వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మరో ఇద్దరు మంత్రులు అవుట్: నాలుగుకు చేరిన రాజీనామాల సంఖ్య: పతనం దిశగా ప్రభుత్వం?

|
Google Oneindia TeluguNews

లండన్: బ్రిటన్ ప్రభుత్వం మరింత సంక్షోభంలో కూరుకుపోయినట్టే కనిపిస్తోంది. ఒకదాని తరువాత ఒకటి అనూహ్య పరిణామాలు సంభవిస్తోన్నాయి. ప్రధాన మంత్రి బోరిస్ జాన్సన్ ప్రభుత్వానికి మరో ఇద్దరు మంత్రులు గుడ్‌బై చెప్పారు. తమ పదవులకు రాజీనామా చేశారు. ఇది- అధికార కన్జర్వేటివ్ పార్టీని మరిన్ని ఇబ్బందులకు గురి చేసింది. కొత్త గండాన్ని సృష్టించింది. దీన్నుంచి ఆయన ఎలా బయడపడగలుగుతారనేది ఉత్కంఠతగా మారింది.

నాలుగుకు పెరిగిన నంబర్..

ఇదివరకే ఇద్దరు మంత్రులు బోరిస్ జాన్సన్ ప్రభుత్వం నుంచి తప్పుకొన్నారు. ఆర్థిక, వైద్య శాఖ మంత్రులు రిషి సునక్, సాజిద్ జావిద్.. తమ పదవులకు రాజీనామా చేశారు. దేశీయ టెక్ దిగ్గజం ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి అల్లుడు రిషి సునక్. తన పదవి నుంచి తప్పుకొన్నారు. రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. రాజీనామా లేఖను ప్రధాని బోరిస్ జాన్సన్‌కు పంపించారు. ఆరోగ్య శాఖ మంత్రి సాజిద్ జావిద్ కూడా తప్పుకొన్నారు.

పార్టీ గేట్ ఎఫెక్ట్..

పార్టీ గేట్ ఎఫెక్ట్..

ఈ రాజీనామాలకు ప్రధాన కారణం పార్టీ గేట్ వ్యవహారమేనని బ్రిటన్ మీడియా చెబుతోంది. లైంగిక దాడుల ఆరోపణలను ఎదుర్కొంటోన్న మాజీ మంత్రి క్రిస్ పించర్‌ను పార్టీ ఎంపీగా నామినేట్ చేయడం పట్ల బోరిస్ జాన్సన్ క్షమాపణలు కోరారు. ఆ వెంటనే రిషి సునక్, సాజిద్ జావిద్ రాజీనామాలు చేశారు. రిషి సునక్, సాజిద్ జావిద్ రాజీనామాలను క్వీన్ ఎలిజబెత్ 2 ఆమోదించిన కొద్దిసేపటికే ఆ రెండు శాఖలకు కొత్త వారిని అపాయింట్ చేశారు. విద్యాశాఖ మంత్రి నదీమ్ జహావికి ఆర్థిక శాఖను కేటాయించారు. కేబినెట్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ స్టీవ్ బార్క్లేకు వైద్య శాఖను అప్పగించారు.

మరో ఇద్దరు..

మరో ఇద్దరు..

దీనిపై చెలరేగిన ప్రకంపనలు తగ్గకముందే మరో ఇద్దరు మంత్రులు వైదొలిగారు. కుటుంబం, శిశు సంక్షేమ శాఖ మంత్రి విల్ క్విన్స్, రవాణా శాఖ జూనియర్ మంత్రి లారా ట్రాట్ తమ పదవులకు రాజీనామాలు చేశారు. రాజీనామా చేయడం తప్ప తనకు మరో ప్రత్యామ్నాయం లేదని విల్ క్విన్స్ చెప్పారు. అదే విషయాన్ని ఆయన తన రాజీనామా పత్రంలో పొందుపరిచారు. మంత్రిగా తనకు అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు చెప్పారు. రాజీనామా పత్రాన్ని ఆమోదించాలని కోరారు.

ప్రభుత్వంపై విశ్వాసం పోయిందంటూ..

ప్రభుత్వంపై విశ్వాసం పోయిందంటూ..

జూనియర్ ట్రాన్స్‌పోర్ట్ మినిస్టర్ లారా ట్రాట్ కూడా తన రాజీనామా లేఖను ప్రధానికి పంపించారు. రాజకీయాల్లో విశ్వసనీయత అవసరం అని, కొంతకాలంగా ఆ విశ్వాసాన్ని కోల్పోయినట్టు కనిపిస్తోందని వ్యాఖ్యానించారు. విశ్వసనీయత లేనప్పుడు పదవుల్లో కొనసాగలేమని స్పష్టం చేశారు. కాగా- బ్రిటన్ ప్రభుత్వంలో మరిన్ని రాజీనామాలు ఉండొచ్చనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. ఇది ప్రభుత్వంపై తీవ్ర ప్రభావాన్ని చూపొచ్చని అంచనా వేస్తోన్నాయి.

English summary
Two more UK ministers, Will Quince and Laura Trott resigned from Boris Johnson govt
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X