విలాస జీవితం: షాపింగ్‌కు ఏటా రూ,. 20కోట్లు, మొగాబే దంపతుల లైఫ్ స్టైల్
జింబాబ్వే అధ్యక్షుడు రాబర్ట్ మొగాబే దంపతులు అత్యంత విలాస జీవితాన్ని గడిపేవారు. జింబాబ్వే రాజధాని హరారేతో పాటు ప్రపంచంలోని పలు దేశాల్లో మొగాబేకు అత్యంత విలాసవంతమైన భవంతులున్నాయని సమాచారం.
హరారే: జింబాబ్వే అధ్యక్షుడు రాబర్ట్ మొగాబే దంపతులు అత్యంత విలాస జీవితాన్ని గడిపేవారు. జింబాబ్వే రాజధాని హరారేతో పాటు ప్రపంచంలోని పలు దేశాల్లో మొగాబేకు అత్యంత విలాసవంతమైన భవంతులున్నాయని సమాచారం.
సైనిక కుట్ర ద్వారా పదవీచ్యుతుడై ప్రస్తుతం గహ నిర్బంధం అనుభవిస్తున్న జింబాబ్వే అధ్యక్షుడు రాబర్ట్ మొగాబే దంపతులు, వారి పిల్లలు ఇంతకాలం అనుభవించిన రాజభోగాలను అనుభవించారు.
మొగాబేకు 93 ఏళ్లుకాగా, గుస్సీ గ్రేసికి 52 ఏళ్లు. ఇద్దరి మధ్య వయస్సు తేడా 41 ఏళ్లు. కేవలం రాజరికం భోగభాగ్యాలను అనుభవించేందుకే మొగాబేను విడిచిపెట్టకుండా ఇప్పటికీ అంటుకు తిరుగుతుందని జింబాబ్వే ప్రజలు భావిస్తారు.

హరారేలో రూ.75 కోట్ల భవంతి
మొగాబే దంపతులు జింబాబ్వే రాజధాని హరారేలోని 75 కోట్ల రూపాయల విలాసమైన భవంతి లో నివసిస్తున్నారు. ఈ భవంతిలో సకల సౌకర్యాలతో 25 పడక గదులు ఉన్నాయి. ప్రస్తుతం ఇదే భవంతిలో మొగాబే, ఆయన భార్య గుస్సీ గ్రేసీ గహ నిర్బంధంలో ఉన్నారు. ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల్లో సొంత భవనాలు ఉన్నాయి.

గుస్సీ విచ్చల విడిగా ఖర్చు
మొగాబే భార్య గుస్సీ గ్రేసి డబ్బులను విచ్చిల విడిగా ఖర్చుపెడతారని అంటున్నారు.తన కూతురు పెళ్లి కోసం 30 కోట్ల రూపాయలను ఖర్చు పెట్టారు. ఇటీవలనే ఆమె మూడు కోట్ల రూపాయలు పెట్టి రోల్స్ రాయిస్ కారు కొన్నారు. ఆమె తలగడ పక్కన రెండు కోట్ల రూపాయల వజ్రం పొదిగిన డ్రా ఉంటుంది. ఇక 12 వజ్రపు ఉంగరాలు, 62 జతల ఖరీదైన ఫెర్రగామో చెప్పులు, 80 లక్షల రూపాయల రోలెక్స్ గడియారాలున్నాయి.

ఏటా షాపింగ్‌కు రూ. 20 కోట్లు ఖర్చు
ప్యారిస్ పర్యటనకు వెళ్లిన సమయంలో గుస్సీ ఒక్కరోజే కోటి ఇరవై లక్షల రూపాయల షాపింగ్ చేశారు. ఏడాదికి ఆమె షాపింగ్ ఖర్చు 20 కోట్ల రూపాయలకు పైనేనని 2014లో నిపుణులు అంచనా వేశారు. ఈ కుటుంబం అత్యంత విలాసవంతమైన జీవితాన్ని అనుభవించారు. అంతేకాదు ఆమె కొడుకులు కూడ ఇదే రీతిలో వ్యవహరించారని కథలు కథలుగా చెబుతారు.

మొగాబేతో గుస్సీ వివాహం వైభవంగా
1996లో గుస్సీతో మొగాబే పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. మొదటి భార్య చనిపోవడంతో గుస్సీని మొగాబే వివాహం చేసుకొన్నారు. ఆ పెళ్లి వైభవాన్ని చూసి జింబాబ్వేలోనే ‘వెడ్డింగ్ ఆఫ్ ది సెంచరీ'గా కీర్తించారు.మొగాబే మూడేళ్ల క్రితమే, అంటే తన 90వ జన్మదినోత్సవాన్ని ఆరుకోట్ల ఖర్చుపెట్టి జరుపుకున్నారు.












Click it and Unblock the Notifications