వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దుమారం: ఎవరీ దేవయాని, ఎలా ఎదిగారు?

By Pratap
|
Google Oneindia TeluguNews

న్యూయార్క్: భారత దౌత్యవేత్త దేవయాని కోబ్రాగాడే ఉదంతం తీవ్ర దుమారం రేపుతున్న విషయం తెలిసిందే. అమెరికా, భారత సంబంధాల మధ్య కూడా అది ప్రభావం చూపుతోంది. ఈ వ్యవహారం ఆ కెరీర్‌కు ముగింపు అవుతుందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

దేవయాని తండ్రి ఉత్తమ్ కోబ్రాగాడే మహారాష్ట్ర క్యాడర్‌కు చెందిన రిటైర్డ్ ఐఎఫ్ఎస్ అధికారి. బాల్యం నుంచే దేవయానికి తెలివైంది. ఆమె మౌంట్ కార్మెల్ పాఠశాలలో చదివింది. ఆ తర్వాత ముంబైలోని జిఎస్ మెడికల్ కళాశాల, కెఇఎం ఆస్పత్రి నుంచి ఎంబిబిఎస్ పట్టా తీసుకున్నారు. ఐఎఫ్ఎస్ అధికారుల కుటుంబానికి చెందిన దేవయానికి మెడిసిన్‌ను పక్కన పెట్టేసి ఐఎఫ్ఎస్‌ను వృత్తిగా ఎంచుకున్నారు.

Devyani Khobragade

ఆమె 1999లో ఐఎఎస్ పరీక్షలు పాసయ్యారు. పాకిస్తాన్, జర్మనీ, ఇటలీల్లో భారత మిషన్ పొలిటికల్ డివిజన్ బాధ్యతలను నిర్వహించారు. ఆ తర్వాత న్యూయార్క్‌లోని బారత దౌత్యకార్యాలయంలో డిప్యూటీ కాన్సుల్ జనరల్‌గా నియమితులయ్యారు.

ఆమె తన మాతృబాష మరాఠీలోనే కాకుండా ఆంగ్ల, హిందీ, జర్మన్ భాషల్లో అనర్గళంగా మాట్లాడగలరు. ఆమె 2012లో చెవెనింగ్ రోల్స్ రాయస్ స్కాలర్‌షిప్‌ను ఎన్నికయ్యారు. ఆమెకు యాత్రలంటే మహా ఇష్టం. పఠనంపై ఇతోధికమైన ఆసక్తి..

ఆమెకు సంగీతం, నృత్యం తెలుసు. దానికి తోడు సామాజిక కార్యకర్త కూడా. ఆమె మహిళా హక్కుల శాఖ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఆమె ప్రొఫెసర్‌ను వివాహం చేసుకుంది. వారికి మూడు, 6 ఏళ్ల వయస్సు గల ఇద్దరు కూతుళ్లు ఉన్నారు.

దేవయాని చుట్టూ వివాదం అలుమకోవడం ఇదే మొదటిసారి కాదు. ఆమె ముంబై ఆదర్శ్ హౌసింగ్ సొసైటీ స్కామ్‌లో ఉన్నట్లు రెండేళ్ల క్రితం వివాదం చెలరేగింది. రాష్ట్ర ప్రభుత్వం పది శాతం కోటా కింద కేటాయించిన ఇల్లు ఉన్నప్పటికీ ఆమె ఆదర్శ్‌లో 2005 - 2006లో మరో అపార్ట్‌మెంట్ పొందినట్లు మీడియాలో వార్తలు వచ్చాయి.

ఆ వివాదంపై ఆమెను గానీ ఆమె తండ్రిని గానీ విచారించలేదు. కానీ ఆదర్శ్‌ కుంభకోణంపై వేసిన విచారణ సంఘం ముందు ఆమె తండ్రి హాజరయ్యారు. తమకు ఉన్న అపార్టుమెంట్‌పై ప్రభుత్వానికి తెలియజేయాల్సిన బాధ్యత తనది గానీ తన కూతురిది గానీ కాదని చెప్పారు.

English summary
This is not a reminder of the news feed regarding Devyani Khobragade's arrest that is taking rounds of various media, but the fact that a bright career may just have come to an end.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X