ఉక్రెయిన్ పై రష్యా మరోసారి భారీ ఎటాక్.. చర్చల వేళ..
రష్యా మరోసారి ఉక్రెయిన్ పై దాడులకు పాల్పడింది. డ్రోన్ లు, మిసైల్స్ తో ఉక్రెయిన్ లోని పలు ప్రాంతాలపై విరుచుకుపడింది. ఉక్రెయిన్ లోని కీవ్, ఖార్ఖివ్ నగరాల్లో ఈ దాడులు చేపట్టింది రష్యా. మరోవైపు అమెరికా- ఉక్రెయిన్- రష్యా మధ్య త్రి సభ్య సమావేశం జరుగుతున్న నేపథ్యంలో ఈ దాడులు జరగడం గమనార్హం. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. రష్యా దాడుల్లో ఒకరు మృతి చెందగా మరో 15 మందికి గాయాలయ్యాయి.
మూడేళ్లకుపైగా భీకర యుద్ధం
రష్యా- ఉక్రెయిన్ మధ్య మూడేళ్లకుపైగా భీకర యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఇరు దేశాల మధ్య చర్చలు జరుగుతున్నా మరోవైపు దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా ఉక్రెయిన్ పై రష్యా మరోసారి విరుచుకుపడింది. ఉక్రెయిన్ లోని ప్రధాన నగరాలైన కీవ్, ఖార్ఖివ్ నగరాల్లో ఈ దాడులు చేపట్టింది రష్యా సైన్యం. ఈ డ్రోన్ దాడుల్లో ఒకరు మృతి చెందగా మరో 15 మందికి గాయాలయ్యాయి. ఇక ఈ దాడులపై ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి ఆండ్రీ సిబిహా కీలక వ్యాఖ్యలు చేశారు. ఓ పక్క శాంతి చర్చలు జరుగుతున్నా.. త్రిసభ్య సమావేశం జరుగుతున్నా.. ఉక్రెయిన్ ప్రజలకు మాత్రం మరో నిద్ర లేని రాత్రిగా ఈ రోజు మిగిలింది.. అని పేర్కొన్నారు.
త్రైపాక్షిక సమావేశం
ఇదిలాఉండగా యూఏఈలో జనవరి 23నుండి అమెరికా, రష్యా, ఉక్రెయిన్ దేశాల మధ్య తొలి త్రైపాక్షిక సమావేశం జరగనుంది. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ దావోస్ అంతర్జాతీయ సదస్సు వేదికగా ఈ విషయాన్ని ఇటీవల ప్రకటించారు. ఈ మేరకు రెండు రోజుల పాటు ఈ త్రైపాక్షిక సమావేశం జరగనుంది. 2022లో రష్యా- ఉక్రెయిన్ మధ్య యుద్ధం ప్రారంభమైన తర్వాత మొదటిసారిగా అమెరికా, రష్యా, ఉక్రెయిన్ ప్రతినిధులు ఒకే వేదికపై చర్చలు నిర్వహించనున్నారు.

మరోవైపు రష్యా- ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో దావోస్ సదస్సులో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, జెలెన్ స్కీలు భేటీ అయ్యారు. ఈ సమావేశం అనంతరం ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరు దేశాల మధ్య ముడేళ్లకుపైగా కొనసాగుతున్న యుద్ధం ముగియాలని ఆశాభావం వ్యక్తం చేశారు. వేలాది మంది ప్రాణాలు కోల్పోయారని పేర్కొన్నారు.
-
మళ్లీ మొదలెట్టావా పాప.. ప్రెగ్నెన్సీ నిజమేనా? -
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
విజయ్ దేవరకొండపై ఆ స్టార్ హీరో భార్య సీక్రెట్ లవ్.. పెళ్లయినా ఆగని..! -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
పవన్ కళ్యాణ్‌ని నిండాముంచిన హరీష్ శంకర్..












Click it and Unblock the Notifications