ఉక్రెయిన్ మెరుపు దాడి.. రష్యా ఆయిల్ రిఫైనరీ ధ్వంసం..
రష్యా- ఉక్రెయిన్ మధ్య మూడున్నరేళ్లుగా యుద్ధం కొనసాగుతూనే ఉంది. యుద్ధాన్ని ముగించేందుకు ఇరు దేశాల మధ్య చర్చలు జరుగుతున్నప్పటికీ రష్యా- ఉక్రెయిన్ మధ్య దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో తాజాగా రష్యాలోని ఆయిర్ రిఫైనరీపై ఉక్రెయిన్ దాడి చేసింది. ఉక్రెయిన్ .. తన నూతన ఫ్లామింగో మిసైల్ ను వినియోగించి రష్యాలోని ఆయిల్ రిఫైనరీని ధ్వంసం చేసింది. ఈ ఫ్లామింగో మిసైల్ 3,000 కిలోమీటర్ల రేంజ్, 1,500 కిలోల వార్ హెడ్ ఉంటుంది. ఉక్రెయిన్ తన సొంత మిసైల్ ను వినియోగించడం ఇదే తొలిసారి. ఫ్లామింగో క్షిపణి పూర్తిగా స్వదేశీ టెక్నాలజీతోనే రూపుదిద్దుకుంది.
ఫ్లామింగో క్షిపణి మాత్రమే కాకుండా రష్యాలోని ఎనర్జీ సంస్థలే టార్గెట్ గా పలు డ్రోన్ లు, లాంగ్ రేంజ్ మిసైల్స్ ను కూడా ఉపయోగించింది. రష్యాలోని డజన్ల కొద్దీ ఇంధన స్థావరాలపై దాడులకు పాల్పడింది. ఈ దాడి రష్యాలోని ఇంధన సామ్రాజ్యంపై జరిగిన నాలుగో దాడిగా తెలుస్తోంది. గతంలో మూడు సార్లు ఇలాంటి దాడులకే ఉక్రెయిన్ పాల్పడింది. క్రిమియాలోని ఆయిల్ టెర్మినల్ పైనా ఉక్రెయిన్ సైన్యం దాడికి పాల్పడింది. అలాగే ఉక్రెయిన్ దాడిలో.. రష్యాలోని డ్రోన్ స్టోరేజీ సైట్లు, ఓ రాడార్ స్టేషన్, కమాండ్ పోస్టులు, వెపన్ డిపోలు ధ్వంసం అయ్యాయి.

ఇదే ఘటనపై రష్యా డిఫెన్స్ మంత్రిత్వ శాఖ.. మాస్కో టైమ్స్ కు ఇచ్చిన వివరాల ప్రకారం.. ఉక్రెయిన్ నుంచి వచ్చిన 130 కు పైగా డ్రోన్ లను తాము నేలకూల్చినట్లు పేర్కొంది. ఉక్రెయిన్ సైన్యం ప్రధానంగా రష్యాలోని ఇంధన సామ్రాజ్యంపై దృష్టి పెట్టిందని.. వాటిని ధ్వంసం చేసి రష్యా ఆర్థిక వ్యవస్థను దెబ్బకొట్టాలని భావిస్తోందని తెలిపింది. అలాగే ఇంధన కొరతతో ప్రపంచ దేశాల్లో అస్థిరత నెలకొల్పాలని ఉక్రెయిన్ ప్లాన్ వేస్తోందని ఆరోపించింది. మరోవైపు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ.. ఫ్లామింగో మిసైల్ ను మోస్ట్ సక్సెస్ ఫుల్ మిసైల్ గా అభివర్ణించారు. మరి దీనిపై రష్యా ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి. అయితే తాజాగా ఉక్రెయిన్ కు చెందిన ఓ సీనియర్ నిఘా అధికారి రష్యాపై కీలక ఆరోపణలు చేశారు. రష్యా 1,20,000 గ్లైండ్ బాంబులను తయారు చేయడానికి ప్రణాళికలు రచిస్తున్నట్లు తెలిపారు.
-
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్












Click it and Unblock the Notifications