US-India Trade Talks: దిమ్మతిరిగేలా భారత్ ఆఫర్లు..! అమెరికా హ్యాపీ..!
భారత్-అమెరికా వాణిజ్య చర్చల్లో ఊహించని పురోగతి లభిస్తోంది. పహల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్ సింధూర్, రష్యా చమురు కొనుగోళ్ల నేపథ్యంలో ఇరు దేశాల మధ్య గ్యాప్ పెరిగింది. దీని ప్రభావంతో అమెరికా భారత్ పై 50 శాతం సుంకాలు కూడా విధించింది. దీంతో భారత్ వీటని తగ్గించాలని అమెరికాను పదే పదే కోరుతోంది. అయినా ఇప్పటికీ సానుకూల ప్రకటన రాలేదు. ఈ నేపథ్యంలో అమెరికాకు భారత్ భారీ ఆఫర్లు ఇస్తున్నట్లు వాణిజ్య చర్చల్లో పాల్గొంటున్న ఆ దేశ అధికారి ఒకరు వెల్లడించారు.
భారత్ తో జరుగుతున్న వాణిజ్య చర్చలు పురోగతి సాధించినట్లు అమెరికా వాణిజ్య వ్యవహారాల ప్రతినిధి జామిసన్ గ్రీర్ చట్టసభ సభ్యులకు వివరించారు. ముఖ్యంగా ధాన్యం, జొన్న, సోయాతో సహా అమెరికన్ వ్యవసాయ ఉత్పత్తులకు మార్కెట్ యాక్సెస్‌ను విస్తరించే లక్ష్యంతో జరుగుతున్న చర్చలలో భారత్ .. ఒక దేశంగా మనం ఇప్పటివరకు అందుకున్న ఆఫర్లలో అత్యుత్తమమైనది ఇచ్చినట్లు వెల్లడించారు. సున్నితమైన వ్యవసాయ అడ్డంకులను అధిగమించడానికి పనిచేస్తున్న అమెరికా వాణిజ్య సంబంధాల బృందం ప్రస్తుతం ఢిల్లీలో ఉందన్నారు.

భారత్ తాజా ప్రతిపాదనలు అసాధారణ ప్రారంభాన్ని సూచిస్తున్నాయని గ్రీర్ వెల్లడించారు. అమెరికన్ ఉత్పత్తిదారులు పేరుకుపోతున్న నిల్వలు, చైనా నుండి హెచ్చుతగ్గుల డిమాండ్‌ను ఎదుర్కొంటున్న సమయంలో భారత్ ఇప్పుడు తమ వస్తువులకు ఆచరణీయమైన ప్రత్యామ్నాయ మార్కెట్ అన్నారు. వీటి వాణిజ్యం కోసం మనం ఒక మార్గాన్ని కనుగొనాలని తెలిపారు. భారత్ ఆశాజనకంగా ఉన్నప్పటికీ అక్కడి మార్కెట్ చారిత్రాత్మకంగా కష్టమైందన్నారు.
ఆగ్నేయాసియా, యూరప్ వంటి ప్రదేశాలలో ప్రపంచవ్యాప్తంగా మార్కెట్ యాక్సెస్ తెరుస్తున్నామని గ్రీర్ చట్టసభకు తెలిపారు. ఈ కొత్త అవకాశాలు, భారత్ వంటి ప్రధాన భాగస్వాములతో వాషింగ్టన్ సంబంధాల్ని మరింత బలోపేతం చేస్తాయన్నారు. అలాగే రైతులు నిర్మాణాత్మక స్థిరమైన యాక్సెస్ పొందడంలో సాయపడతాయన్నారు. వ్యవసాయేతర రంగాలలో భారత్ తో విస్తృత సుంకం, మార్కెట్-యాక్సెస్ సమస్యలు తలెత్తుతాయని గ్రీర్ తెలిపారు. 1979 విమాన ఒప్పందం ప్రకారం పౌర విమానయాన భాగాలకు జీరో-టారిఫ్ నిబద్ధతల భవిష్యత్తు గురించి అడిగినప్పుడు, భారతదేశంతో చర్చలు చాలా ముందుకు సాగాయన్నారు.

అస్థిర సుంకాలు, మారుతున్న చైనా కొనుగోళ్ల మధ్య అమెరికన్ రైతులు ఎదుర్కొంటున్న ఒత్తిడిపై సెనేటర్లు ఆందోళన వ్యక్తం చేయగా...పరస్పర ఒప్పందాల కోసం ట్రంప్ ప్రభుత్వ ఒత్తిడి ఎగుమతిదారులకు కొత్త అవకాశాలను సృష్టిస్తోందని గ్రీర్ తెలిపారు. గత దశాబ్దంలో భారతదేశం-అమెరికా వాణిజ్య సంబంధాలు గణనీయంగా విస్తరించాయన్నారు. రెండు ప్రభుత్వాలు వ్యవసాయం, డిజిటల్ సేవలు, విమానయానం, ఔషధాలు, కీలకమైన ఖనిజాలలో మార్కెట్ యాక్సెస్ కోసం చర్చలు జరుపుతున్నాయని వెల్లడించారు.
-
ఇరాన్ యుద్ధంలో ఓడిపోతోంది ఎవరు ? తెరవెనుక ఏం జరుగుతోంది ? -
హార్ముజ్ సంగతి తర్వాత-యుద్దం ముగించేద్దాం..! ట్రంప్ మరో షాక్ ..! -
కొబ్బరి నీళ్లు Vs మజ్జిగ - రెండింటిలో వేసవిలో ఏది బెస్ట్..!! -
నేడే హనుమాన్ జయంతి- ఛైత్ర పౌర్ణమి నాడే -
గోరు వెచ్చని నీటిలో నిమ్మరసం కలిపి తాగుతున్నారా - అయితే, ఇది మీ కోసమే..!! -
భారత్ కు గుడ్ న్యూస్ చెప్పిన పాకిస్థాన్ -
భారత్ కు మెషిన్ గన్స్ పంపించిన ఇజ్రాయెల్.. పాకిస్థాన్ పని ఖతం.. -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
మళ్లీ మొదలెట్టావా పాప.. ప్రెగ్నెన్సీ నిజమేనా? -
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
విజయ్ దేవరకొండపై ఆ స్టార్ హీరో భార్య సీక్రెట్ లవ్.. పెళ్లయినా ఆగని..!












Click it and Unblock the Notifications