డేటా పార్టనర్‌షిప్‌ను ప్రతిపాదించారు.
జీ20 సభ్య దేశాల అంతరిక్ష సంస్థల నుండి ఉపగ్రహ డేటా, అనాలసిస్ ను మరింత అందుబాటులోకి తీసుకుని రావడం ఉపయోగకరంగా మారుస్తుందని అన్నారు. ముఖ్యంగా గ్లోబల్ సౌత్‌లోని దేశాలకు ఇది అత్యవసరమని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. అలాగే ప్రపంచ దేశాలన్నీ కూడా నిలకడగా అభివృద్ధి సాధించడానికి విపత్తులను విజయవంతంగా ఎదుర్కొనాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఈ సందర్భంగా జీ20 క్రిటికల్ మినరల్స్ సర్క్యులారిటీ ఇనిషియేటివ్‌ను ప్రతిపాదించారు.
-
రైతుల ఖాతాలలో 48గంటల్లోనే డబ్బులు జమ.. శుభవార్త చెప్పిన మంత్రి! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!!












Click it and Unblock the Notifications