• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

అట్టుడుకుతోన్న వాషింగ్టన్: రక్తసిక్తం: దాడులు, ప్రతిదాడులు: మారణాయుధాలతో స్వైరవిహారం

|

వాషింగ్టన్: అమెరికా రాజధాని వాషింగ్టన్.. వేడెక్కింది. దాడులు, ప్రతిదాడులతో అట్టుడికిపోతోంది. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు మద్దతుగా చేపట్టిన ర్యాలీ హింసాత్మకంగా మారిపోయింది. దాడులు, ప్రతిదాడులు, అరెస్టులతో అల్లకల్లోలంగా తయారైంది వాషింగ్టన్. డొనాల్డ్ ట్రంప్‌కు మద్దతుగా మిలియన్ మేక్ అమెరికా గ్రేట్ ఎగైన్ పేరుతో నిర్వహించిన ప్రదర్శనను ఆంటిఫా, బ్లాక్ లైవ్ మ్యాటర్స్ (బీఎల్ఎం) ఉద్యమకారులు అడ్డుకోవడంతో పరిస్థితులు ఒక్కసారిగా హింసాత్మక రూపాన్ని సంతరించుకున్నాయి. దాడులు, ప్రతిదాడులతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

మిలియన్ మేక్ అమెరికా గ్రేట్ ఎగైన్ పేరుతో భారీ ర్యాలీ..

డొనాల్డ్ ట్రంప్‌కు అనుకూలంగా లక్షలాది మంది వాషింగ్టన్‌లో ప్రదర్శన నిర్వహించారు. నిరసనకారులతో వాషింగ్టన్ రోడ్లు నిండిపోయాయి. రహదారులన్నీ కిటకిటలాడాయి. మేక్ అమెరికా గ్రేట్ ఎగైన్ పేరుతో వారంతా ర్యాలీని నిర్వహించారు. పూర్తిస్థాయిలో ఎన్నికల పలితాలు వెలువడిన వెంటనే నిరసనకారులు ఈ ఆందోళనను చేపట్టారు. కొత్త అధ్యక్షుడు జో బిడెన్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అధ్యక్ష ఎన్నికల్లో మోసాలకు పాల్పడ్డారని, దొడ్డిదారిన ఎన్నికయ్యారంటూ నినదించారు. వారి ర్యాలీని ఆంటిఫా, బ్లాక్ లైవ్ మ్యాటర్స్ (బీఎల్ఎం) ఆందోళనకారులు అడ్డుకోవడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

చాలా చోట్ల పరస్పర ఘర్షణ..

ఫాసిజానికి వ్యతిరేకంగా ఏర్పాటైన సంస్థ ఆంటిఫా. జార్జ్ ఫ్లాయిడ్‌పై మరణించిన ఉదంతం అనంతరం నల్ల జాతీయులు బీఎల్ఎం ఉద్యమాన్నిపెద్ద ఎత్తున నిర్వహిస్తూ వచ్చారు. డొనాల్డ్ ట్రంప్ మద్దతుదారులు చేపట్టిన ఈ భారీ ప్రదర్శనను వారు అడ్డుకున్నారు. ట్రంప్ మద్దతుదారులతో వాగ్వివాదానికి దిగారు. ఒకరినొకరు తోసుకున్నారు. దాడులకు పాల్పడ్డారు. చాలా చోట్ల వారి మధ్య ఘర్షణలు చోటు చేసుకున్నాయి. పరస్పరం దాడులు చేసుకున్నారు. వాషింగ్టన్‌లో చీకటి పడుతున్న కొద్దీ.. పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారిపోయాయి. ఈ ఘర్షణల్లో పలువురికి గాయాలయ్యారు. వారిని అడ్డుకోవడానికి పోలీసులు చేసిన ప్రయత్నాలు విఫలం అయ్యాయి. పరిస్థితి అదుపు తప్పడం నేషనల్ గార్డులను తరలించాల్సి వచ్చింది.

మిలియన్ ఎంఏజీఏ జెండాలు దగ్ధం

ఈ ఘర్షణల్లో ఆంటిఫా, బీఎల్ఎం కార్యకర్తలు పలుచోట్ల ట్రంప్ మద్దతుదారులపై దౌర్జన్యానికి పాల్పడ్డారు. మేక్ అమెరికా గ్రేట్ ఎగైన్ అంటూ వారు ప్రదర్శించిన బ్యానర్లు, పోస్టర్లు తగులబెట్టారు. ట్రంప్ ఫొటోతో ఉన్న పతాకాలకు నిప్పు పెట్టారు. మేక్ అమెరికా గ్రేట్ ఎగైన్, డొనాల్డ్ ట్రంప్ జెండాలను అమర్చిన రెస్టారెంట్లపై వారు దాడులకు పాల్పడ్డారు. ఫర్నిచర్‌ను ధ్వంసం చేశారు. పోలీసులు వారిని అడ్డుకునే ప్రయత్నం చేసినప్పటికీ.. విఫలం అయ్యాయి. పోలీసులకు సైతం ఎదురు తిరగడం కనిపించింది. అమెరికా అధ్యక్షుడి అధికారిక నివాసం వైట్‌హౌస్‌కు సమీపంలో ఉన్న ది క్యాపిటల్ హిల్స్ హోటల్‌పై పెద్ద ఎత్తున దాడికి దిగారు ఆంటిఫా, బీఎల్ఎం కార్యకర్తలు.

  Trump Supporters Against Presidential Elections Results అక్రమంగా అధ్యక్ష స్థానం Jo Biden కైవసం ?

  ఒకరికద్దరికి కత్తిపోట్లు..

  క్యాపిటల్ హిల్స్ హోటల్ సమీపంలో ఒకరిద్దరిపై ఆంటిఫా కార్యకర్తలు మారణాయుధాలతో దాడికి పాల్పడినట్లు మీడియా వెల్లడించింది. ట్రంప్ అనుకూల ర్యాలీలో పాల్గొన్న ఇద్దరికి కత్తి పోట్లతో కనిపించినట్లు వాషింగ్టన్ పోలీసులను ఉటంకించింది. వారిని వెంటనే సమీప ఆసుపత్రికి తరలించినట్లు పేర్కొంది. ఈ ఘర్షణల్లో కొందరు పోలీసులకు కూడా గాయపడినట్లు తెలుస్తోంది. అధ్యక్ష ఎన్నికల్లో అక్రమాలు చోటు చేసుకున్నాయనేది ట్రంప్ మద్దతుదారుల వాదన. జో బిడెన్ అక్రమంగా అధ్యక్ష స్థానాన్ని కైవసం చేసుకోబోతున్నారని ఆరోపించారు. ప్రజల తీర్పునకు వ్యతిరేకంగా ఆయన గద్దెనెక్కుతున్నారని విమర్శించారు. మిచిగాన్, మిన్నెసొటా, విస్కాన్సిన్, పెన్సిల్వేనియా, అరిజోనా, జార్జియాల్లో డెమొక్రాట్లు ఓట్ల లెక్కింపులో అక్రమాలకు పాల్పడ్డారని మండిపడ్డారు.

  English summary
  A string of violent clashes erupted in Washington, DC, on Saturday night, hours after large crowds of protesters marched through the city in support of President Donald Trump. A number of anti-Trump counter-protesters and antifa members began brawling with Trump supporters.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X