వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

VIRAL NEWS.. 10 వేల ఫీట్ల ఎత్తులో..బ‌ర్గ‌ర్ తింటూ వీడియో, వైర‌ల్

|
Google Oneindia TeluguNews

విమానంలో ఉండి పై నుంచి చూస్తేనే భ‌యం వేస్తోంది. ఒక స్కై డైవ్ చేసేవారికి గుండె ధైర్యం బాగానే ఉండాలి అవును వారు చాలా ధైర్యవంతులు అయి ఉంటారు. మ‌రీ స్కై డైవ్ చేస్తూ.. ఫుడ్ తిన‌డం అంటే మాములు విష‌యం కాదు క‌దా... నిజ‌మే.. కానీ ఒక‌రు అలా చేశారు. ఆ వీడియోను ఇన్ స్టాలో షేర్ చేయ‌డంతో వైర‌ల్ అవుతుంది. ఆ వీడియో చూసి.. అమ్మాయి ధైర్యం సాహ‌సాలు ఎలా ఉన్నాయో లుక్కేయండి.

10 వేల ఫీట్ల ఎత్తులో డైవ్

10 వేల ఫీట్ల ఎత్తులో డైవ్

ఆ వీడియోను షేర్ చేసిన వ్య‌క్తి ఇన్ స్టాగ్రామ్ వీడియో క్రియేట‌ర్ మెకెన్నా నైపై.. ఆమె 10 వేల ఫీట్ల ఎత్తులో స్కై డైవింగ్ చేశారు. ఆమె లాగా ఇత‌రులు కూడా చేస్తారు. కానీ ఆమె కాస్త డిఫ‌రెంట్ గా ఆలోచించింది. అవును ఫుడ్ తింటూ ఆ వీడియోను షేర్ చేసింది. కెమెరా ముందు బ‌ర్గ‌ర్ ఓపెన్ చేసింది. ఆమె పారాచ్యూట్ క‌ట్టుకొని ఉంది. హెల్మెట్ కూడా ధ‌రించింది. ఇంకేముంది ఆ బ‌ర్గ‌ర్ ఓపెన్ చేసింది.

య‌మ్మీ బ‌ర్గ‌ర్

య‌మ్మీ బ‌ర్గ‌ర్

ఆ బ‌ర్గ‌ర్ ఏం చ‌క్కా తిన‌డం స్టార్ట్ చేసింది. వావ్.. య‌మ్మీ అంటూ ఊరిస్తూ తింది. కాసేపు అయ్యాక ప్యార‌చూట్ ఓపెన్ చేసింది. దాంతో ఆ వీడియో పూర్త‌వుతుంది. ఆమె ధైర్య సాహసాల‌ను ప్ర‌తీ ఒక్క‌రు మెచ్చుకుంటున్నారు. ఫుడ్ తినే స‌మ‌యంలో డ్యాన్స్ కూడా చేసింది. అంతేకాదు ప‌క్క‌న ఉన్న వారిని బ‌ర్గ‌ర్ తింటావా అని కూడా అడిగేసింది. ఆ వీడియోకు నెటిజ‌న్లు కామెంట్స్ చేస్తున్నారు.

నెటిజ‌న్ల రియాక్ష‌న్

ఆక్సిజ‌న్ ఎక్కువ శాతం ఉన్న చోట ఆమె బ‌ర్గ‌ర్ టేస్ట్ చేసింద‌ని ఒక‌రు అభిప్రాయ‌ప‌డ్డారు. మ‌రొక‌రు అదీ ఆన్ హెల్త్ అని నెగిటివ్ రియాక్ష‌న్ ఇచ్చారు. అదీ తిన‌డం వ‌ల్ల ఒళ్లు వ‌చ్చేస్తుంద‌ని పేర్కొన్నారు. కానీ ఆమె చేసిన ధైర్యాన్ని మాత్రం ప్ర‌తీ ఒక్క‌రూ ప్ర‌శంసిస్తున్నారు. నిజ‌మే.. 10 వేల ఫీట్ల ఎత్తులో పారాచ్యూట్ ప‌ట్టుకొని డైవ్ చేయ‌డ‌మే కాదు.. బ‌ర్గ‌ర్ కూడా తినేసింది.

English summary
Instagram video creator Mckenna Knipe has ticked it off her bucket list by eating burger at 10,000 feet while skydiving. video opens with Knipe showing the camera she is relishing burger from Impossible Foods while wearing helmet and hovering on parachute.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X